RRR Movie: Jr NTR Shocking Comments On MM Keeravani Music Deets Inside - Sakshi
Sakshi News home page

Jr NTR-MM Keeravani: కీరవాణి మ్యూజిక్‌పై జూ. ఎన్టీఆర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Published Mon, Mar 21 2022 2:48 PM | Last Updated on Mon, Mar 21 2022 3:31 PM

Jr NTR Shocking Comments On MM Keeravani Music  - Sakshi

Jr NTR Shocking Comments: యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో మరోసారి ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీ అయిపోయింది. ఈ క్రమంలో వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ వినూత్నంగా ప్రచారం చేస్తోంది. తాజాగా ప్రమోషన్‌లో భాగంగా తారక్‌, చరణ్‌, సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణిలు సరదాగా ముచ్చటించారు.

చదవండి: అలా చేస్తే ‘గాడ్‌ ఫాదర్‌’ నుంచి తప్పుకుంటా: చిరుకు సల్మాన్‌ కండిషన్‌!

ఈ ఇంటర్వ్యూ హీరోలిద్దరిని ఆసక్తికర ప్రశ్నలు అడిగి వారిని ఇబ్బందిలో పెట్టాడు. ఇలా సాంతం ఇంటర్య్వూలో ఆసక్తిగా సాగింది. ఈ సందర్భంగా కిరణవాణి ఎన్నో ఎళ్లుగా పాటలు కంపోజ్‌ చేస్తూ పాడుతూ వచ్చాను. ఇక తన పాటల్లో అంత్యంత చెత్త కంపోజింగ్‌ ఏంటని చరణ్‌, తారక్‌లకు అడిగి ఇరకాటంలో పెట్టాడు కిరవాణి. దీనికి ఎన్టీఆర్‌ స్పందిస్తూ మీ కంపోజ్‌ చేసిన చెత్త పాటల్లో భీమవరం బుల్లోడా తనకు అస్సలు నచ్చదు అంటూ సూటింగా చెప్పేశాడు. కానీ ఆ పాట చాలా బాగుంటుంది, పాట మధ్యలో వచ్చే బీట్‌ తనకు బాగా నచ్చుతుంది అని చెప్పాడు.

చదవండి: ఎన్నో రకాలుగా మోసపోయాను: మోహన్‌ బాబు భావోద్వేగం

ఆ తర్వాత ఎన్టీఆర్‌ ‘భీమావరం బుల్లోడా పాలు కావాలా..’ అని పాడుతూ ఆ మధ్యలో వచ్చే మ్యూజిక్‌ తనకు అసలు నచ్చదని, చాలా ఇరిటేషన్‌గా అనిపిస్తుందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. కాగా ఈ పాట ఘరానా బుల్లోడి మూవీలోనిది. నాగార్జున, రమ్యకృష్ణ ఆమని,  కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా 1995 విడుదలైంది. ఈ మూవీ సమయంలో ఈ పాట సూపర్‌ సక్సెస్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ పాటకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి హిట్‌ పాట మరి ఎన్టీఆర్‌ ఎందుకు నచ్చలేదా అని అందరూ అభిప్రాయ పడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement