
దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కుటుంబం ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. ఎందుకంటే తమ కుటుంబానికి చెందిన ఇద్దరు వారసులు ఒకే సినిమాతో అరంగేట్రం చేసి దిగ్విజయాన్ని అందుకున్నారు. దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న తనయుడు శ్రీసింహా హీరోగా, పెద్ద కుమారుడు కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమైన చిత్రం ‘మత్తు వదలరా’. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం రోటీన్ చిత్రాల మత్తు వదిలిస్తోంది. విడుదలైన రోజు నుంచి హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు రాజమౌళి కుటంబం ఈ సినిమా సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.
ఇక మూవీ సక్సెస్ మీట్‌లో భాగంగా శ్రీసింహా, సత్య, అగస్త్యలను రాజమౌళి సరదాగా ఇంటర్వ్యూ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రోమోలో భాగంగా సినిమా విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో పేర్కొంటూ అదేవిధంగా చిత్ర షూటింగ్‌లో ఆ ముగ్గురు ఎదుర్కొన్న కష్టాలు, బాధలను రాజమౌళితో పంచుకున్నారు. పూర్తి వీడియోను త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక రితేష్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. నరేశ్ అగస్త్య, అతుల్య చంద్ర, వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీ, తదితరులు నటించారు.
చదవండి:
‘మత్తు వదలరా’ మూవీ రివ్యూ
జనవరి 3న వస్తున్న ‘యమదొంగ’!
Comments
Please login to add a commentAdd a comment