
నిండా నీళ్లున్న కుంటకు మళ్లీ నీళ్లా!
మేదరమెట్ల: కుంట నిండా నీళ్లు కనిపిస్తున్నా అధికారులు నేతలతో కుమ్మకై ్క మళ్లీ నీళ్లు పెడతామంటూ తీర్మానం చేసిన సంఘటన కొరిశపాడు మండలం ప్రాసంగులపాడు పంచాయతీలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సిద్దన్నకుంటలో పూర్తిస్థాయిలో నీరు నిండా ఉంది. అయినా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్థానిక నాయకులతో కుమ్మకై ్క నీరు నిండా ఉన్న కుంటకు మరలా నీరు పెడుతున్నట్లు అనంతరం బిల్లులు చేసుకునేలా ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. పనులు చేయకుండానే పనులు చేశామని బిల్లులు చేసుకోవడం ఏమిటని, ఇలా చేస్తుంటే ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి పనులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అధికారులతో ప్రజాప్రతినిధులు కుమ్మక్కు
మళ్లీ నీరు పెట్టేందుకు తీర్మానం

నిండా నీళ్లున్న కుంటకు మళ్లీ నీళ్లా!