
వ్యవసాయ కూలీ కుమారుడికి డాక్టరేట్
కొల్లూరు: వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టిన ఓ యువకుడు ఉన్నత చదువుల్లో రాణించి డాక్టరేట్ పొందడంపై స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మండలంలోని చింతర్లంకకు చెందిన యల్లమాటి ప్రభుదాసు, కృపావరం కుమారుడు మహేష్ చైనెలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాలలో అనాటమీ విభాగంలో ఎమ్మెస్సీ పీహెచ్‌డీ పట్టాను గత శుక్రవారం అందుకున్నారు. సీసం అనేది కెమికల్ అని, పురుషుల శుక్ర కణాలను తగ్గించడం వల్ల సంతాన సాఫల్యత తగ్గుతుందనే అంశంపై, శుక్రకణాలు పెంపొందిచుకోవడానికి చేపట్టాల్చిన అంశాలపై జరిపిన పరిశోధనలకుగాను డాక్టరేట్ అందుకున్నాడు. డాక్టరేట్ సాధించడంపై పలువురు గ్రామస్తులు మహేష్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నత చదువులు ద్వారా రాణించాలన్న లక్ష్యంతో తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా డాక్టరేట్ సాధించడం సంతోషకరంగా ఉందని వెల్లడించాడు.