రావినూతల వాసికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో స్థానం
మేదరమెట్ల: కొరిశపాడు మండలంలోని రావినూతల గ్రామానికి చెందిన మాధవీశ్రీ నాన్ స్టాప్ మ్యూజిక్ ప్లేలో గిన్నిస్ బుక్ ఆఫ్ వర్డల్ రికార్డు సాధించింది. విజయవాడలోని హలెల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా ప్రపంచస్థాయిలో 18దేశాల నుంచి 1100 మంది విద్యార్థులు సంగీత ప్రదర్శనలో పాల్గొన్నారు. కీ బోర్డు వాయిద్యంతో ఇచ్చిన ప్రదర్శనలో మాధవీశ్రీతో పాటు మొత్తం 1046 మందిని ఎంపిక చేసి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్‌ుడ్సలో నమోదు చేశారు. విజయవాడలోని మెట్రోపాలిటన్ చర్చిలో జరిగిన అభినందన సభలో మ్యూజికల్ స్కూల్ నిర్వాహకుడు అగస్టీన్ దండింగ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. తండ్రి రామారావుతో పాటు గ్రామానికి చెందిన పలువురు మాధవీశ్రీని అభినందించారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డులో అల్లూరు చిన్నారులు
అల్లూరు(కర్లపాలెం): పిట్టలవానిపాలెం మండలంలోని అల్లూరు గ్రామానికి చెందిన చిన్నారులు మ్యూజికల్ కీబోర్డు వాయించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. అల్లూరు గ్రామానికి చెందిన కొప్పుల రవికుమార్, సౌభాగ్య దంపతుల కుమార్తె ఆరాధ్య, కుమారుడు ఆద్యా ఆన్‌లైన్ బృంద సంగీత ప్రదర్శనలో మ్యూజికల్ కీబోర్డు వాయిద్యంలో ప్రతిభ కనబరిచి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. హలేల్ మ్యూజిక్ స్కూల్ అగస్టీన్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుని 18 దేశాల నుంచి 1,046మంది కీబోర్డు వాయిస్తూ జరిగిన ఆన్‌లైన్ పోటీలో ఆరాధ్య, ఆద్యా పాల్గొన్నారు. వీరిని గిన్నిస్ రికార్డ్సు ప్రతినిధులు ఇటీవల సత్కరించి సర్టిఫికెట్ అందజేశారు.


