
కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు
రేపల్లె రూరల్: హామీలను అమలు చేయడంలోను, సమస్యలను పరిష్కరించటంలోను కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ అన్నారు. ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు వినూత్నంగా మొదలుపెట్టిన పల్లెపడక కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం పంచాయతీ బాప్టిస్టుపాలెంలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, గురవుతున్న ఇబ్బందులను తెలుసుకొని ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కల్పించేందుకు పల్లెపడక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి పల్లెను, ప్రతి గడపలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవటమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సమస్యలను తెలుసుకోవటంతోపాటు ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక పరిష్కరించేదిశగా పనిచేస్తామన్నారు. గ్రామంలో విస్త్రతంగా పర్యటించి ప్రజలతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పది నెలల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. గుళ్లపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి బాప్టిస్టుపాలెం వరకు నిర్వహించిన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, దుండి వెంకటరామిరెడ్డి, ఇంకొల్లు రామకృష్ణ, యార్లగడ్డ వెంకట రాంబాబు, నాయకులు యార్లగడ్డ మదనమోహన్, చిమట బాలాజీ, చిత్రాల ఓబేదు, చదలవాడ శ్రీనివాసరావు, బసవయ్య, కేవీ కృష్ణారెడ్డి , నిజాంపట్నం కోటేశ్వరరావు, రాజు, సాంబశివారెడ్డి, కొండల్‌రెడ్డి, నాగలక్ష్మి, రత్నాకర్, రఘు, కిరణ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
ఆళ్లవారిపాలెం నుంచి పల్లె పడక ప్రారంభం వైఎస్సార్ సీపీ రేపల్లె సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్