
పునరావాసం కల్పించి ఇళ్లను కూల్చండి
గుంటూరురూరల్: ఇన్నర్ రింగ్‌రోడ్డు ఫేజ్ 3 నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 41వ డివిజన్ స్వర్ణభారతినగర్‌లో సుమా రు 200 ఇళ్లను అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా తొలగిస్తున్నారు. దీంతో ఇళ్లు కోల్పోతున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల నుంచి ఇక్కడ ఇళ్లు కట్టుకుని ఉంటున్నామని, కూలీనాలీ చేసుకుని బతుకుతున్నామని పేర్కొంటున్నారు. అధికారులు ఉన్నపళంగా ఇళ్లను కూలిస్తే ఏం చేయాలని కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు పూర్తి పునరావాసం కల్పించి ఇళ్లను కూల్చాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఇళ్లను పొక్లెయిన్లతో కూల్చి వేస్తున్న క్రమంలో అడ్డుకున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం పునరావాసం కల్పించి న్యాయం చేయాలని కలెక్టర్, కమిషనర్, నగర మేయర్‌కు వినతిపత్రాలు అందించారు.
40 ఏళ్ల నుంచి నివసిస్తున్నాం ఇళ్లను తొలగించడం అన్యాయం ఇన్నర్‌రింగ్‌రోడ్డు ఫేజ్ 3లో ఇళ్లు కోల్పోతున్న 200 కుటుంబాల ఆవేదన
కూలి చేసుకుని బతికేవాళ్లం
గత ప్రభుత్వాలు ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించు కుని 40 ఏళ్లుగా కూలి చేసుకుని జీవిస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి ఇళ్లను కూల్చేస్తున్నారు. పునరావాసం కల్పించి ఇళ్లు కూల్చుకోవాలని చెబుతున్నాం. అయినా పట్టించుకోవడం లేదు. ఇల్లు కూల్చేశారు. ఇప్పుడు పిల్లలతో కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్లాలి?
– జిల్లా సత్యవతి, స్థానికురాలు,
బాధితురాలు

పునరావాసం కల్పించి ఇళ్లను కూల్చండి