జీవించే హక్కులను కాలరాస్తున్నారు
రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు
చీరాలరూరల్:ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలపై చేస్తున్న దాడులను ఆపేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిన నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సీనియర్స్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేధావులు, ప్రజా సంఘా లు, వివిధ రంగాలకు చెందిన ప్రజలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలోని సహజవనరులైన ఖనిజ సంపదను భవిష్యత్ తరాలకు అందించడంతోపాటు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతున్న ఆదివాసీలను కేంద్ర ప్రభుత్వం కొన్ని బహుళజాతి కంపెనీలకు ఆయా సంపదలను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలను, సైన్యాన్ని ఉపయోగించి మావోయిస్టులను ఏరివేస్తున్నట్లు నటిస్తు అడవులలో జీవిస్తున్న ఆదివాసీలపై దాడులు చేయిస్తుందని అన్నారు. మావోయిస్టులతో ప్రమాదమున్నదని భావించినట్లయితే కేంద్రం వారితో చర్చలు జరపాలని సమావేశంలో పాల్గొన్న వక్తలు సూచించారు. సమావేశంలో ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లబోతుల మోహన్‌కుమార్ ధర్మ, ఆదివాసీల సంఘీభావ వేదిక ప్రకాశం జిల్లా కన్వీనర్ వీరాంజనేయులు, రాష్ట్ర చేనేత జసనమాఖ్య నాయకులు మాచర్ల మోహనరావు, ఊటూకూరి వెంకటేశ్వర్లు, దామర్ల శ్రీకృష్ణ, చుండూరు వాసు, మచ్చ అర్జునరావు, శీలం రవి, మేడా వెంకటరావు, గాదె హరిహరరావు, దేవన వీరనాగేశ్వరరావు, మేడిన వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


