గుంటూరు జిల్లా జడ్జిగా కల్యాణ్ చక్రవర్తి బాధ్యతల స్వీక
గుంటూరు లీగల్ : జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి బి.కల్యాణ్ చక్రవర్తిని సోమవారం జిల్లా ప్రెసిడెంట్ తుబాటి శ్రీను, ప్రధానకార్యదర్శి పి.శ్రీనివాసరావు, టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మనాయక్ మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ నవీన్, స్టేట్ జనరల్ సెక్రటరీ పి.రాంగోపాల్, జాయింట్ సెక్రటరీ బ్రహ్మయ్య, శేషగిరి, హరిబాబు, ఖాజా, కల్యాణి, సాయి అభిజిత్, శివారెడ్డి పాల్గొన్నారు.
చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ జడ్జిగా షమీ పర్వీన్ సుల్తానా
గుంటూరులీగల్: జిల్లా కోర్టులో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ (పోక్సో) జడ్జిగా షమీ పర్వీన్ సుల్తానా బేగం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యంగళశెట్టి సూర్యనారాయణ, జనరల్ సెక్రెట రీ మోతుకూరి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రామకోటిరెడ్డి, కార్యవర్గ సభ్యులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
ఒరిగిన రామలింగేశ్వర ఆలయ శిఖరం
అమరావతి: అమరావతిని రాజధానిగా చేసు కుని పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు రామేశ్వరం యాత్రకు వెళ్లి, గుర్తుగా రామలింగేశ్వర విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్టించి, స్థానికంగా ఆలయ నిర్మాణం చేశారు. అప్పటినుంచి ఆలయంలోని రామలింగేశ్వరునికి నిత్యపూజలు జరుగుతున్నాయి. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయం ఏళ్లతరబడి ఆదరణ లేక నిర్లక్ష్యానికి గురైంది. ఈక్రమంలో ఇటీవల గాలివానకు ఆలయ విమాన శిఖరం ఒరిగి వేలాడుతోంది. ఆలయ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆలయ శిఖరానికి దూరం నుంచి నమస్కారం చేసుకుంటే స్వామివారికి నమస్కరించినట్లేనని భక్తుల నమ్మకం. అటువంటి శిఖరానికి అపచారం జరిగినా పట్టించుకోని దేవాలయ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రేపటి నుంచి విస్తరణ సలహా మండలి సమావేశాలు
గుంటూరురూరల్:నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో 2024–25 ఏడాదికిగానూ కృష్ణ మండలం పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు లాంఫాం ఏడీఆర్ డాక్టర్ దుర్గాప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23, 24 తేదీల్లో రెండు రోజులపాటు సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గత ఏడాది కార్యాచరణ, సలహాల మేరకు చేపట్టిన కార్యక్రమాలు, ప్రగతి, రానున్న ఏడాది నిర్వహించే కార్యక్రమాలు, పరిశోధన, విస్తరణపై చర్చలు జరుగుతాయన్నారు. రైతులు, శాస్త్రవేత్తలు, సలహా మండలి సభ్యులు తదితరులు పాల్గొంటారన్నారు.
ఘనంగా సివిల్ సర్వీసెస్ డే
నరసరావుపేట: సివిల్ సర్వీసెస్ డేను పురస్కరించుకొని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, జేసీ గనోరే సూరజ్ ధనుంజయలను అధికారులు సత్కరించారు. సోమవారం టౌన్ హాలులో వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా, డివిజన్‌స్థాయిఅధికారులు పాల్గొన్నారు.
ప్రధాని పర్యటనకు
పోలీస్ సిబ్బంది
మంగళగిరిటౌన్: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. మంగళగిరి నగర పరిధిలోని పలు స్కూళ్లు, కాలేజీలను సోమవారం సిబ్బందితో కలసి సందర్శించారు. డీఎస్పీ మాట్లాడుతూ మే 2న ప్రధాని మోదీ రాజధాని అమరావతికి రానున్న నేపథ్యంలో ఆరువేల మంది పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తుకు రానున్నట్లు పేర్కొన్నారు. మంగళగిరి పట్టణ, రూరల్, తాడేపల్లి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, కల్యాణ మండపాలలో మూడు రోజుల ముందు నుంచే సిబ్బంది ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు.
గుంటూరు జిల్లా జడ్జిగా కల్యాణ్ చక్రవర్తి బాధ్యతల స్వీక
గుంటూరు జిల్లా జడ్జిగా కల్యాణ్ చక్రవర్తి బాధ్యతల స్వీక


