
21న చీరాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చీరాల మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 21వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజల సౌలభ్యం కోసం చీరాల నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చీరాల నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్లపరిశీలన
తాడికొండ: మే 2న వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరుకానున్న ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎకై ్సజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, జేసీ భార్గవ్‌తేజ తదితరులు పరిశీలించారు.
డాక్టరేట్ పొందిన ఆటో డ్రైవర్ శంకర్‌రావుకు అభినందనలు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూనే కాలికట్ యూనివర్సిటీ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందిన గండికోట శంకర్‌రావును ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐఆర్‌టిడబ్ల్యూఎఫ్)అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య సత్కరించా రు. శుక్రవారం పాతగుంటూరులోని సీఐటీ యూ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు అధక్షతన అభినందన సభ జరిగింది. ఆర్ లక్ష్మయ్య మాట్లాడుతూ గండికోట శంకరరావు ఆటో డ్రైవర్ యూనియ న్ ప్రధాన కార్యదర్శిగా, ఆలిండియా రోడ్ ట్రా న్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి కె.దుర్గారావు పాల్గొన్నారు.
చెలరేగిన మృగాడు
క్రోసూరు: స్థానిక బోయ కాలనీలో భార్యపై అనుమానం పెంచుకుని భర్త బ్లేడుతో గొంతుకోసిన సంఘటన శుక్రవారం జరిగింది. స్టేషన్ రైటర్ దాసు వివరాల ప్రకారం.. బోయ కాలనీకి చెందిన చార్ల శ్రీను భార్య మల్లమ్మ. ఆమె ఎవరితోనో ఫోనులో మాట్లాడుతుండటంతో అనుమానపడి శ్రీను బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. చుట్టపక్కల వారు ఆమెను సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు 25 కుట్లు వేశారు. ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. శ్రీను, మల్లమ్మలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కూడా అయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రైటర్ దాసు తెలిపారు.
పాక్ జలసంధిని
ఈదిన గణేష్
విజయవాడస్పోర్ట్స్: తమిళనాడులోని ధనుష్‌కోటి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు ఉన్న పాక్ జలసంధిని ఆంధ్రప్రదేశ్ పారా స్విమ్మర్ బి.గణేష్ సాహసోపేతంగా ఈదాడు. శుక్రవారం ఉదయం 5.50 గంటలకు తలైమన్నార్‌లో ఈతను ప్రారంభించి సాయంత్రం 4.20కి ధనుష్‌కోటికి చేరుకున్నారు. 28 కిలోమీటర్లు పొడవున్న సముద్రాన్ని 10.30 గంటల్లో ఈదాడు. తెలుగు రాష్ట్రాల్లోని పారా స్విమ్మర్‌లలో పాక్ జలసంధిని ఈదిన మొట్టమొదటి పారా స్విమ్మర్‌గా ఖ్యాతిగడించారు. స్విమ్మర్ గణేష్ ప్రస్తుతం ఏలూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో స్విమ్మింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు.

21న చీరాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

21న చీరాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

21న చీరాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక