
పేలిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు
నరసరావుపేట: ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు టైరు పేలిన ఘటన నరసరావుపేటలో ఆదివారం జరిగింది. ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి ప్రయాణీకులతో నరసరావుపేట బయల్దేరిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆదివారం ఉదయం ఏడుగంటల సమయానికి పట్టణానికి కిలోమీటరు దూరంలోని వినుకొండ రోడ్డులోకి వచ్చేసరికి రెండుటైర్లలో ఒకటి పెద్దశబ్ధంతో పేలి మంటలు, పొగ వ్యాపించాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపటంతో ప్రయాణికులంతా బస్సు నుంచి బయటపడ్డారు. రోడ్డుపక్కనే బ్రిక్స్ తయారీ యూనిట్ ఉండడంతో, అక్కడి నీటి పైపు ద్వారా మంటలు వ్యాపించిన టైరును తడిపి మంటలను ఆర్పేశారు. వేసవి కావటంతో రెండుటైర్లు రాపిడికి గురై, వాటిలో ఒకటి పేలి ఈ సంఘటన జరిగిందని ప్రయాణీకులు తెలిపారు. కొందరు ప్రయాణికులు అదేమార్గంలో వస్తున్న ఆటోల ద్వారా పట్టణానికి చేరుకున్నారు.
వెల్లటూరు ఉపాధ్యాయుడికి అవార్డు ప్రదానం
భట్టిప్రోలు (కొల్లూరు) : కృష్ణా వరదల సమయంలో లంక గ్రామాలలో సేవలు అందించిన మండలంలోని వెల్లటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గుర్రం మురళీ అబ్దుల్ కలాం జాతీయ సేవా రత్న అవార్డును ఆదివారం అందుకున్నారు. చీరాలలో కృతి ఫౌండేషన్ ఐదో వార్షికోత్సవాన్ని పునస్కరించుకొని నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా ప్రెసిడెంట్, ఏపీఎస్‌ఎస్‌టీఎప్ రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడైన మురళీకి రోటరీ క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సీఐ సాంబశివరావు, నాగమణి, అమర్నాధ్, వెంకట అశ్వినిలు అవార్డును అందజేసి సత్కరించారు. ఈసందర్భంగా సోషల్ ఫోరమ్ సభ్యులు నాగిరెడ్డి, శేఖర్, శ్రీనివాస్‌రెడ్డి, వై.శ్రీను, లక్ష్మణ్‌రావు, నాగరాజు మురళీని అభినందించారు.
ప్రయాణికులంతా క్షేమం

పేలిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు