
గిన్నిస్‌బుక్‌లో స్థానం పొందడం అభినందనీయం
బల్లికురవ: విద్యార్థి వివేక్ కృషి పట్టుదలతో కీబోర్డుపై పాటలు పాడుతూ ప్రపంచ రికార్డుతోపాటు గిన్సీస్‌బుక్‌లో స్థానం పొందటంతో మండలానికి, జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చాడని ఎంఈవో–2 ఎ.రమేష్‌బాబు కొనియాడారు. వల్లాపల్లి ప్రాథమికోన్నత పాఠశాలో 7వ తరగతి చదువుతున్న మందా వివేక్ హలేల్ మ్యూజిక్ స్కూల్ తరుపున క్రిస్టియన్ సంగీత పోటీల్లో పాల్గొని గిన్నీస్‌తో ప్రపంచ రికార్డు సాధించిన విషయం విదితమే. గురువారం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు అధ్యక్షత అభినందన సభ నిర్వహించారు. ఈ సభలో ఎంఈవో మాట్లాడుతూ వివేక్ తండ్రి రమేష్ కీ బోర్డుప్లేయర్ కావటం వల్ల వారసత్వంతోపాటు ప్రోత్సాహంతో క్రిస్టియన్ గీతాలు పాడుతూ గతేడాది డిసెంబర్ 1న జరిగిన ఆన్‌లైన్ మ్యూజిక్ ప్రదర్శనలో పాల్గొన్నాడన్నారు. 18 దేశాల నుంచి 1046 మంది గంట వ్యవధిలో వీడియోలు అప్‌లోడ్ చేశాడని అందులో వివేక్ ఉండటం గర్వించదగ్గ విషయం అన్నారు. సంగీతంతో రాబోయే కాలంలో వివేక్ మరెన్నో పతకాలు సాధించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు మందా సుబ్బారావు, గొండ్రు చిన్న, చింతల రామారావు అన్నారు.

గిన్నిస్‌బుక్‌లో స్థానం పొందడం అభినందనీయం