
సోషలిస్ట్ నేత మోదుగుల పాపిరెడ్డికి ఘన నివాళి
గుంటూరు రూరల్: సోషలిస్ట్ పార్టీ నేత మోదుగుల పాపిరెడ్డి(88) దిశదిన కర్మకు ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. సోమవారం ఇన్నర్ రింగ్‌రోడ్డులోని రెడ్డిపాలెం వద్ద ఉన్న ఆయన కుమారుడు, వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి నివాసంలో పాపిరెడ్డి కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మోదుగుల కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించారు. పాపిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, మర్రి రాజశేఖర్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, వైఎస్సార్ సీపీ పొన్నూరు, ప్రత్తిపాడు, వేమూరు, సత్తెనపల్లి, మంగళగిరి సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, బలసాని కిరణ్‌కుమార్, వరికూటి అశోక్‌కుమార్, గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబులతో పాటు భాష్యం రామకృష్ణ, నన్నపనేని రాజకుమారి, కోవెలమూడి రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీలు జేడీ శీలం, వై.శివాజీ తదితరులు నివాళుల ర్పించిన వారిలో ఉన్నారు.
దశ దిన కర్మకు హాజరైన ప్రముఖులు
కుటుంబ సభ్యులకు పరామర్శ