
వక్ఫ్ చట్ట సవరణ కేంద్రం పెద్దల కుట్ర
ఇంకొల్లు(చినగంజాం): వక్ఫ్ చట్టంలో సవరణలు చేయడం ముస్లింల మత స్వేచ్ఛపై దాడి చేయడమేనని ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొల్లులో శుక్రవారం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు అనంతరం ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ముస్లిం మహిళలు సైతం పాల్గొన్నారు. పలువురు ముస్లిం సోదరులు మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ ముస్లింల హక్కులను హరించే విధంగా ఉందని, ముస్లింల ఆస్తులు అంబానీ, అదానీలకు కట్టబెట్టడానికి మోదీ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించిందని అన్నారు. వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిం యేతరులకు అవకాశం కల్పించడం సమంజసమేనా అని సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే ముస్లింలంతా కలిసి ఐక్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జామియా మసీదు కమిటీ సభ్యులు షేక్ ఉమ్రాన్ అలి, షేక్ బాషా, షేక్ మాబుల్లా, షేక్ ఈసూబ్, బాబు, సీపీఐ నాయకులు కందిమళ్ల రామకోటేశ్వరరావు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇంకొల్లులో నినదించిన ముస్లిం సోదరులు ముస్లింల ఆస్తులు అదానీ, అంబానీలకుధారాదత్తం ర్యాలీలో పాల్గొన్న ముస్లిం మహిళలు