
సంగీతంలో గిన్నిస్ బుక్ రికార్డు
కర్లపాలెం: కీబోర్డు ప్లే చేసి బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం బిడారుదిబ్బ గ్రామానికి చెందిన ఓ విద్యార్థి వరల్డ్ గిన్నిస్ బుక్ సర్టిఫికెట్ అందుకున్నాడు. బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు దుండివారిపాలెం పంచాయతీ బిడారుదిబ్బ గ్రామానికి చెందిన కట్టుపల్లి విల్సన్‌బాబు, ప్రత్యూష దంపతుల పెద్దకుమారుడు విజయవాడలో ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి జోయెల్ విల్సన్‌బాబు పాస్టర్లు లాభాన్‌రాజు, అగస్టిన్ దండంగి సారధ్యంలో కీబోర్డు వాయించటం నేర్చుకున్నాడు. 2024 డిసెంబర్ 1వ తేదీన విజయవాడలో ప్రపంచ స్థాయిలో 108 దేశాలలో 1090మంది సంగీత కళాకారులకు ఆన్‌లైన్ విధానంలో జరిగిన పోటీలలో జోయెల్ విల్సన్‌బాబు పాల్గొని 45 నిమిషాలలో కీబోర్డు ప్లేచేసి వీడియోను అప్‌లోడ్ చేసి గిన్నిస్‌బుక్ రికార్డు సాధించాడని తెలిపారు. ఈనెల 14వ తేదీన హైదరాబాద్ మణికొండలో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ప్రతినిధి రాజేంద్రన్ చేతుల మీదుగా వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్‌ను అందుకున్నాడని తెలిపారు.