
గుర్తుతెలియని వాహనం ఢీకొని యాచకురాలు మృతి
బల్లికురవ: రోడ్డుపై వెళుతున్న యాచకురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టటంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం మేదరమెట్ల– నార్కెట్‌పల్లి నామ్ రహదారిలోని మండలంలోని వీ.కొప్పరపాడు శివాలయం ఎదుట జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. నాలుగు నెలల నుంచి మహిళ(55) గ్రామంలో తిరుగుతూ యాచన చేస్తూ పెట్టిన ఆహారాన్ని తింటూ రాత్రికి బస్‌షెల్టర్‌లో నిద్రిస్తుంది. రోడ్డుపై వెళుతున్న మహిళను నార్కెట్‌పల్లి వైపు వెళుతున్న వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టటంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న బల్లికురవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భౌతికకాయాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.