
పాల వ్యాన్ బోల్తా
వ్యక్తికి గాయాలు
జె.పంగులూరు: సురభి డెయిరీకి చెందిన పాల వ్యాను శుక్రవారం ఉదయం మండలంలోని చందలూరు, తూర్పు కొప్పెరపాడు గ్రామాల మధ్య అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న మార్జిన్‌లో బోల్తా పడింది. మండలంలోని జాగర్లమూడి వారి పాలెం వద్ద గల సురభి డెయిరీ నుంచి వాహనం పాల పదార్థాలతో చందలూరు మీదుగా చీరాల వెళ్లేందుకు బయలు దేరింది. తూర్పు కొప్పెరపాడు దాటిన తర్వాత ఎదురుగా ఒక కారు రావడంతో ఆ కారు వెళ్లేందుకు దారి ఇస్తూ పక్కకు రావడంతో అదుపు తప్పి మార్జిన్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో పాల వాహనంలో ఉన్న ఎన్ కళ్యాణ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం ఇవ్వడంతో అతన్ని అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.