శ్మశాన వాటికకు భూమి కేటాయించాలి
కలెక్టర్‌కు జాతీయ రహదారి విస్తరణ బాధితుల వినతి
చీరాల: వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రహదారి 167 విస్తరణలో కోల్పోయిన శ్మశాన వాటిక భూమిని తిరిగి వేరే ప్రాంతంలో కేటాయించాలని విజయనగర్ కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ వెంకట మురళికి బుధవారం వినతిపత్రం అందజేశారు. 1985లో కారంచేడు బాధితులకు చీరాల వద్ద విజయనగర్ కాలనీ ఏర్పాటు చేశారన్నారు. ఈ కాలనీలకు సంబంధించి 8 ఎకరాల్లో శ్మశాన వాటికను అప్పటి ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ప్రస్తుతం నిర్మిస్తున్న వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రాహదారిలో శ్మశాన వాటిక స్థలంలో చాలావరకు కోల్పోవడం జరిగిందన్నారు. శ్మశానానికి వెళ్లేందుకు దారిని ఏర్పాటు చేయాలని కోరారు. కాలనీ వాసులు తేళ్ల లక్ష్మీప్రసాద్, దేవదానం, ప్రసాద్, దుడ్డు ఏసుపాదం బుడంగుట్ల లక్ష్మీ నరసయ్య, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు దుడ్డు వందనం, తాళ్లూరి రాజేష్, దుడ్డు వెంకటేశ్వర్లు, చుండూరి రమేష్‌బాబు, తేళ్ల రాంబాబు, దుడ్డు విజయ భాస్కర్ పాల్గొన్నారు.


