
నాటుసారా విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
చీరాల: అక్రమంగా నాటుసారా విక్రయాలు సాగిస్తున్న చీరాల మండలం ఆదినారాయణపురంకు చెందిన వల్లాగి నాగరాజు అనే వ్యక్తిని మంగళవారం ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎకై ్సజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఎకై ్సజ్ సీఐ పి.నాగేశ్వరరావు, ఎస్సైలు, ఒన్‌టౌన్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈపూరుపాలెం పంచాయతీ ఆదినారాయణపురానికి చెందిన వల్లాగి నాగరాజు అక్రమంగా సారా విక్రయాలు చేస్తుండడంతో అతడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఆరు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అలానే చీరాల వైకుంఠపురం దండుబాట సమీపంలో జాలమ్మ గుడి వద్ద కావాటి నాగరాజు నాటుసారా విక్రయిస్తున్నాడనే సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఎనిమిది లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ చట్టం ప్రకారం నాటుసారా కలిగి ఉండుట, అమ్ముట, రవాణా చేయడం నేరమని సీఐ నాగేశ్వరరావు అన్నారు. నాటుసారా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
పసుపు ధరలు
దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డులో 1,303 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొమ్ములు 846 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.10,200, గరిష్ట ధర రూ.12,000, మోడల్ ధర రూ.11,700 పలికింది. కాయలు 457, బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.10.200, గరిష్ట ధర రూ.12,225, మోడల్ ధర రూ.11,700 పలికింది.