బాపట్ల
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
25కు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ దరఖాస్తు పొడిగింపు
బాపట్ల: అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ దరఖాస్తు గడువు ఈనెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత రక్షణ శాఖ వివిధ దళాల రిక్రూట్‌మెంట్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన అగ్ని పథకంలో భాగంగా ఆర్మీలో ఉద్యోగాల ప్రకటన జారీ అయినదని జిల్లా కలెక్టర్ తెలిపారు. అగ్ని జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగాలలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని, అర్హులైన యువత నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారని తెలిపారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాత పరీక్షను ఆన్‌లైన్ ద్వారా జూన్ 2025న నిర్వహిస్తారని తెలిపారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్లు పరిశీలన
వెలగపూడి(తాడికొండ): తుళ్ళూరు మండలం వెలగపూడి గ్రామంలోని సచివాలయం సమీపంలో మే 2వ తేదీన జరగనున్న అమరావతి తదితర శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొననున్న నేపథ్యంలో ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజలతో కలిసి మంగళవారం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పరిశీలించారు. హెలీప్యాడ్ నిర్మాణం, ప్రధాని రోడ్ షో సాగే మార్గాలు, ప్రధాన వేదిక, పబ్లిక్, వీవీఐపీ, గ్యాలరీల వద్ద ఏర్పాట్లను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏర్పాట్లు నిర్దేశిత సమయం కంటే ముందే వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఎం.నవీన్ కుమార్, అడిషనల్ ఎస్పీ సుప్రజ, ఆర్డీవో కె. శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.
మేయర్ ఎన్నికకు 28న ప్రత్యేక సమావేశం
నోటిఫికేషన్ జారీ చేసిన
రాష్ట్ర ఎన్నికల సంఘం
నెహ్రూనగర్: గుంటూరు నగర మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ఉత్తర్వులను అనుసరించి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ ఈ నెల 28వ తేదీన ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక నిర్వహించాలని, ఈ ఎన్నికకు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. భార్గవ్ తేజను ఎన్నికల అధికారిగా నియమించారు. ఎన్నికల అధికారి ద్వారా ఈ నెల 24 లోపు గుంటూరు నగర పాలక సంస్థ కార్పొరేటర్లకు, ఎక్స్ అఫిషియో సభ్యులు 28న ప్రత్యేక సమావేశానికి హాజరు కావలసినదిగా నోటీసులు అందనున్నాయి. షెడ్యూలు ప్రకారం ఈ నెల 28న ఉదయం 11 గంటలకు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మేయర్ ఎన్నిక జరుగుతుందని ఎలక్షన్ అథారిటీ, సీడీఎంఏ డాక్టర్ పి. సంపత్ ఉత్తర్వులు జారీ చేశారు.
చీరాలటౌన్: సబ్సిడీ రుణాలను టీడీపీ నేతలు పంచుకుతింటున్నారు. అర్హులకు రుణాలు అందించకుండా టీడీపీ నేతలు చెప్పిన వారికే అందిస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీ పేరుతో అధికారులు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఫలితంగా నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై అందించే రుణాలను అర్హులకు కాకుండా టీడీపీ నేత సిఫార్సు చేసిన వారికే కేటాయిస్తున్నా రు. కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను లబ్ధిదారులకు అందించేందుకు కమిటీ కన్వీనర్ ఎంపీడీవోగా, ఈవోఆర్డీ, పలువురు బ్యాంకుల మేనేజర్లు ఎంపిక కమిటీ సభ్యులుగా నియమించారు. స్క్రీనింగ్ కమిటీని మొక్కుబడిగా ఏర్పాటు చేశారే కానీ తుది నిర్ణయం అంతా ముఖ్యనేతదే. ఆయన ఆమోదం పొందిన వారినే అర్హులుగా నిర్ధారించారు. ఎంపీడీవో కార్యాలయానికి టీడీపీ నాయకులు వచ్చి నేరుగా తమవారికి రుణాలు ఖరారయ్యాయో లేదో అని జాబితాలను చూసుకుంటున్నారు. ప్రభుత్వ అధికారుల అక్రమాలకు టీడీపీ నాయకులు అండగా నిలవడంతో అడ్డూ అదుపులేకుండా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.
90 యూనిట్లకు 621 మంది దరఖాస్తు
ప్రభుత్వం బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించేందుకు మండలానికి 90యూనిట్లను కేటాయించగా 621 మంది అభ్యర్థు లు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరి బ్యాంకు సిబిల్ రేటు, ధ్రువీకరణ పత్రాలను బ్యాంకు మేనేజర్ల సమక్షంలో మండల పరిషత్ అధికారులు విచారణ చేపట్టారు. మండలానికి కేటాయించిన 90 యూని ట్లు బీసీ, ఈబీసీ సబ్సిడీ రుణాలకు రూ.1.69 కోట్లు బ్యాంకు మేనేజర్లు రుణాలను అందించనున్నారు. ఈనెల 9న ఇంటర్వ్యూలు నిర్వహించగా 612 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.
సబ్సిడీలను నిర్ధారిస్తున్న టీడీపీ నాయకులు
మా గ్రామానికి కేటాయించిన రుణాలను మా వారందరికీ ఇవ్వాలి....సబ్సిడీలను సైతం మేమే నిర్దారిస్తాం....మాకు ఇబ్బందులు లేకుండా చూడండంటూ...టీడీపీ నాయకులు అధికారులకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. అధికారులు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మీరు చెప్పిన వారికే రుణాలు అందిస్తామని టీడీపీ నేతలకు హామీ ఇస్తూ జీ హుజూర్ అంటున్నారు. ముఖ్యనేత సిఫార్సుతో కేవలం టీడీపీ నాయకులు సూచించిన వారికే ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు వదులుతున్నారు. రుణాల ఎంపికకు సంబంధించి తుది జాబితాలను అధికారులు వివరాల జాబితాను జిల్లా కార్పొరేషన్ కార్యాలయాల కంటే ముందుగా టీడీపీ నేతలకు చూపిస్తున్నారంటే చీరాల్లో రుణాలు ఎవరికి అందుతాయో అర్థం చేసుకోవచ్చు.
జనసేన, బీజేపీలకు దక్కని ప్రాధాన్యం
టీడీపీ అధికారంలోకి రావడానికి ముఖ్యపాత్ర పోషించిన జనసేన, బీజేపీ నాయకులకు చీరాల్లో సరైన ప్రాధాన్యతనివ్వడం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేన, బీజేపీ నేతలు సూచించిన వారికి సబ్సిడీ రుణాలు ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనమే. గత ఎన్నికల సమయంలో వేరే పార్టీకి పనిచేసి ప్రస్తుతం అధికార పార్టీ పంచన చేరిన మండలంలోని కొందరు నేతలు అంతా తామే అన్నట్లు రుణాల పంపిణీలో చక్రం తిప్పడాన్ని కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
జాబితాను బ్యాంకులకు పంపాం
కార్పొరేషన్ల సబ్సిడీ రుణాలకు సంబంధించి ఇంటర్వ్యూలను పూర్తిచేశాం. ఎంపిక కమిటీ జాబితాను ఆయా బ్యాంకులకు పంపించాం. సిబిల్ ప్రకారం రుణాలు అందిస్తాం. బ్యాంకులు నిర్ధారించి, నమ్మకమైన వ్యక్తులకే రుణాలు అందిస్తారు. మిగిలిన వారికి మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహించి రుణాలు అందించేందుకు కృషి చేస్తాం.
– బి.శివసుబ్రహ్మణ్యం, ఎంపీడీవో చీరాల.
●
సమావేశంలో మాట్లాడుతున్న
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
వేమూరు పోలీసుస్టేషన్
ఎస్‌ఐ అవినీతి లీలల్లో కొన్ని...
7
న్యూస్‌రీల్
అర్హులకు మొండిచెయ్యి
టీడీపీ నేతలు చెప్పిన వారికే రుణాలు పేరుకే స్క్రీనింగ్ కమిటీ నిరాశలో అర్హులు
టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం
చేనేతలు, రోజువారీ కూలీలు, చదువుకుని ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు చేయూతనిచ్చే రుణాల ఎంపికలో అర్హులకు కాకుండా టీడీపీ నేతలకే రుణాలు కేటాయిస్తుండటంతో అధికారులు, టీడీపీ నేతల తీరుపై ప్రజలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేతలు సిఫార్సు చేసిన వారికి మాత్రమే రుణాలు కేటాయించడంతో గ్రామాల్లోని అర్హులు మాత్రం టీడీపీ, ముఖ్యనేత తీరుపై బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సబ్సిడీ రుణాల కోసం ఎదురుచూపులు చూస్తున్న లబ్ధిదారుల ఆశలకు ముఖ్యనేత జాబితా తయారుతో బ్రేక్ పడింది. కొద్ది రోజుల క్రితం కార్పొరేషన్ రుణాలను అర్హులకు కాకుండా అనర్హులకు, ప్రజాప్రతినిధి చెప్పిన వారికే ఇవ్వడంతో గ్రామాల్లో విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల


