ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
జె.పంగులూరు: ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని ముప్పవరం కోటపాడు గ్రామాల మధ్య మంగళవారం రాత్రి జరిగింది. కోటపాడు గ్రామానికి చెందిన పూసపాటి శివశంకర్ ట్రాక్టర్ మొక్కజొన్న లోడ్కి వెళ్లి రాత్రి సమయంలో కోటపాడు వస్తుంది. అదే ట్రాక్టర్‌లో కోటపాడు గ్రామానికి చెందిన గొల్లమూడి అంజయ్య (50) ఉన్నాడు. అంజయ్య ట్రాక్టర్ ఇంజిన్పై కూర్చున్నట్లు తెలుస్తుంది. ట్రాక్టరు ముప్పవరం నుంచి కోటపాడు వచ్చే రూట్లో ఆదిరెడ్డి బావి దగ్గర మలుపు తిరుగుతుండగా, ట్రాక్టర్ అదుపు తప్పి ఒకసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజిన్పై ఉన్న గొల్లమూడి అంజయ్య కింద పడిపోయాడు. కిందపడ్డ అంజయ్యపై ట్రాక్టర్ వెనుక చక్రం పోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య వెంకాయమ్మ, కుమారులు మరియబాబు, వెంకటేష్ ఉన్నారు. అంజయ్య మృతి వార్త తెలియడంతో ఎస్సీ కాలనీవాసులంతా సంఘటన స్థలానికి చేరుకున్నారు.
రూ.8.52 లక్షలు అపరాధ రుసుము వసూలు
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి


