
వక్ఫ్ సవరణ చట్టం రద్దు కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన
నరసరావుపేట: భారత రాజ్యాంగం కాపాడాలని, వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం సాయంత్రం పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత, పేద మధ్యతరగతి ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ముస్లిం సంఘాలు, సీపీఎం, సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌కు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ముస్లిం మైనార్టీ నాయకులు మస్తాన్‌వలి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముస్లింల అణచివేతకు పాల్పడుతుందన్నారు. ఒక్క ముస్లింను కూడా కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో నియమించలేదని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు, సీపీఎం నాయకులు డి.శివకుమారి, పీడీఎం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ, అమరావతి రజక ఐక్యవేదిక నాయకులు ఉదయగిరి వెంకటస్వామి, మైనారిటీ నాయకులు మాదిన రసూల్ రఫీ, వర్లమాబు, కరీముల్లా, ఖలీల్, మెకానిక్ మస్తాన్ వలి పాల్గొన్నారు.
జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాల నివారణ
నరసరావుపేటటౌన్: జాగ్రత్తలు పాటించటంతో అగ్ని ప్రమాదాలు అరికట్టవచ్చని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. సమాజంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండి ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎస్.శ్రీధర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో గతేడాది 530 ప్రమాదాలు చోటుచేసుకోగా రూ.6.62 కోట్లు ఆస్తి నష్టం జరిగిందన్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సకాలంలో స్పందించి రూ.22.57 కోట్ల విలువైన ఆస్తిని కాపాడన్నారు. వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, బహుళ అంతస్తుల భవనాలు, ఆసుపత్రులు, పెట్రోలు బంకులు, గ్యాస్ గోదాంలు, రద్దీ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో నరసరావుపేట అగ్నిమాపక శాఖ అధికారి ఎం.వి. సుబ్బారావు, డీఎస్పీ కె.నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ముగిసిన గోవర్ధనస్వామి ఆలయ బ్రహోత్సవాలు
నాదెండ్ల: నాదెండ్లలో కొలువై ఉన్న చారిత్రాత్మక ఆలయమైన రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ గోవర్ధనస్వామి, భూనీలా సమేత శ్రీ చెన్నకేశవస్వామి వార్ల దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిశాయి. చివరిరోజు స్వామివారి ధ్వజారోహణ నిర్వహించారు. ఈ నెల 8న ప్రారంభమైన బ్రహోత్సవాల్లో భాగంగా స్వామివార్లకు వైభవంగా కల్యాణం నిర్వహించారు. ఆలయ అర్చకులు పరాంకుశం సాయిశ్రీనివాసాచార్యులు, విజయరామాచార్యులు, సీతారామాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. కార్యక్రమాలను ధర్మకర్తల మండలి సభ్యులు, దేవాదాయశాఖ ఈవో శ్రీనివాసు పర్యవేక్షించారు.
గంజాయి అమ్మకాలపై నిఘా ఉంచాలి
నెహ్రూనగర్: ప్రభుత్వం తలపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 28 గ్రామాలను నాటుసారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించామని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాస్ తెలియజేశారు. సోమవారం బ్రాడీపేటలోని ఎకై ్సజ్ కార్యాలయంలో ఎకై ్సజ్ శాఖకు సంబంధించిన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టి పట్టణ, మున్సిపల్ ప్రాంతాల్లో అమ్మకాలపై కేసులు నమోదు చేయాలన్నారు.

వక్ఫ్ సవరణ చట్టం రద్దు కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన

వక్ఫ్ సవరణ చట్టం రద్దు కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన

వక్ఫ్ సవరణ చట్టం రద్దు కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన