విద్యుదాఘాతంతో ఎలక్ట్రిషియన్ మృతి
అద్దంకి రూరల్: విద్యుత్ స్తంభంపై నుంచి కిందపడి ఎలక్ట్రిషియన్ మృతి చెందిన సంఘటన అద్దంకి మండలంలోని చిన కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతురాలి భార్య పులి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై రవితేజ కేసు నమోదు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని చినకొత్తపల్లి గ్రామానికి చెందిన పులి నెహేమియా (35) సుమారు 15 సంవత్సరాలుగా ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన జొన్నలగడ్డ రామాంజనేయులు రైస్‌మిల్లుకు కరెంట్ రాకపోవటంతో చూడటానికి వెళ్లి విద్యుత్ స్తంభం ఎక్కి చూస్తుండగా ప్రమాదవశాత్తు కరెట్ షాక్ తగలటంతో స్తంభం పై నుంచి కిందపడ్డాడు. స్థానికులు రామాజంనేయులు, తంగిరాల మనోహర్‌లు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యుడు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.


