నారాయణ విద్యార్థినికి రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు
చీరాల అర్బన్ : చీరాలలోని నారాయణ స్కూల్ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. మాచవరపు సాహిత్య 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు, జిల్లాలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకుంది. ఉపాధ్యాయుల బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించానని విద్యార్థిని తెలిపింది. విద్యార్థిని తండ్రి ఎం.సత్యనారాయణ ఉద్యోగి కాగా, తల్లి అనంతలక్ష్మి రెవెన్యూ డిపార్టుమెంట్‌లో పని చేస్తున్నారు. ఈ సందర్భంగా సాహిత్యను స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి.నిరుపమ, ఏజీఎం శ్రీనివాస్, మూర్తి పాల్గొన్నారు.


