
నేటి నుంచి రీజినల్ వాలీబాల్ స్పోర్ట్స్ మీట్
సత్తెనపల్లి: క్రీడల పండుగకు రంగం సిద్ధమైంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ (రామకృష్ణాపురం) ప్రాంగణంలో కెవిస్ హైదరాబాద్ రీజినల్ స్థాయి అండర్–17 బాలబాలికల వాలీబాల్ స్పోర్ట్స్ మీట్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే కెవిస్ హైదరాబాద్ రీజినల్ స్థాయి వాలీబాల్ స్పోర్ట్స్‌మీట్ ఈ నెల 27 వరకు నాలుగు రోజుల పాటు హోరాహోరీగా సాగనున్నాయి. దీనికిగాను 8 బాలికల జట్లు, 17 బాలుర జట్లు కలిపి మొత్తం 25 బాలబాలికల జట్లు తెలుగు రాష్ట్రాల నుంచి హాజరుకానున్నాయి. బాలికల విభాగం నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, ఖమ్మం, విజయవాడ, తెనాలి, హకీంపేట, బొల్లారం, సత్తెనపల్లి, బాలుర విభాగానికి సంబంధించి విజయవాడ–1, విజయవాడ –2, ఒంగోలు, తెనాలి, కర్నూలు, వాల్తేరు, బొల్లారం, కంచనబాగ్, హకీంపేట, సత్తెనపల్లి, హైదరాబాద్, సీఆర్పీఎఫ్, బార్‌కాన్, పికెట్, సూర్యలంక, ఖమ్మం నుంచి జట్లు రానున్నాయి. ఈనెల 24, 25న అండర్–17 బాలికలకు, ఈ నెల 26, 27న అండర్–17 బాలురకు పోటీలు జరుగుతాయి. జూలైలో పంజాబ్‌లో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీల జట్టును ఈ నెల 27న ఎంపిక చేయనున్నారు. క్రీడా పోటీలకు మొత్తం 260 మంది బాలబాలికలు, 40 మంది కోచ్‌లు, ఇతర అఫీషియల్స్ హాజరుకానున్నారు.
హజరుకానున్న 25 జట్లు
సత్తెనపల్లిలో నాలుగు రోజుల
పాటు పోటీలు
27న జాతీయ స్థాయి వాలీబాల్ జట్టు ఎంపిక