
అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
బాపట్ల: వేసవిలో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి చెప్పారు. అగ్నిమాపక వారోత్సవాల వాల్‌పోస్టర్లను స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సోమవారం విడుదల చేశారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉందన్నారు. వాటిని నివారించడానికి ముందస్తు అవగాహన చర్యలు ముఖ్యమన్నారు. విద్యుత్ ప్రమాదాలు నివారించాలని, గృహాలలో ప్రమాదాలు అరికట్టాలన్నారు. కర్మాగారాలు, గిడ్డంగులు, తాత్కాలిక నిర్మాణాలు, పందిళ్ల ద్వారా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ద్వారా ఏప్రిల్ 14 నుంచి 20 తేదీ వరకు జరగనున్న అగ్నిమాపక వారోత్సవాలలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. అగ్ని ప్రమాదాలు అరికట్టడానికి అందరి సహకార కావాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక సేవల శాఖ అధికారి సి మాధవనాయుడు, ఫైర్ ఆఫీసర్ వై వెంకటేశ్వరరావు, డీపీఓ ప్రభాకర్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ రామకృష్ణ, ఎల్‌డీఎం శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి