breaking news
BYD Sealion 7
-
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
చైనీస్ ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ దిగ్గజం 'బీవైడీ' (బిల్డ్ యువర్ డ్రీమ్స్) ఇటీవల ఇండియన్ మార్కెట్లో 'సీలియన్ 7' లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును లాంచ్ చేసినప్పటి నుంచి కొనుగోలుదారులు దీనిని ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల ఒకే రోజు 52 కార్లను డెలివరీ చేసి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌ను సాధించినట్లు ప్రకటించింది.గతంలో చాలా కంపెనీ వందలాది వాహనాలను డెలివరీ చేశాయి. కానీ బీవైడీ కంపెనీ డెలివరీ చేసిన కారు ధరలు ధర రూ. 48.9 లక్షల నుంచి రూ. 54.9 లక్షలు మధ్య ఉన్నాయి. ఇంత ఖరీదైన కార్లను 52 డెలివరీ చేయడం బహుశా ఇదే మొదటిసారి. ఈ కారణంగానే కంపెనీ అమ్మకాల్లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. సీలియన్ 7 ఎలక్ట్రిక్ కార్ల డెలివరీకి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: 2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు ప్రీమియం, పర్ఫామెన్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ప్రీమియం వేరియంట్ ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో 308 Bhp పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తే.. పర్ఫార్మెన్స్ వేరియంట్ డ్యూయల్ మోటార్ సెటప్ ద్వారా 523 Bhp పవర్, 690 Nm టార్క్ అందిస్తుంది. ఈ రెండూ 82.56 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా వరుసగా 567 కిమీ, 542 కిమీ రేంజ్ అందిస్తాయి. మంచి డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందింది. View this post on Instagram A post shared by BYD India (@byd.india) -
బీవైడీ సీలియన్ 7 వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?
బీవైడీ కంపెనీ తన 'సీలియన్ 7' (Sealion 7) ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు రెండు వేరియంట్లలో.. నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సరికొత్త బీవైడీ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త బీవైడీ సీలియన్ 7 కారు ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే వేరియంట్లలో లభిస్తుంది. వాటి ధరలు వరుసగా.. రూ. 48.9 లక్షలు, రూ. 54.9 లక్షలు (ఎక్స్ షోరూమ్). జనవరి ప్రారంభంలోనే కంపెనీ ఆ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు మార్చి 7 నుంచి ప్రారంభమవుతాయి.కొత్త డిజైన్ కలిగిన బీవైడీ సీలియన్.. క్రాస్ఓవర్ మాదిరిగా ఉంటుంది. ఇది వాలుగా ఉండే రూఫ్‌లైన్, అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్ పొందుతుంది. హెడ్‌లైట్స్, టెయిల్ ల్యాంప్ వంటివన్నీ 'బీవైడీ సీల్'ను పోలి ఉంటుంది. ప్రీమియం వేరియంట్ 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, పెర్ఫార్మెన్స్ వేరియంట్ 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్: ఈ రోజు నుంచే..ఫీచర్స్ విషయానికి వస్తే.. బీవైడీ సీలియన్ ఈవీ 15.6 ఇంచెస్ రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పొందుతుంది. ఇది కారు గురించి చాలా సమాచారం అందిస్తుంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్, మెమరీ ఫంక్షన్‌తో ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఫ్లోటింగ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌షేడ్‌తో పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్స్ కూడా ఈ కారులో ఉన్నాయి.బీవైడీ సీలియన్ 7 ఈవీ 82.56 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ప్రీమియం వేరియంట్ ఒక సింగిల్ ఛార్జితో 482 కిమీ రేంజ్ అందిస్తే.. పెర్ఫార్మెన్స్ వేరియంట్ 456 కిమీ రేంజ్ అందిస్తుంది. మొత్తం మీద ఈ రెండు కార్లు అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. ఈ కారు 'వోల్వో సీ40 రీఛార్జ్'కు ప్రత్యర్థిగా ఉంటుంది.