Nagarkurnool District Latest News
-
గడువులోగా సీఎంఆర్ అప్పగించకపోతే చర్యలు
కల్వకుర్తి రూరల్: మిల్లర్లు ప్రభుత్వానికి బకాయిపడిన సీఎంఆర్‌ను నిర్ణీత గడువులోగా అప్పగించకపోతే చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీనివాసులు హెచ్చరించారు. శనివారం కల్వకుర్తి తహసీల్దార్ కార్యాలయంలో డివిజన్లోని రైస్‌మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లర్ల వారీగా బకాయి సీఎంఆర్ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం డీఎస్ఓ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ను మార్చి 17వ తేదీలోగా ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించారు. త్వరలోనే మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు. ఉగాది నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. అప్పటిలోగా పెండింగ్ సీఎంఆర్‌ను ప్రభుత్వానికి అప్పగించాలని తెలిపారు. ఇప్పటికే ఎంతో సమయం ఇచ్చామని.. ఇదే చివరి అవకాశమని అన్నారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీనునాయక్, తహసీల్దార్ ఇబ్రహీం, జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు, డివిజన్ అధ్యక్షుడు పోలా ఏకనాథం, రాంరెడ్డి, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. -
రైస్‌మిల్లులో తనిఖీలు
కల్వకుర్తి: పట్టణంలోని సాయిలక్ష్మి వెంకటేశ్వర రైస్‌మిల్లులో శనివారం అడిషనల్ కలెక్టర్ అమ రేందర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యం, ఇప్పటి వరకు అప్పగించిన సీఎంఆర్ వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వానికి బకాయిపడిన బియ్యా న్ని వెంటనే అందించాలని యజమానిని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ వెంట డిప్యూటీ తహసీల్దార్ రాఘవేందర్‌రెడ్డి ఉన్నారు. నిర్లక్ష్యంతోనే ప్రమాదం నాగర్‌కర్నూల్‌రూరల్: ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను పూర్తిగా పరీక్షించకుండా పనులు చేపట్టడంతోనే కార్మికులు ప్రమాదానికి గురయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్‌నర్సింహ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల తర్వాత పనులను తిరిగి ప్రారంభించిన అధికారులు.. టన్నెల్ సురక్షితంగా ఉందా లేదా అనే విషయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికు ల ప్రాణాలను కాపాడాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శివశంకర్, గోపాల్, శివకృష్ణ ఉన్నారు. సమగ్ర విచారణ జరపాలి.. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో భారీ వర్షాల కారణంగా సొరంగం పనులు నిలిచిపోవడంతో పాటు మిషన్లు కూడా నీటిలో మునిగిపోయాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా పనులను పునఃప్రారంభించడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్.శ్రీనివాసులు, దేశ్యానాయక్, ఆంజనేయులు, శంకర్‌నాయక్, శివవర్మ తదితరులు ఉన్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
వనపర్తి/కొత్తకోట రూరల్: దేశంలో ఉన్న మంచినూనె కొరతను అధిగమించి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగేందుకు రైతులు అత్యధికంగా ఆయిల్‌పాం సాగు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరా రు. దేవరకద్ర నియోజకవర్గంలోని సంకిరెడ్డిపల్లిలో ప్రీ యూనిక్ సంస్థ నిర్మించనున్న ఆయిల్‌పాం ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయిల్‌పాం రైతులతో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో వంటనూనెల లోటు భర్తీ చేయాలంటే 70 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేపట్టాల్సిన అవసరం ఉందని.. తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందే పంట ఆయిల్‌పాం మాత్రమే అన్నారు. ప్రస్తుతం ఆయిల్‌పాం గెలలు టన్నుకు రూ.20,487 ధర పలుకుతుందని త్వరలో రూ.25 వేలకు చేరుతుందని వివరించారు. ఆగస్టు 15 నాటికి కంపెనీ నిర్మాణం పూర్తిచేసి ప్రారంభిస్తామని.. అదేవిధంగా బీచుపల్లి వద్ద ఉన్న కంపెనీ మరమ్మతు పూర్తిచేసి ఇదే సంవత్సరంలో వినియోగంలోకి తీసుకువస్తామని భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆయిల్‌పాం కంపెనీ నిర్మాణం ఎట్టకేలకు కార్యరూపం దాల్చిందని.. త్వరగా నిర్మాణం పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ ప్రతినిధులను కోరా రు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బడుగు, బలహీనవర్గాలు, రైతుల సమ స్యలు తనవిగా భావించి పరిష్కరిస్తున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, తూడి మేఘారెడ్డి మాట్లాడారు. అంతకుముందు పెద్దమందడి మండలం వెల్టూరులో ఆరోగ్య ఉప కేంద్ర భవనం, మోజర్లలో గోదాముల సముదాయానికి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. పెబ్బేరులో మరో వ్యవసాయ గోదాం, వ్యవసాయ కార్యాలయ భవన నిర్మాణానికి, కాలిన మార్కెట్‌యార్డు గోదాం పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యానశాఖ ఎండీ షేక్ యాస్మిన్‌బాషా, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. ఆయిల్‌పాం సాగుపై రైతులు దృష్టి సారించాలి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
సత్వర న్యాయం అందేలా చూడాలి
నాగర్‌కర్నూల్ క్రైం: కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా న్యాయమూర్తులు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి శరత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టులో మెడికల్ డిస్పెన్సరీ యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం న్యాయ సేవలు, చట్టాల అమలు, వివిధ శాఖల విధులపై చర్చించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయస్థానాల ద్వారా అందించే సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడికల్ డిస్పెన్సరీ యూనిట్‌తో న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి ఉచితంగా వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. కోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపులో 400 మందికి గుండె, ఊపిరితిత్తుల సంబంధిత పరీక్షలతో పాటు షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి రాజేశ్‌బాబు, సీనియర్ సివిల్‌జడ్జి సబిత, న్యాయమూర్తులు శ్రీదేవి, కావ్య, శ్రీనిధి, ఏఎస్పీ రామేశ్వర్, డీఎంహెచ్ఓ డా.స్వరాజ్యలక్ష్మి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గాయత్రి, బార్ కౌన్సిల్ సభ్యుడు హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
విద్యుత్ బకాయిలు వసూలు చేయండి
నాగర్‌కర్నూల్ క్రైం/చారకొండ/వెల్దండ/: విద్యుత్ బకాయిలు పెండింగ్ లేకుండా ప్రతినెలా వసూలు చేయాలని విద్యుత్‌శాఖ రెవెన్యూ విభాగం జనరల్ మేనేజర్ తులసీ నాగరాణి అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో శనివారం సంబంధిత అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యుత్ బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించేలా వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లుల వసూలుపై నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఎవరైనా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతకుముందు చారకొండ, సిర్సనగండ్ల గ్రామాల్లో ఆమె పర్యటించి విద్యుత్ సమస్యలపై ఆరా తీశారు. ప్రతినెలా బిల్లులు చెల్లించాలని వినియోగదారులకు సూచించారు. అర్హులందరూ గృహజ్యోతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సిర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి, గుండాల అంబా రామలింగేశ్వరస్వామి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎస్ఈ పాల్‌రాజ్, డీఈ శ్రీధర్‌శెట్టి, టెక్నికల్ డీఈ రవికుమార్, పార్ధసారథి, శ్రీనివాస్, ఏఈ జానకీరాం నాయక్, శంకర్, వెంకటయ్య రాఘవేందర్‌గౌడ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు
స్టేషన్ మహబూబ్‌నగర్: మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రత్యేక బస్సు లు నడుపనున్నారు. రీజియన్‌లోని 9 డిపోల నుంచి శ్రీశైలం వరకు 357 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ప్రతి ఏడాది రీజియన్‌లోని డిపోల నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతారు. శివరాత్రి అనంతరం తిరుగు ప్రయాణం రోజుల్లో కూడా ప్రత్యేక బస్సులు నడపడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో అచ్చంపేట డిపో నుంచి 58, గద్వాల నుంచి 15, కల్వకుర్తి 34, కొల్లాపూర్ 37, మహబూబ్‌నగర్ 85, నాగర్‌కర్నూల్ 56, నారాయణపేట 23, షాద్‌నగర్ 6, వనపర్తి డిపో నుంచి 43 ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు రీజియన్ నుంచి 151 బస్సులు నడపనున్నారు. సద్వినియోగం చేసుకోవాలి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రీజియన్‌లోని డిపోల నుంచి ప్రత్యేక బస్సు లు నడుపుతున్నామని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ తెలిపారు. శ్రీశైలంతోపాటు ఆయా బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం చలువ పందిర్లు, తాగునీరు, వలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బస్సుల వివరాలు, తేదీల వారీగా.. మహా శివరాత్రి నేపథ్యంలో రీజియన్ నుంచి 357 సర్వీసులు -
ఎనిమిది మంది
సొరంగంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులు శ్రీౖశెలం జలాశయం నుంచి నీటిని నల్లగొండ జిల్లాకు తరలించేందుకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. నల్లమల కొండలను తవ్వుకుంటూ సుమారు 40 కి.మీ., మేర టన్నెల్‌ను తవ్వాల్సి ఉండగా.. కృష్ణాతీరం నుంచి 13 కి.మీ., మరోవైపు అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి నుంచి 23 కి.మీ., టన్నెల్ తవ్వకం పూర్తయ్యింది. దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ ఇన్లెట్ నుంచి 14 కి.మీ., వద్ద సొరంగం తవ్వకాలను గత నాలుగు రోజుల కిందటే మొదలుపెట్టారు. ఈ సొరంగంలో గత నాలుగేళ్లుగా నీటి సీపేజీ కొనసాగుతోంది. శనివారం ఈ నీటి ఉధృతి ఎక్కువై అప్పటికే బలహీనంగా మారిన పైకప్పు, రాక్ బోల్టింగ్, కాంక్రీట్ సెగ్మెంట్‌తోపాటు ఒక్కసారిగా కుప్పకూలింది. సీపేజీ నిర్వహణ, డీవాటరింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించడంతోపాటు భద్రతా ప్రమాణాలు పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో చేపడుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణ పనుల్లో ఇన్లెట్ టన్నెల్లో 14 కి.మీ., వద్ద సొరంగం పైకప్పు కూలి ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో ప్రమాదం సంభవించగా, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సొరంగంలో నీటి ఊట ఉధృతి పెరిగి, మట్టి వదులు కావడం, అకస్మాత్తుగా కాంక్రీట్ సెగ్మెంట్ ఊడిపడటంతో ప్రమాదం సంభవించింది. టన్నెల్ బోరింగ్ మిషన్‌కు ఇవతల వైపు ఉన్న సుమారు 50 మంది బయటకు పరుగులు తీసి ప్రాణాలను దక్కించుకోగా.. అవతల వైపు ఉన్న 8 మంది సొరంగంలోనే చిక్కుకునిపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సుమారు 150 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక, సింగరేణి కాలరీస్‌కు చెందిన రెస్క్యూ టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉంది. ఒకే మార్గం గుండా.. టన్నెల్ శిథిలాల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలకు పెద్దఎత్తున నీటి ప్రవాహం, బురద ఆటంకంగా మారాయి. ఇలాంటి సొరంగ పనుల నిర్వహణకు ఆడిట్ టన్నెళ్లు, ఎస్కేప్ టన్నెళ్లు కీలకంగా పనిచేస్తాయి. వీటి ద్వారా సొరంగంలో తొలగించిన మట్టి, రాళ్లు, శిథిలాల తొలగింపుతోపాటు సొరంగంలో ఎయిర్ ప్రెజర్‌ను సమన్వయం చేసేందుకు, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు ఉపయోగపడతాయి. ఇలాంటివి ఏమీ ఆడిట్, ఎస్కేప్ టన్నెళ్లు ఈ ప్రాజెక్ట్‌లో లేవు. ప్రధాన సొరంగంతోపాటు అదనంగా ఆడిట్ టన్నెళ్ల నిర్మాణం చేపట్టేందుకు అటవీశాఖ అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు. ఆడిట్ టన్నెళ్లు లేకపోవడం, ఒకే మార్గం గుండా సహాయక చర్యలు చేపట్టడం రెస్య్యూ బృందాలకు సవాలుగా మారింది. సీపేజీనే ప్రమాదానికి కారణం.. ఘటనా స్థలానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి, కలెక్టర్, ఎస్పీ కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలు రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, సింగరేణి రెస్క్యూ బృందాలు భారీ ఎత్తున నీటి ఊట, బురద, శిథిలాలతో సహాయక చర్యలకు ఆటంకం -
తగ్గనున్న మహిళల ప్రాతినిధ్యం
●● స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ 50శాతం దాటొద్దని ఆదేశాలు ● బేస్ సంఖ్య స్థానాల్లో ప్రభావం ● పలు మండలాల్లో ఒక్కొక్క స్థానం కోల్పోనున్న మహిళలు ఎలాంటి ఆదేశాలు రాలేదు.. మహిళలకు రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియపై ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తాం. కోడేరు మండలంలో ఆరు జీపీలు తగ్గాయి. పెద్దకొత్తపల్లిలో మూడు కొత్తగా ఏర్పాటయ్యాయి. జిల్లాలో మొత్తం 460 జీపీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. – రామోహ్మన్‌రావు, డీపీఓ అచ్చంపేట: స్థానిక ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ కేటాయింపు విధానంలో పలు మార్పులు చేశారు. వీటి ఫలితంగా పలుచోట్ల మహిళల స్థానాలు స్వల్పంగా తగ్గనున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను మండల యూనిట్‌గా.. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను జిల్లా యూనిట్‌గా తీసుకుని రిజర్వు స్థానాలను కేటాయించనున్నారు. గతంలో మహిళలకు 50 శాతం స్థానాలు తగ్గకుండా రిజర్వు చేయాలనే ఆదేశాలతో సగం కంటే ఎక్కువ కేటాయించాల్సి వచ్చింది. ప్రస్తుతం మహిళలకు సగం కంటే ఎక్కువ స్థానాలు దాటొద్దనే నిబంధనను పరిగణనలోకి తీసుకోనున్నారు. తద్వారా బేస్ సంఖ్యలో స్థానాలు ఉన్న మండలాల్లో సమస్య రానుంది. ఇదిలా ఉంటే.. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏవి ముందు నిర్వహించాల్సి వచ్చినా.. అందుకు పూర్థిస్తాయిలో సన్నద్ధమై ఉండాలని పంచాయతీరాజ్ శాఖ సూచించింది. ఆరు జీపీలు ఔట్.. ఐదు ఇన్ గత ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 461 గ్రామపంచాయతీలు ఉండగా.. కోడేరు మండలంలోని ముత్తిరెడ్డిపల్లి, తుర్కదిన్నె, సింగాయిపల్లి, గుండావాయిని తండా, మాచుపల్లి, రేకులపల్లి జీపీలను వనపర్తి జిల్లా ఏదుల మండల పరిధిలోకి వెళ్లాయి. దీంతో ఆరు జీపీలు తగ్గాయి. అదే సమయంలో పెద్దకొత్తపల్లి మండలంలో కొత్తగా ఏర్పాటైన బాచారం, సంజీవపూర్, కొత్తపేట జీపీలతో పాటు కొల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి విలీనం రద్దయిన బోయలపల్లి (నర్సింగరావుపల్లి), తాళ్ల నర్సింగాపురం రెండు జీపీలు ఏర్పాటయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం 460 గ్రామపంచాయతీల్లో 4,140 వార్డులు, 20 జెడ్పీటీసీ, 214 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు ప్రకటించారు. లక్కీ డ్రా విధానంలోనే.. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిస్థాయిలో ముగిశాకే లక్కీ డ్రా విధానంలో మహిళలకు రిజర్వు స్థానాలు కేటాయిస్తారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల వారీగా లక్కీ డ్రా చేపడతారు. సర్పంచ్, ఎంపీటీసీలకు ఆర్డీఓ స్థాయిలో, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు కలెక్టర్ స్థాయిలో రిజర్వేషన్లు కేటాయిస్తారు. పూర్తిస్థాయిలో బీసీ కులగణన పూర్తయ్యాక.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. పంచాయతీ ఎన్నికల్లోనూ.. గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాల్లోనూ ఇదే పద్ధతిని అనుసరించనున్నారు. గతంలో ఉప్పునుంతల మండలంలో 27 గ్రామపంచాయతీలకు సగం లెక్కిస్తే.. 13.5 అవుతుంది. అక్కడ 14 జీపీలను మహిళలకు కేటాయించారు. ఈసారి అక్కడ మహిళలకు 13 జీపీలు మాత్రమే రిజర్వు చేయనున్నారు. బల్మూర్ మండలంలో 23, లింగాలలో 23 జీపీలు ఉండగా.. 11 స్థానాల చొప్పున మహిళలకు కేటాయించనున్నారు. గతంలో అచ్చంపేట మండలంలో 33 జీపీలు ఉండగా.. 17 సర్పంచ్ స్థానాలు మహిళలకు కేటాయించారు. ఈసారి ఇక్కడ కొత్తగా ఐదు జీపీలు ఏర్పాటు కావడంతో మొత్తం 38 ఉన్నాయి. మహిళలకు సగం అంటే 19 స్థానాలు వస్తాయి. బేస్ సంఖ్య వచ్చే ప్రతిచోట మహిళా రిజర్వు స్థానాలు తగ్గనున్నాయి. జిల్లాలోని చాలా మండలాల్లో బేస్ సంఖ్య కారణంగా మహిళల ప్రాతినిధ్యం తగ్గనుంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ అన్ని కేటగిరిల్లోనూ సగం కేటాయించాల్సి ఉండటంతో.. ఇక్కడా బేస్ సంఖ్య వస్తే ఆ వర్గంలోనూ మహిళా స్థానాలు తగ్గుతాయి. మొత్తంగా మహిళల ప్రాతినిధ్యం కొంతమేర తగ్గనుందని చెప్పవచ్చు. ● జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలు ఉండటంతో మహిళలకు సగం స్థానాలు వస్తాయి. సరి సంఖ్య రావడంతో రిజర్వేషన్ కేటాయింపుల్లో ఎలాంటి ఇబ్బంది ఉత్పన్నం కాదు. ఇందులో సగం అంటే 10 స్థానాలు కేటాయించాల్సిందే. బేస్ సంఖ్య వచ్చే మండలాల్లో మాత్రమే రిజర్వేషన్లలో స్పల్ప మార్పులు జరగనున్నాయి. బేస్ సంఖ్య స్థానాల్లోనే సమస్య.. అమ్రాబాద్ మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. అందులో సగం అంటే 4.5 అవుతుంది. అలాగే పదర మండలంలో 5 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 2.5గా పరిగణించాలి. గతంలో ఆయా మండలాల్లో 5, 3 స్థానాలు మహిళలకు కేటాయించారు. ఇప్పుడా పరిస్థితి ఉండదు. ఎందుకంటే మహిళలకు సగం కంటే ఎక్కువ స్థానాలు దాటొద్దనే నిబంధనను పరిగణనలోకి తీసుకోనున్నారు. కొత్త విధానంతో అక్కడ మహిళలకు 4, 2 ఎంపీటీసీ స్థానాలు మాత్రమే కేటాయించనున్నారు. బల్మూర్ మండలంలో 11, కల్వకుర్తిలో 11, వెల్దండలో 11, బిజినేపల్లి మండలంలో 21 స్థానాలు ఉండగా.. ఒక్కో స్థానం మహిళలకు తగ్గనుంది. -
భక్తిశ్రద్ధలతో శనేశ్వరుడికి పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ శనేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఏలినాటి శని నివారణ కోసం శనేశ్వరుడికి తిలతైలాభిషేకాలు చేశారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోపాలరావు, ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి, అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్, కమిటీ సభ్యులు ప్రభాకరాచారి, పుల్లయ్య, వీరశేఖర్ పాల్గొన్నారు. -
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
కల్వకుర్తి టౌన్: మున్సిపల్ సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ హెచ్చరించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని ఆయన చాంబర్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలో కొత్తగా స్వయం సహాయక మహిళా సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు పాత సంఘాలకు రుణాలు మంజూరయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అర్హులైన సభ్యులందరికీ సీ్త్రనిధి రుణాలు అందించాలని తెలిపారు. తడి, పొడి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో మేనేజర్ రాజకుమారి, శానిటరీ ఇన్స్పెక్టర్ శివ, రిసోర్స్ పర్సన్లు తదితరులు ఉన్నారు. -
ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సన్నద్ధం కావాలి
కల్వకుర్తి టౌన్: ఇంటర్మీడియట్, పదో తరగతి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని డీఈఓ రమేష్ కుమార్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటర్, పదో తరగతి విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. వార్షిక పరీక్షలంటే భయం వీడి.. ఉత్సాహంగా ముందుకెళ్లాలని విద్యార్థినులకు డీఈఓ సూచించారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థినిపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఉత్తమ ఫలితాలు రాబట్టాలన్నారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థినులకు మంచి పోషకాలతో కూడిన ఆహారం అందించాలన్నారు. విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరయ్యేలా సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం కేజీబీవీలో ఉన్న రికార్డులను పరిశీలించి, పలు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు. డీఈఓ వెంట ఎస్ఓ రమాదేవి తదితరులు ఉన్నారు. -
తిలా పాపం.. తలా పిడికెడు!
అక్రమ నిర్మాణాల్లో అధికారులే సూత్రధారులు? ●నాగర్‌కర్నూల్: తెలకపల్లి మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాలకు అధికారులు కీలక సూత్రధారులుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకుల ఆజ్ఞ మేరకు అక్రమ నిర్మాణాల నుంచి విద్యుత్ మీటర్ల మంజూరు వరకు సహకారం అందించినట్లు తేటతెల్లమవుతోంది. బాధితులు ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకుండా.. దగ్గరుండి అక్రమ నిర్మాణాలను పూర్తి చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణదారులకు దన్ను.. తెలకపల్లిలో అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే కళ్లు మూసుకున్న అధికారులు.. సదరు భూమికి తామే వారసులమంటూ బాధితులు ఆ భూమిలో తడకలు వేసుకుంటే మాత్రం రాత్రికి రాత్రే స్పందించారు. పోలీసులు, గ్రామపంచాయతీ అధికారులు సంయుక్తంగా వెళ్లి తడకలను తొలగించారు. మరోసారి నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బాధితులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అయితే దీన్ని వెనక రాజకీయ నాయకుల హస్తం ఉండటంతో అధికారుల వ్యవహార శైలి ఇలా ఉందనే విమర్శలు ఉన్నాయి. దుకాణాలను నిర్మించుకున్న వ్యక్తులు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రూ.లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్రేడ్ లైసెన్స్‌లు లేకుండానే.. తెలకపల్లిలోని వివాదాస్పద భూమిలో అక్రమంగా నిర్మించిన దుకాణాల్లో ప్రస్తుతం వివిధ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఏదైన వ్యాపారం కొనసాగాలంటే కచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇందుకు దుకాణానికి సంబంధించిన అన్ని అనుమతులు ఉండాలి. కానీ అక్కడ నిర్మించిన ఏ ఒక్క దుకాణానికి అనుమతులు లేవు. దీంతో ట్రేడ్ లైసెన్స్ లేకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఫలితంగా ప్రతి సంవత్సరం రూ. 1.50లక్షల వరకు గ్రాపంచాయతీ ఆదాయాన్ని కోల్పోతోంది. దీంతో పాటు అప్పటి విద్యుత్ అధికారులు అడ్డగోలుగా, నిబంధనలకు విరుద్దంగా విద్యుత్ మీటర్లను ఇచ్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ట్రేడ్ లైసెన్స్‌లు లేవు.. తెలకపల్లిలోని సర్వే నంబర్ 497లో నిర్మించిన దుకాణాలకు అనుమతులు లేకపోవడంతో పాటు ట్రేడ్ లైసెన్స్‌లు కూడా లేవు. ట్రేడ్ లైసెన్స్‌లు ఉంటే సంవత్సరానికి రూ. 1.20లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ట్రేడ్ లైసెన్స్‌లు లేకుండానే వ్యాపారాలు కొనసాగుతున్నాయి. నేను ఈఓగా బాధ్యతలు చేపట్టక ముందే ఈ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. – భాస్కర్, ఈఓ, తెలకపల్లి ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశాకే కదలిక.. అక్రమ నిర్మాణాల విషయంలో బాధితులు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో గతేడాది ఆగస్టు 12న ఫిర్యాదు చేఽశారు. ఈ మేరకు అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి.. రిపోర్టు అందజేయాలని కమిషనర్ ఆదేశిస్తే గాని జిల్లా అధికార యంత్రాంగం కదలలేదు. విచారణ పూర్తి చేశామని.. సదరు నిర్మాణాలకు అనుమతులు లేవని చెబుతున్న అధికారులు.. ఇప్పటికై నా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసిన ఆక్రమణదారులు రూ.లక్షల్లో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు తర్వాతే అధికారుల్లో చలనం -
నేడు జిల్లా కోర్టులో మెడికల్ క్యాంపు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా కోర్టు ఆవరణలో శనివారం మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి సబిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెడికల్ క్యాంపులో న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు వైద్యపరీక్షలు చేస్తారని.. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్ కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని డీఐఈఓ వెంకటరమణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా నాలుగు దశల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 13,454 మంది ఇంటర్ ప్రాక్టికల్స్‌కు హాజరైనట్లు వివరించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించామని డీఐఈఓ తెలిపారు. చరిత్రను ఎప్పటికీ మరిచిపోవద్దు నాగర్‌కర్నూల్ క్రైం: చరిత్రను ఎప్పటికీ మర్చిపోరాదని.. గతంలో జరిగిన అనేక సంఘటనలను జీవన విధానంలో పాటించాల్సిన అవసరం ఉందని అదనపు ఎస్పీ రామేశ్వర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పురాతన నాణేల ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్దులకు పురాతన నాణేల గొప్పతనాన్ని, ప్రత్యేకను అర్థం చేసుకునేందుకు అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. చరిత్రను అధ్యయనం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గత అనుభవాలను తెలుసుకుని వాటి ప్రాధాన్యతను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. పురాతన నాణేలు ఏ సంవత్సరానికి చెందినవనే విషయాన్ని చరిత్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ధర్మ, డా.హజీరా ఫర్విన్ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణయ్య పాల్గొన్నారు. బైపాస్ బాధితులకు న్యాయం చేయాలి నాగర్‌కర్నూల్‌రూరల్: చారగొండలో ఎన్‌హెచ్–167కే బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందికొండ గీత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చారగొండలో నేషనల్ హైవే బైపాస్ బాధితులకు అరకొర పరిహారం చెల్లించి.. బలవంతంగా ఇళ్లు కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో 12 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 24న కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పొదిల రామయ్య, సభ్యులు అశోక్, సురేష్, చంద్రశేఖర్, నాగరాజు, తిరుపతయ్య ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అవగాహన
కోడేరు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని జిల్లా హౌసింగ్ పీడీ సంగప్ప అన్నారు. శుక్రవారం మండలంలోని పస్పుల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించే స్థలం వెడల్పు 18 ఫీట్లు, పొడవు 22 ఫీట్లు ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కురుమూర్తి, రాజవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ లక్ష్యాలను సాధించాలి కందనూలు: ఉపాధి హామీ పథకం లక్ష్యాలను మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాలని అడిషనల్ డీఆర్డీఓ రాజేశ్వరి అన్నారు. ఉపాధి హామీ కూలీలకు కల్పించాల్సిన పనిదినాలు, పని ప్రదేశాల్లో వసతులు, నర్సరీల నిర్వహణ తదితర అంశాలపై శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీఆర్డీఓ మాట్లాడుతూ.. 2024–25లో గ్రామపంచాయతీలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి పెంచాలన్నారు. మొక్కల పరిరక్షణ కోసం క్రమం తప్పకుండా నీటిని అందించాలని ఆదేశించారు. శనివారం సాయంత్రంలోగా ఉపాధి హామీ మెటీరియల్ బిల్లుల వివరాలు అందించడంతో పాటు మంజూరు చేసిన పనులను వందశాతం పూర్తి చేయాలన్నారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. 2025–26 సంవత్సరానికి పండ్ల తోటలు పెంపకం లబ్ధిదారులను గుర్తించాలని.. ఈత ప్లాంటేషన్ ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని తెలిపారు. సమావేశంలో ఏపీడీ శ్రీను, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా పొట్టేళ్ల బల ప్రదర్శన పోటీలు
అయిజ: మండల కేంద్రంలోని తిక్కవీరేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ వారు శుక్రవారం అంతర్రాష్ట్ర స్థాయి పొట్టేళ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 20 పొటేళ్లు హోరా హోరీగా తలపడ్డాయి. అయిజ మండలానికి చెందిన సుల్తాన్ పొట్టేలు ప్రథమ స్థానంలో నిలిచి రూ.50వేలు, హైదరాబాద్‌కు చెందిన రాజావలి, ఎంజీ గ్రూప్, క్రైమ్ మేకర్ పొట్టేళ్లు ద్వితీయ, తృతీయ, నాల్గో స్థానాల్లో నిలిచి రూ.35వేలు, 20వేలు, రూ.10వేలు గెలుచుకున్నాయి. -
పాలమూరుపై పగ ఎందుకు?
నారాయణపేట: ‘పాలమూరు జిల్లాలో కృష్ణానది 811 టీఎంసీల నీరు పారుతుంది.. ఈ నీరు దశాబ్దాలుగా పారుతున్న ఈ ప్రాంత ప్రజల కష్టాలు ఎందుకు తీరలేదు.. సాగునీరు, తాగునీరు ఎందుకు అందలేదు.. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో పాలమూరులో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు.. జిల్లాను ఎందుకు నిర్లక్ష్యం చేశారంటూ’ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా దాదాపు రూ.వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం అప్పక్‌పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పాలమూరు– రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పదేళ్లు నిర్లక్ష్యం చేశారు.. పైగా పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయేందుకు అవకాశం కల్పించారని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. పాలమూరులో చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కేసీఆర్‌కు పగ ఎందుకు అని ప్రశ్నించారు. కేవలం 12 నెలల్లో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ఈ విషయంలో ప్రతిపక్షాలతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. 70 ఏళ్లకు సీఎం పదవి హైదరాబాద్ రాష్ట్రానికి పాలమూరు జిల్లావాసి బూర్గుల రామకృష్ణారావు తొలి ముఖ్యమంత్రిగా పనిచేస్తే దాదాపు 7 దశాబ్దాల తర్వాత తిరిగి పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని రేవంత్‌రెడ్డి అన్నారు. పాలమూరు బిడ్డ మీ ముందు నిటారుగా నిలబడ్డాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు. పాలమూరు ప్రజల పేదరికాన్ని ప్రపంచ దేశాలకు చూపించి విదేశాల్లో మార్కెటింగ్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెనకబడిన ఈ పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని, ఇందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘పేట–కొడంగల్’ను పూర్తి చేసుకుందాం పదేళ్లలో సంగం‘బండ’ పగలకొట్టలేదు. దీంతో ఆ ప్రాంతంలోని 10 వేల వ్యవసాయ భూములకు సాగునీరు అందక ఏడారిగా మారాయని సీఎం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.15 కోట్లు మంజూరు చేసి బండను పగలకొట్టించామన్నారు. ఇప్పుడు 10 వేల ఎకరాలు పారుతున్నాయన్నారు. మక్తల్, కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టు 2014లో కొట్లాడి మంజూరు చేయిస్తే తనపైన ఉన్న కోపంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా కేసీఆర్ ఆపేశారన్నారు. ఇప్పుడు తన హయాంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉదండాపూర్, పాలమూరు రంగారెడ్డి, ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పేట– కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని, రైతులకు ఎకరాకు రూ.10 లక్షలు సరిపోకపోతే రూ.20 లక్షలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. లగచర్లలో పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేస్తే అడ్డుకున్నారని, పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుంటే ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారని ప్రశ్నించారు. జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని, నన్ను కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిదేశంలోనే తొలి మహిళా పెట్రోల్ బంక్ ఆడబిడ్డలకు ఆర్థిక స్వావలంభన ఇవ్వాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్‌బంక్ మంజూరు చేశామని సీఎం అన్నారు. ఆనాడు కాంగ్రెస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్ర భుత్వం పదేళ్లలో బడుగు బలహీన వర్గాల ప్ర జలను డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట మోసం చేసి గద్దెనెక్కిందని విమర్శించారు. తిరిగి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసుకొని.. ఈ రోజు నారాయణపేట మండలం అప్పక్‌పల్లి నుంచి భూమిపూజ చేయడం జరిగిందన్నారు. అవసరమైతే నియోజకవర్గానికి 5 వేలకు పెంచుతామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేకపోయారు కృష్ణానదిలో 811 టీఎంసీలు పారుతున్నా సాగు, తాగునీరు లేదు ఏడాదికి 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం పేట ‘ప్రజా పాలన– ప్రగతి బాట’ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజం రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు -
జాతీయస్థాయికి ముష్టిపల్లి విద్యార్థుల ప్రాజెక్టు
పెద్దకొత్తపల్లి: డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లిటరసి వారు ఆన్లైన్లో నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌లో పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభకనబరిచారు. విపత్తుల నిర్వహణ అంశంపై విద్యార్థులు గాధరి ప్రవీణ్, సాయిచరణ్ రూపొందించిన నోకాస్ట్ లైఫ్ సేవింగ్ బోటు అనే ప్రాజెక్టు జాతీయస్థాయికి ఎంపికై ందని హెచ్ఎం సురేఖ తెలిపారు. వరద బాధితుల ప్రాణాలను రక్షించేందుకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం గురుకాసి యూనివర్సిటీ వారు అవసరమైన నిధులను అందజేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయస్థాయికి ఎంపికై న విద్యార్థులతో పాటు గైడ్ టీచర్ శైలజ, విద్యార్థుల తల్లిదండ్రులకు డీఈఓ రమేష్ కుమార్ అభినందనలు తెలిపారు. -
రేపటినుంచి స్పెషల్ డ్రైవ్ తనిఖీలు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం శనివారం నుంచి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా మైనర్లు వాహనాలు నడుపుతూ తనిఖీల్లో పట్టుబడితే కేసు నమోదు చేయడంతోపాటు తల్లిదండ్రులను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అలాగే నంబర్ ప్లేట్ లేని వాహనాలు రోడ్లపైకి తీసుకువస్తే సీజ్ చేస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని సూచించారు. నాసిరకం సరుకులతో మధ్యాహ్న భోజనం బిజినేపల్లి: మండలంలోని పాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమకు మధ్యాహ్నం అందించే భోజనం నాణ్యతగా లేదని, ప్రశ్నించిన తమను వంట ఏజెన్సీ మహిళలు దుర్భాషలాడుతున్నారని గురువారం ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు వంట కోసం నాసిరకం సరుకులు ఉపయోగిస్తున్నారని, దీంతో ప్రతిరోజు మధ్యాహ్నం సరిగా భోజనం తినలేకపోతున్నామని అధికారుల ఎదుట వాపోయారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన తహసీల్దార్ శ్రీరాములు, ఎంఈఓ రఘునందన్‌రావు నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని, ప్రస్తుతానికి వంట ఏజెన్సీని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై మహిళా సంఘాల సహకారంతో శుక్రవారం నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని, భోజన నాణ్యతపై ఉపాధ్యాయులు కూడా దృష్టిపెట్టాలని సూచించారు. విద్యార్థుల నుంచి ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వంట ఏజెన్సీ సిబ్బంది కూడా స్వచ్ఛందంగా తప్పుకుంటామని అధికారులతో చెప్పారు. దీంతో విద్యార్థులు తమ తరగతి గదులకు వెళ్లిపోయారు. కాగా నూతన ఏజెన్సీని తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. -
చర్యల్లేవ్
అనుమతుల్లేవ్.. తెలకపల్లి వివాదాస్పద భూమిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు ●తెలకపల్లిలోని ప్రధాన రహదారిపై అనుమతి లేకుండా నిర్మించిన దుకాణాలు నోటీసులు ఇచ్చాం మండల కేంద్రంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన దుకాణాలకు సంబంధించి గతంలోనే రెండుసార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – భాస్కర్, పంచాయతీ ఈఓ, తెలకపల్లి విచారణ జరిపాం.. తెలకపల్లిలో అనుమతి లేకుండా కొనసాగుతున్న నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడికి వెళ్లి విచారణ జరిపాం. విచారణకు సంబంధించిన రిపోర్ట్ జిల్లా పంచాయతీ అధికారికి అందజేశాం. ఈ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని రిపోర్ట్‌లో పేర్కొనడం జరిగింది. – వరలక్ష్మి, డీఎల్పీఓ, నాగర్‌కర్నూల్ నాగర్‌కర్నూల్: అధికారం బలం, అధికారుల అండ ఉంటే ఎంతటి అక్రమాలకై నా పాల్పడవచ్చనేది మరోమారు నిరూపితమైంది. తెలకపల్లిలోని ప్రధాన రహదారిపై ఎలాంటి అనుమతులు లేకుండా 40 దుకాణాలు నిర్మిస్తే కనీసం చర్యలు తీసుకునే పాపాన పోకుండా ఆ అక్రమాలకే సహకరించారు. గత కొన్నేళ్లుగా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఓ ప్రజాప్రతినిధి ఈ నిర్మాణాలకు పూర్తిస్థాయిలో సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వాటిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తుండటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే అక్రమాల్లో అన్ని పార్టీల హస్తం ఉందనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన రహదారిపై ఉండటం, విలువైన స్థలం కావడంతో అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి ఈ నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్‌కు నివేదిస్తాం.. తెలకపల్లిలోని సర్వే నంబర్ 497లో దుకాణాల నిర్మాణాలకు సంబంధించి విచారణ పూర్తయింది. మరో రెండు, మూడు రోజుల్లో వచ్చిన రిపోర్ట్‌ను స్టడీ చేసి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తాం. – రామ్మోహన్, డీపీఓ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టింపు కరువు విచారణ పేరుతో చర్యలకు కాలయాపన రాజకీయ నేతల ప్రమేయంతోనే వెనుకడుగు తాజా పరిణామాలపై కలెక్టర్ సీరియస్? -
ఎకై ్సజ్ అధికారుల విస్తృత తనిఖీలు
కొల్లాపూర్: మండలంలో రెండు రోజులుగా ఎకై ్సజ్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గురువారం అమరగిరి, మారెడుమాన్‌దిన్నె, యాపట్ల, చంద్రబండతండా, జొన్నలబొగుడ తదితర గ్రామాల్లో తనిఖీలు చేపట్టి.. 150 కిలోల నల్లబెల్లం, 20 కిలోల పటికను స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఏఎస్పీ భాస్కర్ మాట్లాడారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 10 టీంలతో కలిసి రెండు రోజుల పాటు విస్తృత తనిఖీలు చేపట్టామన్నారు. గంజాయి విక్రయాలపైనే దృష్టిసారించామన్నారు. జిల్లావ్యాప్తంగా నెలరోజులుగా స్పెషల్ డ్రైవ్ కొనసాగించామన్నారు. నెల రోజుల వ్యవధిలో జిల్లాలో 21 కేసులు నమోదు చేసి, 26 మందిని అరెస్టు చేశామన్నారు. 4,500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశామని, 118 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. 24 వాహనాలు, 9 సెల్ఫోన్లను సీజ్ చేశామన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన తనిఖీల్లో డీఎస్పీ తిరుపతియాదవ్, ఎస్టీఎఫ్ టీం లీడర్స్ అంజిరెడ్డి, ప్రదీప్‌రావు, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గాయత్రి, ఎకై ్సజ్, పోలీస్ శాఖకు చెందిన సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘సీఎం ఇంటిని ముట్టడిస్తాం’
చారకొండ: చారకొండలో జాతీయ రహదారి బైపాస్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు అన్నారు. మండల కేంద్రంలో బైపాస్ బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 10వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన బాధితులకు మద్దతుగా సంఘీభావం తెలిపి మాట్లాడారు. బైపాస్ నిర్మాణంలో అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా 29 మంది ఇళ్లను నేలమట్టం చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వారికి న్యాయం చేయాలని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గతంలో వారికి ఇచ్చిన నష్టపరిహారం ఏమాత్రం సరిపోదని, ఇంటిస్థలం కూడా రాదన్నారు. బాధితులకు నూతన స్థలం కేటాయించి.. ఇల్లు నిర్మించి ఇవ్వాలని, లేదా రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వారి న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు బాధితులకు అండగా ఉంటామన్నారు. ఈ నెల 24న చారకొండ నుంచి బైపాస్ బాధితులతో పాదయాత్రగా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సభ్యులు శ్రీనివాసులు, నాయకులు మల్లయ్య, మండల కార్యదర్శి బాలస్వామి, సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీను, బాధితులు పాల్గొన్నారు. -
పాల సేకరణ పెంచాలి
అచ్చంపేట: గ్రామీణ ప్రాంతాల రైతుల నుంచి నాణ్యమైన పాలు సేకరించి విజయ డైరీ అభివృద్ధికి కృషి చేయాలని డైరీ డెవలప్మెంట్ అధికారి కవిత అన్నారు. గురువారం అచ్చంపేట పాలశీతలీకరణ కేంద్రంలో పాల సేకరణ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాల సేకరణ తగ్గకుండా రైతులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ.. వారు ప్రైవేట్ సంస్థల వైపు మళ్లకుండా పాల సేకరణ చేయాలన్నారు. పాడి పశువులు ఆరోగ్యంగా ఉంటేనే అధిక పాలు ఇస్తాయని, ఇందుకోసం విజయ డైరీ ద్వారా సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు, దాణా, మినరల్ మిక్చర్, క్యాల్షియం సరఫరా చేసేందుకు కృషి చేస్తామన్నారు. అచ్చంపేటలో 63 సెంటర్ల ద్వారా ఇంతకు ముందు ప్రతిరోజు 10 వేల లీటర్ల పాల సేకరణ జరిగేదని, ప్రస్తుతం 7 వేల లీటర్ల పాలు మాత్రమే వస్తున్నాయని చెప్పారు. పాలలో ఫ్యాట్ 6, 7 శాతం వచ్చే లా నాణ్యమైన పాలు సేకరించాలని సూచించారు. అయితే ఫ్యాట్‌ను నిర్ధారించే పరికరాలు, పాలు కొలిచే యంత్రం, రైతుల జాబితా నమోదు చేసుకునే రిజిష్టర్లు ఇవ్వాలని, గేదె పాల ధరలు పెంచాలని, పాల సేకరణ ఏజెంట్లు సంబంధిత అధికారిని కోరారు. ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే అందజేసేందుకు కృషిచేస్తానన్నారు. సమావేశంలో విజయ డైరీ చైర్మన్ నర్సయ్యయాదవ్, మేనేజర్ రాములు తదితరులు పాల్గొన్నారు. మైనింగ్ ఆపాలని పోస్టుకార్డు ఉద్యమం బల్మూర్: మండలంలోని మైలారం గుట్టపై మైనింగ్ తవ్వకాలు నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డు ఉద్యమం చేపట్టినట్లు మైనింగ్ వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు గుండాల వెంకటెశ్వర్లు అన్నారు. గురువారం మండల కేంద్రంలో మైలారం గ్రామ మైనింగ్ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రికి పోస్టుకార్డులు పంపి నిరసన తెలిపారు. వెంటనే గుట్టపై జరుగుతున్న మైనింగ్ తవ్వకాల అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మైనింగ్ వ్యతిరేక కమిటీ సభ్యులు దేవస్వామి, రమేష్‌గౌడ్, లింగయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మేధో సంపత్తి హక్కులతో ప్రయోజనం మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మేధో సంపత్తి హక్కులతో పరిశోధనలు చేసే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో మేధో సంపత్తి హక్కులపై ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పూర్తి స్థాయి హక్కులు పొందిన తర్వాతనే వాటిని ప్రకటించాలని, అప్పుడు ప్రచురణలు, ప్రయోగాల కు పూర్తిస్థాయిలో విలువ ఉంటుందన్నారు. ఆవిష్కరణలకు పరిరక్షణ, హక్కులు కలిగి ఉండాలంటే తప్పకుండా మేధో సంపత్తి హ క్కులుండాలని, రీసెర్చ్ విద్యార్థులు అధ్యాపకులు వీటిపై పూర్తి స్థాయిలో అవగాహన కలి గి ఉండాలని సూచించారు. ఇప్పుడు చేసిన ప్రయోగాలు భవిష్యత్ అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. రిజిస్ట్రార్ చెన్నప్ప, వక్త శంకర్రావు, ఐక్యూఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, కంట్రోలర్ రాజ్‌కుమార్, మధు, అర్జున్‌కుమార్, కుమారస్వామి, శాంతిప్రియ, విజయలక్ష్మీ పాల్గొన్నారు. -
నేడు ‘పేట’కు సీఎం రేవంత్
నారాయణపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి తొలిసారిగా శుక్రవారం నారాయణపేట జిల్లాకేంద్రానికి రానున్నారు. ఈ సందర్భంగా రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్దేశంతో జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లను సిద్ధం చేసింది. ● సీఎం శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్లో నారాయణపేట మండలంలోని సింగారం చౌరస్తా సమీపంలోని గురుకుల పాఠశాల దగ్గర ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు వస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూ.1.23 కోట్లతో నిర్మించిన నూతన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు అప్పక్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌కు భూమి పూజ చేస్తారు. 1.35 గంటల నుంచి 2 గంటల వరకు రూ.130 కోట్లతో నారాయణపేట ప్రభుత్వ వైద్యకళాశాల, హాస్టల్ నిర్మాణానికి, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి, రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, రూ.40 కోట్లతో 100 పడకల యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు రూ.56 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల ఫస్టియర్ అకాడమిక్ బ్లాక్‌ల ప్రారంభించనున్నారు. వీటితో పాటు ధన్వాడ, నారాయణపేట రూరల్ పోలీస్స్టేషన్లు, వివిధ గ్రామాల్లో రూ.500కోట్లకుపైగా నిధులతో నిర్మించనున్న రోడ్లు, హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 2.10గంటలకు బహిరంగసభలో పాల్గొని, మాట్లాడుతారు. పర్యవేక్షించిన అధికారుల బృందం సీఎం పర్యటన నేపథ్యంలో గురువారం రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ క్రిస్టియానా, ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ హరీశ్, ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి కలెక్టర్ సిక్తా పట్నాయక్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సింగారం చౌరస్తాలోని హెలీప్యాడ్ స్థలాన్ని, సమీపంలోని నూతన పెట్రోల్ బంక్, వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని, అప్పక్‌పల్లి వద్ద సీఎం భూమి పూజ చేసే ఇందిరమ్మ ఇంటి స్థలాన్ని అధికారుల బృందం పరిశీలించింది. అనంతరం మెడికల్ కళాశాలలో ఏర్పాట్ల గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బహిరంగసభ వేదిక పక్కన గ్రీన్ రూమ్, వేదికపై సీటింగ్ కెపాసిటీ, వీఐపీ గ్యాలరీ తదితర వాటిపై చర్చించారు. అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణలు సైతం ఏర్పాట్లను పరిశీలించారు. ● సీఎం పర్యటనకు 1000 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ వెల్లడించారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి ఎస్పీలు, ఇద్దరు అదనపు ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 28 మంది సీఐలు, 81మంది ఎస్ఐలు, 133 మంది ఏఎస్ఐలు, 750 కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీఎం పర్యటన ముందస్తు బందోబస్తు ఏర్పాట్లను మల్టీజోన్–2 ఐజీపీ సత్యనారాయణ, జోగుళాంబ జోన్ –7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ పరిశీలించారు. రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
అసలేం జరిగిందంటే..
తెలకపల్లిలోని సర్వే నం.497లో ఎలాంటి అనుమతులు లేకుండా దుకాణ సముదాయ నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ స్థలం భూదాన్ భూమి అని, దీనికి అసలైన వారసులం తామేనని, ఇద్దరు వ్యక్తులు గత కొన్ని సంవత్సరాలుగా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. భూదాన్ భూమి తాము రిజిష్ట్రేషన్ చేసుకున్నట్లు కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మ్యూటేషన్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, తహసీల్దార్ కార్యాలయంలో ఎండార్స్మెంట్ కాపీ సైతం అందజేశారు. అయితే ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు మాత్రం అధికారులు తీసుకోవడం లేదు. అంతేకాకుండా సదరు వ్యక్తులతో రాజీ కుదుర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. నిర్మాణ సమయంలో ఒక్కో దుకాణానికి రూ.2 లక్షల వరకు అధికారులు, అప్పటి పాలకవర్గం వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గ్రామ పంచాయతీ నుంచి జిల్లా అధికారి వరకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడంతో 2024 ఆగస్టు 12న హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేయాలని కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో డీఎల్పీఓ వరలక్ష్మి విచారణ జరిపినా.. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
రేపటినుంచి స్పెషల్ డ్రైవ్ తనిఖీలు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం శనివారం నుంచి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా మైనర్లు వాహనాలు నడుపుతూ తనిఖీల్లో పట్టుబడితే కేసు నమోదు చేయడంతోపాటు తల్లిదండ్రులను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అలాగే నంబర్ ప్లేట్ లేని వాహనాలు రోడ్లపైకి తీసుకువస్తే సీజ్ చేస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని సూచించారు. నాసిరకం సరుకులతో మధ్యాహ్న భోజనం బిజినేపల్లి: మండలంలోని పాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమకు మధ్యాహ్నం అందించే భోజనం నాణ్యతగా లేదని, ప్రశ్నించిన తమను వంట ఏజెన్సీ మహిళలు దుర్భాషలాడుతున్నారని గురువారం ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు వంట కోసం నాసిరకం సరుకులు ఉపయోగిస్తున్నారని, దీంతో ప్రతిరోజు మధ్యాహ్నం సరిగా భోజనం తినలేకపోతున్నామని అధికారుల ఎదుట వాపోయారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన తహసీల్దార్ శ్రీరాములు, ఎంఈఓ రఘునందన్‌రావు నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని, ప్రస్తుతానికి వంట ఏజెన్సీని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై మహిళా సంఘాల సహకారంతో శుక్రవారం నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని, భోజన నాణ్యతపై ఉపాధ్యాయులు కూడా దృష్టిపెట్టాలని సూచించారు. విద్యార్థుల నుంచి ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వంట ఏజెన్సీ సిబ్బంది కూడా స్వచ్ఛందంగా తప్పుకుంటామని అధికారులతో చెప్పారు. దీంతో విద్యార్థులు తమ తరగతి గదులకు వెళ్లిపోయారు. కాగా నూతన ఏజెన్సీని తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. -
గంజాయి సాగు, సారా తయారీపై ఉక్కుపాదం
నాగర్‌కర్నూల్: జిల్లాలో గంజాయి సాగు, సారా తయారీ, సరఫరాపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్‌కర్నూల్‌ను సారా రహిత జిల్లాగా మార్చేందుకు ఎకై ్సజ్, పోలీస్ శాఖల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డిలతో కలిసి ఎకై ్సజ్, పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ దేశానికి యువత అత్యుత్తమమైన సంపద అని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పేదలు సారా తాగి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారన్నారు. యువకులు డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే సారాను రూపుమాపేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు, సారా తయారీ జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించొద్దని చెప్పారు. జిల్లాలో రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు సారా, గంజాయి వంటి మత్తు పదార్థాలపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నాయన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, తనిఖీల్లో నమోదు చేసిన కేసుల వివరాలను కలెక్టర్, ఎస్పీలు మంత్రికి వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, ఎకై ్సజ్, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థుల్లో దృష్టిలోపాన్ని నివారిద్దాం
నాగర్‌కర్నూల్ క్రైం: విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం, ఎక్కువగా టీవీ, మొబైల్ ఫోన్ చూడటం ద్వారా దృష్టి లోపాలు కలుగుతున్నాయని డీఎంహెచ్ఓ డా.స్వరాజ్యలక్ష్మి అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కంటివైద్య శిబిరాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా కంటి పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది రాష్ట్రీయ బాలస్వస్థ్య కార్యక్రమంలో భాగంగా రెండు విడతలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి.. 1,893 మందికి దృష్టిలోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. వీరిని మరోసారి నాగర్‌కర్నూల్, అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటివైద్య నిపుణులచే పరీక్షించి.. అవసరమైన కంటి అద్దాలను ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఏమైనా కంటి సమస్యలు ఉన్నట్టు ఉపాధ్యాయులు గమనిస్తే వెంటనే ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని కోరారు. విద్యార్థుల్లో అంధత్వాన్ని నివారించే ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం పీపీ యూనిట్లో గర్భిణులు, చిన్నారులకు ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్‌ను పర్యవేక్షించారు. టీకాలు ఇచ్చిన లబ్ధిదారుల వివరాలను యూ విన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని వైద్యసిబ్బందికి సూచించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ప్రియాంక, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.వెంకటదాస్, ప్రోగ్రాం అధికారి డా.రవికుమార్, డీపీఓ రేణయ్య, ఆర్బీఎస్కే వైద్యులు సురేష్, నవీద్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
కందనూలు: ఉస్మానియా విశ్వవిద్యాలయం మైదానంలో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభకనబరిచి పతకాలు సాధించారు. లాంగ్‌జంప్‌లో పి.అభిషేక్ గోల్డ్ మెడల్, 100 మీటర్ల పరుగు పందెంలో జి.భానుప్రియ సిల్వర్, డిస్కస్‌త్రోలో కె.శివప్రసాద్‌రెడ్డి గోల్డ్‌మెడల్, షార్ట్‌ఫుట్‌లో రేవతి బ్రాంజ్ మెడల్, వెయ్యి మీటర్ల పరుగుపందెంలో మధుప్రియ సిల్వర్ మెడల్ సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సోలపోగుల స్వాములు తెలిపారు. కేంద్ర బడ్జెట్‌ను సవరించాలి నాగర్‌కర్నూల్‌రూరల్: బడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్న కేంద్ర బడ్జెట్ గణాంకాలను సవరించాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు వార్ల వెంకటయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆయా పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తూ.. పేద ప్రజలపై భారాలు మోపడమేమిటని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించడంతో పాటు రైతుల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. మధ్యతరగతి ప్రజలకు కొంత ఊరటనిస్తూ.. పేదల నడ్డి విరిచిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను వీడకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్.శ్రీనివాస్, దేశ్యానాయక్, ఆంజనేయులు, శంకర్, హెచ్.ఆనంద్జీ, రవీందర్, కిషన్‌జీ, శివశంకర్, వెంకటయ్య పాల్గొన్నారు. విద్యుత్ ఆర్టిజన్స్‌ను కన్వర్షన్ చేయాలి నాగర్‌కర్నూల్‌రూరల్: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్స్‌ను కన్వర్షన్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించనున్న చలో విద్యుత్ సౌధ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బుధవారం జిల్లా కేంద్రంలో విడుదల చేశారు. కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు శ్రీను, భాస్కర్, సీఐటీయూ నాయకులు అశోక్, మధు, శంకర్, నవీన్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.7,029 కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ. 7,029, కనిష్టంగా రూ. 5,469, సరాసరి రూ. 6,269 ధరలు వచ్చాయి. మొత్తం 37మంది రైతులు 1,146 బస్తాల్లో 344 క్వింటాళ్ల వేరుశనగను అమ్మకానికి తీసుకువచ్చారు. -
‘అపార్’ నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టండి
నాగర్‌కర్నూల్: విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అపార్ నమోదు ప్రక్రియపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అదనపు కలెక్టర్ పి.అమరేందర్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం అపార్ నమోదుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అపార్ జనరేట్ ప్రక్రియ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు ఎంఈఓలు, ప్రిన్సిపాళ్లు, హెచ్ఎంలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అపార్ నమోదుకు సంబంధించి బర్త్ సర్టిఫికెట్ మంజూరుకు సంబంధించి నెలకొన్న సందేహాలపై డిజిటల్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఈఓ రమేష్ కుమార్, డీఐఈఓ వెంకటరమణ, డీటీడబ్ల్యూఓ ఫిరంగి, సెక్టోరియల్ అధికారులు నూరుద్దీన్, షర్ఫుద్దీన్, వెంకటయ్య, మురళీధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
సన్నద్ధం..
పునరావాసానికినల్లమల అడవి నుంచి చెంచుపెంటల తరలింపునకు కొనసాగుతున్న కసరత్తు ●సక్రమంగా ఇస్తేనే వెళతాం.. ఎన్నాళ్ల నుంచో అడవినే నమ్ముకుని ఉంటున్నాం. పులులు, వన్యప్రాణుల సంరక్షణకు మా ఊరిని ఖాళీ చేసి మరో చోటికి పంపిస్తాం అంటున్నారు. పునరావాసం కింద నష్టపరిహారాన్ని అందించి, అక్కడ సౌకర్యాలు కల్పించిన తర్వాతే వెళతాం. అందరికీ న్యాయమైన పరిహారాన్ని అందించి పునరావాస ప్రక్రియ చేపట్టాలి. – మండ్లి భౌరమ్మ, కుడిచింతల్‌బైల్, అమ్రాబాద్ మండలం మాకు జీవనోపాధి కల్పించాలి.. ఏళ్లుగా ఉన్న మా ఊరిని ఖాళీ చేయించి, మమ్మల్ని మరో చోటుకి తరలిస్తామని చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది, పరిహారం ఎప్పుడు అందుతుందన్న దానిపై ఎవరికీ స్పష్టత లేదు. పునరావాసం కల్పిస్తే అక్కడ జీవనోపాధి కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలి. – పోషప్ప, కుడిచింతల్‌బైల్, అమ్రాబాద్ మండలం సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న చెంచుపెంటల తరలింపునకు అవసరమైన చర్యలను అటవీశాఖ వేగవంతం చేసింది. ఇప్పటికే కోర్ ఏరియాలో ఉన్న సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, వటవర్లపల్లి గ్రామాలను ఖాళీ చేయించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ(ఎన్టీసీఏ) ద్వారా బాధితులకు పునరావాస ప్రత్యేక ప్యాకేజీని అందజేయనున్నారు. కేంద్రం నుంచి ఆమోదం లభించిన వెంటనే అధికారులు పునరావాస ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. మరో రెండు నెలల్లోనే పునరావాసానికి పూర్తిస్థాయి అనుమతులు లభిస్తాయని భావిస్తున్నారు. విడతల వారీగా చెంచుపెంటల తరలింపు.. నల్లమల అటవీప్రాంతంలో ఉన్న పులులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో ఉన్న చెంచుపెంటలను ఖాళీ చేయించి, అడవి బయట వారికి పునరావాసం కల్పించేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. ప్రధానంగా పెద్దపులుల సంరక్షణ, వాటికి స్వేచ్ఛగా సంచరించేందుకు వీలు కల్పించడం, వన్యప్రాణులకు, మనుషులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని నిరోధించడంలో భాగంగా పునరావాస ప్రక్రియను చేపడుతున్నట్టు అటవీశాఖ చెబుతోంది. ఇప్పటికే ఇందుకోసం ప్రక్రియను ప్రారంభించగా, తొలి విడతగా తరలించనున్న సార్లపల్లి, కుడిచింతల్ బైల్, వటవర్లపల్లి గ్రామాల్లో సర్వే నిర్వహించి, స్థానికుల నుంచి అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు. స్వచ్ఛందంగా తరలింపునకు ఒప్పుకున్న వారికే పునరావాస ప్యాకేజీని అమలు చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని బలవంతం చేయబోమని అటవీ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ స్థానిక చెంచుల్లో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి. తొలి విడతలో మూడు గ్రామాలు.. నల్లమల అటవీ ప్రాంతంలోని కోర్ ఏరియాలో ఉన్న సుమారు 20 వరకు చెంచుపెంటలను విడతల వారీగా ఖాళీ చేయించి మరో చోట పునరావాసం కల్పించాలని అటవీశాఖ భావిస్తోంది. వీటిలో మొదటి విడతగా సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, వటవర్లపల్లి గ్రామాలను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం క్షేత్రస్థాయి సర్వేతో పాటు కుటుంబాల నుంచి అంగీకార పత్రాలను సేకరిస్తోంది. సార్లపల్లిలో మొత్తం 269 కుటుంబాలు ఉండగా, వీరిలో 83 కుటుంబాలు మాత్రమే చెంచులు కాగా, మిగతా ఇతర వర్గాలకు చెందినవారు ఉన్నారు. వీరిలో ఇతర వర్గాలు మాత్రమే తరలింపునకు అంగీకారం చెబుతుండగా, మెజార్టీ చెంచులు ఒప్పుకోవడం లేదు. స్వచ్ఛందంగా తరలింపు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న ఆవాసాల్లో ఉంటున్న వారిని అడవి బయట పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తరలింపు ప్రక్రియ స్వచ్ఛందంగా అంగీకారం తెలిపిన వారికే చేపడతాం. పునరావాసం కింద రూ.15 లక్షల ఆర్థిక సహాయం, లేదా 2 హెక్టార్ల భూమి కేటాయింపు ఉంటుంది. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్ మొదటి విడతలో కుడిచింతలబైల్, సార్లపల్లి, వటవర్లపల్లి గ్రామాలు ఎన్టీసీఏ ద్వారా ప్రత్యేక పునరావాస ప్యాకేజీ పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఏర్పాట్లు -
ప్యాకేజీ కింద 5 ఎకరాలు, లేదంటే రూ.15 లక్షలు
అడవిని ఖాళీ చేసి మరో చోటుకు తరలుతున్న స్థానికులకు పునరావాసం కింద ఎన్టీసీఏ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ, లేదా 5 ఎకరాల భూమి కేటాయిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని బాధితులు ఎంచుకోవచ్చు. ఖాళీ చేయనున్న గ్రామస్తులకు పునరావాసం కల్పించేందుకు పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఇప్పటికే భూమిని గుర్తించారు. అక్కడే పునరావాస కాలనీలను ఏర్పాటు చేసి నిర్వాసితులకు ఇళ్లు, పాఠశాల, రోడ్లు, ఇతర మౌలిక వసతులను కల్పించనున్నారు. -
ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో ముందుకు సాగాలి
తాడూరు: ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం తాడూరు మండలం ఐతోలులో కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షకుడు, సర్వమానవాళి దిక్సూచి ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు యువత పాటుపడాలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడు ముందుండాలని పిలుపునిచ్చారు. ● ఐతోలు గ్రామవాసి, కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. యువతతోనే గ్రామాల అభివృద్ధి ముడిపడి ఉందని, రాజకీయాలకు అతీతంగా యువత ముందుకు సాగాలని కోరారు. పండుగ వాతవారణంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఆయన ఆశయ సాధనకు యువత సమష్టిగా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ రమేష్ కుమార్, డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్, సీఐ కనకయ్య గౌడ్, ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ రాంచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ ఇందుమతి నర్సింహారెడ్డి, కృష్ణారెడ్డి, హుస్సేన్, భూపతిరెడ్డి, లక్ష్మయ్య, రమేష్‌గౌడ్, అఖిల్‌రెడ్డి, హేమంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి యువతతోనే అభివృద్ధి సాధ్యం సినీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ -
ప్రజలను అప్రమత్తం చేయడానికే కార్డన్ సెర్చ్
లింగాల: ప్రజలు నేరగాళ్ల బారిన పడకండా అప్రమత్తం చేసేందుకు, చట్టాలపై అవగాహన కల్పించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ రామేశ్వర్రావు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం అదనపు ఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని తనిఖీ చేసి వివరాలను తెలుసుకున్నారు. ధ్రువపత్రాలు, నంబర్ ప్లేటు లేని 40 ద్విచక్ర వాహనాలు, రెండు జీపులు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి.. సన్మార్గంలో పయనించాలని కోరారు. మహిళలు, బాలికలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. కాగా, గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పలువురు తమ వాహనాలను పంట పొలాలు, రహాస్య ప్రదేశాలకు తరలించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, ఎస్ఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
నిర్వహణకు నిధులేవి?
మూడేళ్లుగా రైతువేదికలకు అందని నిధులు ●నిధుల విడుదల నిలిచిపోయింది.. జిల్లాలో రైతువేదికల నిర్వహణకు సంబంధించి మూడేళ్లుగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. దీంతో వాటి నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్న విషయం వాస్తవమే. విద్యుత్ బిల్లుల చెల్లింపు, పారిశు ద్ధ్య నిర్వహణ కష్టతరంగా ఉంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ● తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణకు ఏఈఓల పాట్లు ● మరమ్మతులు సైతం చేపట్టని వైనం ● జిల్లాలో 142 రైతువేదికలుఅచ్చంపేట: వ్యవసాయశాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతువేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. రైతువేదికల నిర్వహణపై ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయింది. ఏళ్ల తరబడి నిర్వహణ నిధులను మంజూరు చేయకపోవడంతో రైతువేదికల లక్ష్యం ఆశించిన మేర ముందుకు సాగడంలేదు. రూ.లక్షల బకాయిలు పేరుకపోవడంతో వీటి నిర్వహణ ఏఈఓలకు భారంగా మారింది. మూడేళ్లుగా సొంత ఖర్చులతో నిర్వహణ వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో సేవలు అందేలా.. రైతువేదికల్లో ప్రతి మంగళవారం రైతునేస్తంతో పాటు రైతు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హాజరయ్యే రైతులు, ఇతరులకు టీ, బిస్కెట్లు అందజేయడంతో పాటు ఇతరత్రా వాటి కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు తాగునీరు, విద్యుత్ సౌకర్యం, స్టేషనరీ, పారిశుద్ధ్య నిర్వహణ ఖర్చుల కింద ప్రభుత్వం నెలకు రూ. 9వేలు అందజేస్తామని ప్రకటించింది. ఒక్కో కేంద్రానికి మినీ భూసార పరీక్ష ల్యాబ్ కిట్లను అందజేసి.. వీటి ద్వారా వేదికల్లో భూసార పరీక్షలు చేయాల్సి ఉన్నా నిధుల విడుదల లేకపోవడంతో ఈ ప్రక్రియ కూడా అటకెక్కింది. మూడేళ్లుగా నిలిచిన నిధులు.. జిల్లాలోని 142 కస్టర్లలో 142 రైతువేదికలు ఉన్నాయి. అందులో 2021 డిసెంబర్ నుంచి 2022 ఏప్రిల్ వరకు ఐదు నెలలపాటు ప్రతినెలా రూ. 9వేల చొప్పున గతంలో ప్రభుత్వం నిర్వహణ నిధులు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. 2022 మే నుంచి ఇప్పటి వరకు మూడేళ్లుగా ప్రభుత్వం రైతువేదికల నిర్వహణ కోసం నిధులను విడుదల చేయకపోవడంతో వ్యవసాయ విస్తరణ అధికారులు అవస్థలు పడుతున్నారు. ఒక్కో రైతువేదికకు ప్రతినెలా రూ. 9వేల చొప్పున 36 నెలలకు గాను సుమారు రూ. 3.24లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఏఈఓలపైనే భారం.. రైతువేదికల నిర్వహణకు ప్రభుత్వం దీర్ఘకాలికంగా నిధులు మంజూరు చేయకపోవడంతో ఏఈఓలపై భారం పడుతోంది. కనీసం పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ, కరెంటు బిల్లుల చెల్లింపు, రైతులతో సమావేశాలు, రైతునేస్తం కార్యక్రమాల నిర్వహణ ఖర్చులను తామే భరించాల్సి వస్తోందని ఎంఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల విద్యుత్ బిల్లుల చెల్లింపులు సైతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. రైతువేదికల్లో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు, వివిధ శాఖల సమావేశాల నిర్వహణ సైతం జరుగుతున్నాయి. ఈ క్రమంలో అటెండర్ నుంచి అన్ని పనులు ఏఈఓలే చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వర్షాలు, వరదలు, కోతుల బెడద కారణంగా జిల్లాలోని పలు రైతువేదికల్లో మరమ్మతు పనులు చేయాల్సి ఉండగా.. నిధులు లేక అవి అలానే ఉండిపోతున్నాయి. రైతువేదికల నిర్వహణ కోసం ప్రతినెలా నిధులు మంజూరు చేస్తే ఇబ్బందులు ఉండవని ఏఈఓలు పేర్కొంటున్నారు. క్లస్టర్లు 142 రైతువేదికలు 142 అగ్రికల్చర్ డివిజన్లు : 4 (అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్) ఏఈఓలు 143 మంది పంటసాగు : 7.38 లక్షల ఎకరాలు రైతులు : 3,30,836 మంది వీడియో కాన్ఫరెన్స్ ఎలా? వ్యవసాయంలో ఆధునిక సాగు పద్ధతులపై శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులచే రైతులకు అవగాహన కల్పించేందుకు వీలుగా రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించారు. తొలుత ప్రయోగాత్మకంగా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక వేదికను ఎంపిక చేశారు. ప్రస్తుతం 125 కుర్చీలు, రెండు టేబుళ్లు, 8 పెద్ద టేబుళ్లు, ఒక మైక్‌సెట్ చొప్పున ఉండగా.. రూ. 3.70లక్షలతో టెలివిజన్, సెట్‌టాప్ బాక్సులు, ఇన్వర్టర్లు ఇతర సామగ్రిని సమకుర్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాస్థాయి వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు రైతులతో నేరుగా మాట్లాడి పంటల సాగు విధానం, చీడపీడల నివారణ, ప్రభుత్వ పథకాలు తదితర వాటిపై అవసరమైన సలహాలు ఇచ్చేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. రైతు వేదికల నిర్వహణకు నిధులు విడుదల చేయకపోతే ఎలా అని ఏఈఓలు ప్రశ్నిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే సమయానికి రైతువేదికలను సిద్ధం చేయాలని.. అయితే అటెండర్ కూడా లేకపోవడంతో అన్ని పనులు తామే చేయాల్సి వస్తుందని అంటున్నారు. పైగా ప్రతినెలా తమ వేతనం నుంచే నిర్వహణ ఖర్చులు భరించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. -
ఆశలు ఆవిరి
అచ్చంపేట: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్న తరుణంలో మరోసారి కులగణన చేపట్టడంతోపాటు బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఇక ఇప్పట్లో ఎన్నికలు జరగవని తేలిపోయింది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు సుమారు మూడు నెలలకుపైగా సమయం పట్టే అవకాశం ఉండటంతో ఎన్నికల వేడి తగ్గిపోయింది. ఫలితంగా ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సంకేతాలు ఇవ్వడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. దీంతో చాలామంది ఆశావహులు పోటీ చేసేందుకు ముందుకొచ్చి ఆర్థిక వనరులు సమకూర్చకుంటున్నారు. మూడు తగ్గి.. ఐదు పెరిగి పరిషత్ ఎన్నికలు ముందుగా నిర్వహించి.. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా జిలా యంత్రాంగం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎంపీటీసీ స్థానాలు, ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రదర్శన, బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ఎన్నికల సామగ్రి సమకూర్చుకోవడంతో పాటు విధుల్లో పాల్గొనే పీఓ, ఏపీఓ, సిబ్బందికి శిక్షణ తదితర వాటిని పూర్తి చేసింది. గత ఎన్నికల్లో 212 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. అచ్చంపేట మున్సిపాలిటీ నుంచి విలీనం రద్దయిన అచ్చంపేట మండలం పలకపల్లి, పులిజాల, నడింపల్లి, లక్ష్మాపూర్, కొల్లాపూర్ మండలంలో ఒక ఎంపీటీసీ స్థానాలను గుర్తించగా.. అదే సమయంలో కోడేరు మండలంలోని ముత్తిరెడ్డిపల్లి, మాచిపల్లి, సింగాయపల్లి ఎంపీటీసీ స్థానాలు వనపర్తి జిల్లా ఏదుల మండలంలో కలవడంతో మూడు ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. దీంతో జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు సంఖ్య 214కి చేరుకోగా.. వీటి పరిధిలో 1,187 పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ● అచ్చంపేట మున్సిపాలిటీ నుంచి విడిపోయిన బల్మూర్ మండలం పొలిశెట్టిపల్లిని ఎంపీటీసీ స్థానంగా ఏర్పాటు చేస్తూ తోడేళ్లగడ్డ, రాంనగర్, పోలిశెట్టిపల్లితండాలను కలిపారు. గత ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానంగా ఉన్న చెన్నారం(పీజీ), మహదేవ్పూర్ గ్రామాలను తిరిగి రామాజిపల్లి ఎంపీటీసీ స్థానంలో కలిపారు. ప్రత్యేకాధికారుల పాలన.. గతేడాది ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఆగస్టులో జిల్లా, మండల పరిషత్‌ల పదవీకాలం పూర్తవడంతో అవన్నీ ప్రత్యేకాధికారుల పాలన కిందకు వెళ్లాయి. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 26న మున్సిపాలిటీలు గడువు సైతం ముగియడంతో ప్రభుత్వం వీటికి కూడా ప్రత్యేకాధికారులను నియమించింది. ఫిబ్రవరి 16న పీఏసీఎస్, డీసీసీబీ పదవీకాలం ముగియగా.. ఆరు నెలల పాటు ప్రభుత్వం పదవీకాలం గడువు పొడిగించింది. ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. స్థానిక పోరుకు అంతా సిద్ధమవడంతో కొద్దిరోజుల క్రితం జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పంచాయతీల్లో తాము మద్దతు ఇచ్చిన వారిని గెలిపించుకోవడం, పార్టీ గుర్తులతో నిర్వహించే పరిషత్ ఎన్నికల్లో బల నిరూపణకు అన్ని పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జిల్లాలో 464 గ్రామ పంచాయతీలు, 20 జెడ్పీటీసీ, 214 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈనెలాఖరు వరకు బీసీ కులగణన పూర్తి చేసి దాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించి.. పార్లమెంట్‌కు పంపించనున్నారు. మొత్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించనుండటంతో ఆశావహుల్లో నైరాశ్యం అలుముకుంది. ఇప్పట్లో ‘స్థానిక’ పోరు లేనట్టే.. పరిషత్, పంచాయతీ ఎన్నికలుమరింత జాప్యం కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం వాయిదా ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై సందిగ్ధం వనరులు సమకూర్చుకున్న ఆశావహుల్లో నైరాశ్యం -
ఏసీబీకి చిక్కిన మక్తల్ సీఐ
మక్తల్: ఓ కేసు విషయంలో వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటున్న సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రానికి చెందిన సందె వెంకట్రాములు మక్తల్‌లో శ్రీనిధి అనే సొసైటీని ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి ప్రతినెలా కిస్తుల ప్రకారం డబ్బులు కట్టిస్తున్నారు. అయితే సొసైటీలో కొందరు వ్యక్తులతో బేధాభిప్రాయాలు రావడంతో మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సందె వెంకట్రాములుపై కేసు నమోదు చేశారు. అయితే సందె వెంకట్రాములు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా.. ప్రతి సోమవారం మక్తల్ పోలీస్‌స్టేషన్‌కు రావాలని షరతులతో కూడిన ముందస్తు బెయిల్ వచ్చింది. ఆఫీసు, ఇళ్లలో సోదాలు.. కేసుకు సంబంధించిన చార్జీషీటు కోర్టులో దాఖలు చేయాల్సిన విషయంలో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు గాను మక్తల్ సీఐ జి.చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నర్సింహ, శివారెడ్డి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో సందె వెంకట్రాములు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ముందస్తుగా ప్రణాళిక ప్రకారం మంగళవారం మక్తల్ పోలీస్ కార్యాలయంలో నిందితుడి నుంచి కానిస్టేబుల్ నర్సింహ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందులో ప్రమేయం ఉన్న మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్ శివారెడ్డిని సైతం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐ కార్యాలయం, కానిస్టేబుళ్ల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నర్సింహ, శివారెడ్డిలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. దాడుల్లో ఏసీబీ అధికారులు లింగస్వామి, జిలాని సయ్యద్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సైతం ఓ కేసు విషయంలో రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు -
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలే కీలకం
చారకొండ: ఒక సీసీ కెమెరా వంద మందితో సమానం అని, నేరాలు నియంత్రించడం, ఛేదించడంలో అవి కీలకపాత్ర పోషిస్తాయని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అన్నారు. మంగళవారం స్థానిక ఎస్ఐ శంషొద్దీన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వ్యాపారులు, నాయకులు, గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై రూ.3.50 లక్షల వ్యయంతో 32 కెమెరాల ఏర్పాటు చేసిన స్క్రీన్‌ను రిబ్బన్‌తో కట్ చేసి ప్రారంభించారు. అంతకు ముందే ఎస్పీకి కల్వకుర్తి డివిజన్లోని ఇద్దరు సీఐలు, ఎస్ఐలు పూలబొకేతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీమన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలోనూ సీసీల ఏర్పాటు చేయాలని, తద్వార నేరాలకు తావు ఉండదన్నారు. ప్రమాదాలు, నేరాలు, చోరీలు అరికట్టవచ్చని సూచించారు. అదేవిధంగా ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, యువత డ్రగ్స్‌కు బానిసగా మారుతున్నారని అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ వాటి నిర్మూలన కోసం పోలీసులకు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, కల్వకుర్తి, వెల్దండ సీఐలు నాగార్జున, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్ఐలు శంషొద్దీన్, కురుమూర్తి, మాధవరెడ్డి, కృష్ణదేవ, నాయకులు వెంకట్‌గౌడ్, బాల్‌రాంగౌడ్, వెంకటయ్యగౌడ్, లక్ష్మణ్, వ్యాపారులు శ్యాం, శ్రీను, సత్యం తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి పరిశీలన మండలలోని తిమ్మాయిపల్లి, సారంబండ మధ్యలో కల్వకుర్తి– దేవరకొండ ప్రధాన జాతీయ రహదారి ప్రమాదకరంగా ఉండటంతో ఎస్పీ పరిశీలించారు. రోడ్డు మూల మలుపులు ఎక్కువగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని డీఎస్పీకి సూచించారు. -
వైభవంగా ఈదమ్మ షిడే ఉత్సవం
కొల్లాపూర్: పట్టణంలోని ఈదమ్మ జాతర షిడే మహోత్సవం మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. షిడే ఉత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తులు ఈదమ్మ దేవతకు బోనాలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నూతనంగా ప్రతిష్టించిన ఈదమ్మ దేవత విగ్రహాన్ని దర్శించుకున్నారు. సంప్రదాయబద్ధంగా షిడే మానుకు సాయంత్రం రైతు సంఘం నాయకులు పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారి వంశీకులు రాముడు షిడే మాను పైకి ఎక్కి భక్తులకు ఆశీర్వాదాలు అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. -
హోటళ్లలో తనిఖీలు
పాలమూరు: జిల్లా కేంద్రంలో ఫుడ్‌సేఫ్టీ కంట్రోల్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మంగళవారం నగరంలోని న్యూటౌన్‌లో ఉన్న పలు హోటళ్లను తనిఖీ చేశారు. ఓ టీ పాయింట్లో చాయపత్తి, బిస్కెట్ల శాంపిల్స్, ఓ హోటల్లో వెజిటబుల్ బిర్యానీ నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. ఓ మార్ట్‌కు సంబంధించి పలు రకాల తినుబండారాల నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపారు. అలాగే పరిశుభ్రంగా లేని హోటళ్లకు నోటీసులు అంటించారు. తనిఖీల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్‌కుమార్, శిక్షణ ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, కరుణాకర్ పాల్గొన్నారు. బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత పాన్‌గల్: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి సంధ్యారాణి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జీసీఈసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. వారిని చులకనగా చూడకుండా బాలురతో సమానంగా చదివించాలని సూచించారు. జీసీఈసీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను వినియోగించుకొని సమస్యలను కాగితంపై రాసి బాక్సులో వేయాలన్నారు. అమ్మాయిలు అబ్బాయిల కంటే ఏ రంగంలో తక్కువ కాదని.. నిర్దేశించుకున్న లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు. -
కూలీలు, సాగుదారులు
87.6%కూలీలు సాగుదారులు92.2%88.2%86.9%33.9 %81.1%27.3 %25.9 %22.3 %20.8 %జో.గద్వాలనారాయణపేటవనపర్తినాగర్కర్నూల్మహబూబ్నగర్ -
అచ్చంపేట మున్సిపల్ భవనం పరిశీలన
అచ్చంపేట: పట్టణంలో మున్సిపల్ నూతన భవనాన్ని మంగళవారం మున్సిపల్ ప్రజా ఆరోగ్య శాఖ ఎస్ఈ, ఈఈ, డీఈలు పరిశీలించారు. రూ.3 కోట్లతో నిర్మిస్తున్న ఈ భవనం దాదాపు పూర్తికావొచ్చింది. ఏప్రిల్‌లో భవనం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ సూచించడంతో పనులు చురుకుగా సాగుతున్నాయి. అదేవిధంగా రూ.10 కోట్లతో చేపట్టనున్న రాజీవ్ ఎన్టీఆర్ మినీ స్టేడియం, రూ.2 కోట్లతో చేపట్టనున్న ఇండోర్ స్టేడియాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈ విజయ్‌భాస్కర్‌రెడ్డి, డీఈ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, కమిషనర్ యాదయ్య, ఏఈలు షబ్బీర్, రాజానాయక్, కాంట్రాక్టర్ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేరుశనగకు గిట్టుబాటు ధర కల్పించాలి ఉప్పునుంతల: రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ ద్వారా మండలంలో రైతులకు ఇచ్చిన విత్తన వేరుశనగ ద్వారా వచ్చిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని మంగళవారం స్థానిక గోడౌన్ వద్దకు వచ్చిన ప్రొడక్షన్ మేనేజర్ సంధ్యారాణి, ఏఏఓ ఝాన్సీలను రైతులు కలిసి వారి ద్వారా రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం యాసంగి సీజన్లో సాగుచేసిన వేరుశనగ పంటకు వైరస్ తెగుళ్లు సోకి పంట దిగుబడి పూర్తిగా తగ్టిపోయిందని వారు పేర్కొన్నారు. దీంతోపాటు సంస్థ ద్వారా అందించిన టీసీజీఎస్ 1694 రకం వేరుశనగ విత్తనంలో 15 శాతం కల్తీ విత్తనాలు రావడంతో పంట నష్టపోవాల్సి వచ్చిందన్నారు. దీంతోపాటు బైబ్యాక్ తీసుకునే వేరుశనగ పంటకు సంబంధించిన డబ్బులను మూడు విడతల్లో కాకుండా నెల వ్యవధిలోనే రెండు విడతలలో చెల్లించాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు, రైతు అనంతరెడ్డి, రైతులు జంగయ్య, వెంకటయ్య, వెంకటేష్, సైదులు తదితరులున్నారు. కార్యకర్తల బాగు కోసం పనిచేస్తా : ఎమ్మెల్యే నాగర్‌కర్నూల్: తాను ఎమ్మల్యేగా గెలుపొందేందుకు కృషి చేసిన కార్యకర్తల బాగు కోసం ఎల్లవేళలా పనిచేస్తానని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బిజినేపల్లి మండల కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేశారని అన్నారు. గత ప్రభుత్వంలో మన నాయకులు, కార్యకర్తలను ఎన్నో రకాలుగా ప్రలోభాలకు, ఇబ్బందులకు గురిచేసినా.. కేసులు పెట్టినా ధైర్యంగా ముందుండి పార్టీని, తనను నడిపించారన్నారు. నన్ను గెలిపించిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఆపదలో అండగా ఉంటానని, వారి కుటుంబ బాగోగుల కోసం ఎల్లవేళలా పనిచేస్తానన్నారు. మన ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేస్తుందని, ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలని కోరారు. అలాగే రైతు రుణమాఫీలో భాగంగా ఒక్క బిజినేపల్లి మండలానికే రూ.60 కోట్లు వెచ్చించారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి
మన్ననూర్: పరీక్షల సమయంలో విద్యార్థులు సోషల్ మీడియా, టీవీలు, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్లోని పీటీజీ పాఠశాల/ కళాశాలను కలెక్టర్ సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాల నిర్వహణ, మెనూ పాటిస్తున్న విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కామన్ ఫుడ్ మెనూను అనుసరిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించాలని సూచించారు. ముఖ్యంగా రానున్న వార్షిక పరీక్షల్లో పదో తరగతి విద్యార్థులు 10/ 10 గ్రేడ్ సాధించేలా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి రాత్రి భోజనం చేసిన ఆయన స్టడీ అవర్స్ పరిశీలించిన అనంతరం డార్మెంటరీలో విద్యార్థులతో కలిసి బస చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్, వైస్ ప్రిన్సిపాల్ పద్మావతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
అచ్చంపేట రూరల్: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. మండలంలోని నడింపల్లిలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా యువత పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే వర్క్‌ఫ్రం హోం అంటూ కొందరు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. యువత తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, సీవీవీ నంబర్లు, పాస్వర్డ్స్ ఎవరికీ తెలియజేయరాదన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంతో మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయని.. కుటుంబాలు రోడ్డున పడతాయని హెచ్చరించారు. అనంతరం నడింపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రణాళికాబద్ధంగా చదివి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం జాఫర్, శ్రీనివాస్, విజయలక్ష్మి, సాజీద్, ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి నిరంజన్ పాల్గొన్నారు. -
భక్తిభావంతో మెలగాలి
కల్వకుర్తిరూరల్: ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మెలగాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని మార్చాల హనుమాన్ దేవాలయంలో సీతారాముల విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావం అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని కోరారు. అనంతరం గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, విజయ్‌కుమార్‌రెడ్డి, ఆనంద్‌కుమార్, శ్రీధర్‌రెడ్డి, జలాల్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం కందనూలు: ఇంటర్ ప్రాక్టికల్స్‌కు గైర్హాజరైన విద్యార్థులకు మరో అవకాశం కల్పించినట్లు డీఐఈఓ వెంకటరమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు ప్రాక్టికల్స్‌కు హాజరుకాని విద్యార్థులకు ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రతి విద్యార్థి ప్రాక్టికల్స్‌కు హాజరు కావాలన్నారు. విద్యార్థులకు సమాచారం అందించే బాధ్యత ప్రిన్సిపాళ్లదేనని.. ఎవరైనా సమాచారం ఇవ్వలేదని ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నేషనల్ హైవే అలైన్మెంట్లో స్వల్ప మార్పులు
కొల్లాపూర్: నేషనల్ హైవే 167కే నిర్మాణ పనులకు అవసరమైన భూసేకరణ కోసం అధికారులు కొల్లాపూర్ సమీపంలో మార్కింగ్ చేశారు. సోమశిల రోడ్డు నుంచి మల్లేశ్వరం సమీపంలో నిర్మించబోయే ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి వరకు రహదారి పనులను మూడో విడత ప్యాకేజీలో చేపట్టనున్నారు. గతంలో హైవే కోసం మార్కింగ్ చేసిన స్థలాల్లో స్వల్ప మార్పులు చేశారు. రహదారి మలుపులు ఉన్న ప్రాంతాల్లో 10 నుంచి 15 ఫీట్ల మేరకు మార్కింగ్ ఇచ్చారు. కొల్లాపూర్ నుంచి సోమశిలకు వెళ్లే దారిలో కుడివైపునకు గతంలో వేసిన మార్కింగ్ కంటే కొంతమేరకు అధికంగా స్థల సేకరణ చేపట్టనున్నారు. త్వరలోనే భూసేకరణ ప్రక్రియకు సంబంధిత అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పనులకు వచ్చే నెలలో టెండర్లు నిర్వహించనున్నారు. -
బైపాస్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం
చారకొండ: ఎన్‌హెచ్–167కే బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్.శ్రీనివాసులు అన్నారు. మండల కేంద్రంలో బైపాస్ బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారం ఏడో రోజుకు చేరింది. వారికి సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు ప్రకటించారు. అనంతరం బాధితులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బైపాస్ నిర్మాణంలో పేదలు నివాసగృహాలను కోల్పోయి 15 రోజులు కావొస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బైపాస్ బాధితులకు నూతన ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, రూ. 50లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ నాయకులు బాలస్వామి, శ్రీనివాసులు, ఆంజనేయులు, మల్లయ్య, వివిధ సంఘాల నాయకులు గోపాల్, ప్రేంకుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం
నాగర్‌కర్నూల్: కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని.. వారే తనకు ఆత్మీయులని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో తాడూరు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తల కృషితోనే తాను ఎమ్మెల్యేగా గెలుపొందానని అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేశారన్నారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగినట్లు వివరించారు. అలాంటి కార్యకర్తల సంక్షేమం కోసం ఎల్లవేళలా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనను సంప్రదించాలని సూచించారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అర్హులందరికీ అందేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, జిల్లా ఆర్టీఏ మెంబర్ గోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
జెన్కో అతిథిగృహం వద్ద మంటలు
దోమలపెంట: ఈగలపెంట నుంచి శ్రీశైలం ఆనకట్టకు వెళ్లే రహదారిలో ఆదివారం రాత్రి మంటలు చెలరేగాయి. జెన్కో అతిథిగృహం, కృష్ణవేణి భవనం చుట్టూ మంటలు వ్యాపించడాన్ని గుర్తించిన ఓఅండ్ఎం స్టోర్స్ సిబ్బంది.. పోలీసులతో పాటు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం ఫైర్‌స్టేషన్ ఆఫీసర్ మల్లికార్జున్‌కు సమాచారం అందించారు. ఫైరింజన్‌తో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇందుకోసం దాదాపు 4 గంటలపాటు శ్రమించారు. మరోవైపు ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ శ్రావణ్, కానిస్టేబుల్ దర్శన్ తదితరులు శ్రీశైలం రహదారిపై ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ అగ్నిప్రమాదం బారిన పడకుండా చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు బీడీ లేదా సిగరేట్ కాల్చి వేయడంతో మంటలు వ్యాపించాయని భావిస్తున్నట్లు ఎస్ఐ అనూప్ తెలిపారు. ఈగలపెంట సమీపంలో వ్యాపించిన మంటలు -
కార్చిచ్చు ముప్పు..
అగ్నిప్రమాదాల నివారణకు అటవీశాఖ ముందస్తు చర్యలు వివరాలు 8లో u●నిరంతర గస్తీ.. అటవీ పరిరక్షణకు గస్తీ ముమ్మరం చేశాం. క్షేత్రస్థాయిలో అటవీశాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాం. ఆకతాయిలు, పశువుల కాపరులు, ఇతరులు అడవుల్లోకి అగ్గిపెట్టెలు తీసుకుపోకుండా అవగాహన కల్పిస్తున్నాం. రోడ్డు వెంట వెళ్లే వారు నిప్పు వేసినా అడవి కాలకుండా ఇరువైపులా 20 – 30 మీటర్ల వరకు గడ్డి, ఆకులను ముందుగానే కాల్చివేస్తున్నాం. – గురుప్రసాద్, ఎఫ్ఆర్ఓ, దోమలపెంట అచ్చంపేట: వేసవి నేపథ్యంలో నల్లమలలోని వన్యప్రాణులతోపాటు విలువైన అటవీ సంపదకు కార్చిచ్చు ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అడవుల్లో చెట్ల ఆకులు రాలే సీజన్. చెట్ల నుంచి కింద పడిన ఆకులు ఎండిపోవడంతోపాటు కుప్పలుగా కనిపిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో వాటిపై నిప్పు పడితే కార్చిచ్చు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. తద్వారా అటవీ సంపదతోపాటు వన్యప్రాణులకూ ముప్పు వాటిల్లుతోంది. అయితే జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ విపత్తును నివారించవచ్చని భావిస్తున్న అటవీశాఖ అధికారులు.. జిల్లాలోని అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. అడవి బుగ్గిపాలు కాకుండా కాపాడుకునేందుకు ముందస్తుగా హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారికి ఇరువైపులా వీవ్లెన్స్, ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం అటవీశాఖ సిబ్బందితో అడవిలో ఎండిన ఆకులను వరుసగా పేర్చి కాల్చివేస్తున్నారు. ఒకవేళ అగ్గి రాజుకున్నా శరవేగంగా విస్తరించకుండా ఈ ఫైర్ లైన్స్‌తో అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. నల్లటి రంగుతో సరిహద్దు వేసవిలో చెట్ల ఆకులు రాలడం వల్ల చిన్నపాటి నిప్పురవ్వ పడినా అడవి దావనంలా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది నేలపై రాలిన చెట్ల ఆకులను ఒకచోట పోగు చేసి.. కిలోమీటర్ పొడవునా కాల్చుతున్నారు. తద్వారా నిప్పు అంటుకున్నా మంటలు విస్తరించవు. మరోవైపు నల్లటి రంగుతో సరిహద్దు గీత ఏర్పడి వన్యప్రాణులు సైతం అడవి దాటి బయటకు వెళ్లకుండా ఫైర్‌లైన్స్ ఉపయోగపడతాయి. విలువైన చెట్లు.. ఔషధ మొక్కలు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వుగా నల్లమల అమ్రాబాద్ అభయారణ్యం గుర్తింపు పొందింది. ఇక్కడ ఔషధ మొక్కలతోపాటు టేకు, నల్లమద్ది, వేప, చేదు వేప, ఇప్ప తదితర చెట్లు అధికంగా ఉన్నాయి. వేసవి ప్రారంభంలోనే ఆకులు రాలి ఎండిపోయాయి. వాహనాల్లో వెళ్తున్న వారు సిగరెట్, బీడీలు తాగి.. పూర్తిగా ఆర్పకుండానే రోడ్డు పక్కనున్న అడవుల్లోకి విసురుతుంటారు. మరోవైపు పశువుల కాపరులు, అడవుల్లోకి ప్రవేశించే ఇతర వ్యక్తులు సైతం చుట్ట, బీడీ, సిగరెట్లు కాల్చిన అగ్గిపుల్లలను నిర్లక్ష్యంగా పడేస్తుంటారు. తద్వారా మంటలు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. శాటిలైట్ సహాయంతో.. నల్లమల అటవీ ప్రాంతంలో అగ్గి అంటుకున్న వెంటనే ఆర్పేందుకు వీలుగా అటవీశాఖ అధికారులు తక్షణ స్పందన (క్విక్ రెస్పాన్స్) బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. రేయింభవళ్లు ఎక్కడ అగ్గి రాజుకున్నా శాటిలైట్ సహాయంతో ప్రమాదాన్ని గుర్తించి.. మంటలను ఆర్పివేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మరోవైపు అటవీ సమీప గ్రామాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్విక్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు వీవ్లైన్స్, ఫైర్లైన్స్తో మంటల అదుపు అటవీ సమీప గ్రామాల్లో అవగాహన సదస్సులు నల్లమలలో విలువైన ఔషధ మొక్కలు, వన్యప్రాణులు కఠిన చర్యలు.. ఎవరైనా అడవిలో నిప్పు పెట్టినట్లు తేలితే అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. అడవులు అగ్నిప్రమాదాల బారిన పడకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాం. వీవ్లైన్స్, ఫైర్‌లైన్స్ ఏర్పాటుతో ఒకచోట నుంచి మరో చోటకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నాం. – రోహిత్‌రెడ్డి, డీఎఫ్ఓ -
నూనె గింజల సాగుతో లాభాలు
బిజినేపల్లి: సీఎఫ్ఎల్డీ పథకం ద్వారా నూనె గింజల సాగును ప్రోత్సహిస్తున్నట్లు పాలెం కేవీకే సమన్వయకర్త డా.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం పాలెం కేవీకే ఆధ్వర్యంలో మండలంలోని వసంతాపూర్ గ్రామ రైతులకు నూనె గింజల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహిరంగ మార్కెట్లో నూనె గింజలకు మంచి డిమాండ్ ఉందన్నారు. నూనె గింజల పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. సీఎఫ్ఎల్డీ పథకం కింద వసంతాపూర్ గ్రామంలో 125 ఎకరాల మేర నువ్వుల పంటను సామూహిక ప్రదర్శన క్షేత్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం రైతులకు పంట కీలక ఉత్పాదకాలు, వినియోగం, మేలైన యాజమాన్య పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు బి.రాజశేఖర్, ఆదిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
భౌరాపూర్ జాతరకు అన్ని ఏర్పాట్లు
లింగాల: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని లింగాల మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని భౌరాపూర్ క్షేత్రంలో నిర్వహించే చెంచుల జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం భౌరాపూర్ క్షేత్రంలో జాతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు, చెంచు నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 26న భ్రమరాంబిక మల్లికార్జునస్వామి కల్యాణం, రథోత్సవానికి ఆదివాసీ చెంచులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని.. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించే వేడుకలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చెంచు పెంటల అభివృద్ధికి రూ.కోటి నిధులు నల్లమల అటవీ ప్రాంతంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్న అప్పాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చెంచు పెంటల అభివృద్ధికి రూ.కోటికి పైగా నిధులను మంజూరు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. రూ. 59లక్షలతో బావుల ఏర్పాటు, రూ. 18లక్షలతో సోలార్ లైటింగ్ సౌకర్యం, రూ. 10లక్షలతో నూతన చెక్‌డ్యాంలు నిర్మించనున్నట్లు వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా రూ. 15లక్షలతో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. త్వరలో గవర్నర్ చెంచు పెంటలను సందర్శించనున్నారని కలెక్టర్ తెలిపారు. అనంతరం అప్పాపూర్‌లోని గిరిజన ఆశ్ర మ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. డీఎఫ్ఓ రోహిత్ గోపిడి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఫిరంగి, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, శిశు సంక్షేమ శాఖ అధికారి రాజ్వేశ్వరి, ఆర్డీఓ మాధవి, మిషన్ భగీరథ అధికారులు సుధాకర్‌సింగ్, హేమలత, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ పాండునాయక్ ఉన్నారు. మన్ననూర్ ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ బస మన్ననూర్: మన్ననూర్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడే విద్యార్థులతో కలిసి రాత్రి బస చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు పలు సూచనలు చేశారు. -
21న ‘పేట’కు సీఎం రాక
నారాయణపేట: ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నారాయణపేటకు రానున్నారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఈ మేర కు సోమవారం ఆమె హెలీప్యాడ్ స్థలాన్ని ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి పరిశీలించారు. అలాగే ఫొటో ఎగ్జిబిషన్, స్టేజీ తది తర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు, వాటిలో మెడికల్ కళాశాల టీచింగ్ హాస్పిటల్, 100 పడకల ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల, రెండు పోలీస్స్టేషన్ల భవన నిర్మాణాలు, పెట్రోల్ బంక్, మహిళా సమాఖ్య భవనాలు ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. కల్తీ ఆహారం విక్రయిస్తే కఠిన చర్యలు కల్వకుర్తి టౌన్: హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీ ఆహారం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. శుభ్రత పాటించని సుప్రభాత్, ఎస్ఆర్ గ్రాండ్తో పాటు పలు టిఫిన్ సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ఆయా హోటళ్లలో ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించామన్నారు. శాంపిళ్లలో ఏమైనా కల్తీ జరిగినట్టు తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. జాగ్రత్తలు పాటించాలి నాగర్‌కర్నూల్ క్రైం: విద్యార్థులు కంటిచూపుపై నిర్లక్ష్యం చేయరాదని.. ముందస్తు జాగ్రత్తలు పాటించాలని జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.రఘు సూచించారు. సోమవారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎం.వెంకటదాసుతో కలిసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక కంటివైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 50,780 మంది విద్యార్థులకు రెండు విడతలుగా కంటి పరీక్షలు నిర్వహించి.. 1,893 మందికి దృష్టిలోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు వివరించారు. వీరి కోసం నాగర్‌కర్నూల్, అచ్చంపేట ఆస్పత్రుల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వచ్చేనెల ఐదో తేదీ వరకు శిబిరాలు కొనసాగుతాయన్నారు. విద్యార్థులకు కంటివైద్య నిపుణులచే పరీక్షలు నిర్వహించి.. అవసరమైన మందులు, కంటి అద్దాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ డా.రవిశంకర్, కంటివైద్య నిపుణులు డా.శైలజ, డా.రోహిత్, డా.దశరథ్, ఆర్బీఎస్కే డాక్టర్ అక్బరుద్దీన్ పాల్గొన్నారు. శ్రీశైలం యాత్రికులకు 24 గంటలు అనుమతి మన్ననూర్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ఈ నెల 23 నుంచి మార్చి 1వ తేదీ వరకు అటవీశాఖ చెక్‌పోస్టుల ద్వారా 24 గంటలు వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు డీఎఫ్ఓ రోహిత్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొంతకాలంగా వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు మన్ననూర్ చెక్‌పోస్టు వద్ద రాకపోకలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల చెందిన శివమాలధారులు, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అయితే అటవీ ప్రాంతంలో ప్రయాణించే క్రమంలో ఎలాంటి శబ్దం చేయరాదన్నారు. వాహనాలు గంటకు 40 కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణించాలని సూచించారు. ప్రయాణ సమయంలో భక్తులు ఎలాంటి ప్లాస్టిక్ వాడకూడదని.. అటవీ ప్రాంతంలో వాహనాలు నిలుపరాదని తెలిపారు. అటవీ ప్రాంతంలో మద్యం తాగడం, మంటలు వేసుకోవడాన్ని పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. పాదయాత్రగా వెళ్లే భక్తులు అధికారులు గుర్తించిన మార్గాల్లో మాత్రమే రాకపోకలు సాగించాలని కోరారు. -
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
నాగర్‌కర్నూల్: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయంతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గం చూపాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదన్నారు. ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి.. వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ప్రజావాణికి 57 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి
కందనూలు: విద్యార్థుల్లో నైపుణ్యాలు, కమ్యూనికేషన్, విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్ కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఆర్పన్ రెసిడెన్షియల్ పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం నిర్వహించగా ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు లేని పిల్లలే పాఠశాలలో చదువుతుంటారని.. సిబ్బంది వారి అవసరాలను గుర్తించి ఎల్లవేళలా పని చేయాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు అలవడాలని.. దీంతో సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దగలుగుతామని తెలిపారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి షర్ఫొద్దీన్, మండల విద్యాధికారి భాస్కర్‌రెడ్డి, ప్రిన్సిపల్ వి.రాధ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
వీడని మిస్టరీ
● ఏళ్లు గడుస్తున్నా హత్య కేసుల్లో దోషులను గుర్తించని పోలీసులు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లోనే పలు మర్డర్ కేసులు ● రాజకీయంగా సంచలనం సృష్టించినవి సైతం అదే తీరు ● రెండు, మూడు రోజుల్లో దొరక్కుంటే అంతే సంగతులు.. ● ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నా ఛేదించడంలో విఫలం సాక్షి, నాగర్‌కర్నూల్: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి నేర పరిశోధన, కేసుల ఛేదింపుల్లో పోలీసులకు ఆయుధంగా మారుతోంది. సీసీ కెమెరాలు, సెల్ఫోన్లు, ఫోరెన్సిక్ ఆధారాల సాయంతో హత్య కేసులను ఛేదించడం సులభతరం అవుతోంది. అయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చోటుచేసుకున్న కొన్ని హత్యకేసుల్లో నిందితులు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. మరికొన్ని కేసుల విచారణ ఏళ్లతరబడిగా కొనసాగుతోంది. చాలా సందర్భాల్లో రెండు, మూడు రోజుల్లో నిందితులు పట్టుబడకపోతే ఆ కేసు పెండింగ్‌లో పడిపోతోంది. ఉమ్మడి జిల్లాలో సంచలనం కలిగించిన హత్య కేసుల్లోనూ నిందితులను గుర్తించలేకపోవడం పోలీసుల పనితీరుకు మచ్చగా నిలుస్తోంది. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌లోనే ఎక్కువ గతేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 33 హత్యలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని బిజినేపల్లి, నాగర్‌కర్నూల్ మండలాల్లో ఎక్కువగా నేరాలు నమోదయ్యాయి. ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో 30 హత్యలు జరిగాయి. ఆ తర్వాత వనపర్తిలో 14, జోగుళాంబ గద్వాలలో 9, నారాయణపేట జిల్లాలో 8 హత్య కేసులు నమోదయ్యాయి. విచారణ కొనసాగుతోంది.. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో వ్యక్తి హత్య కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇంకా నిందితులను గుర్తించలేదు. ఈ కేసు మినహా ఎక్కడా మర్డర్ కేసులు పెండింగ్‌లో లేవు. ఎప్పటికప్పుడు పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషిచేస్తున్నాం. – వెంకటేశ్వరరావు, డీఎస్పీ, వనపర్తి 30140908 -
పాలమూరు బిడ్డకు నిర్వాసితుల గోస పట్టదా?
జడ్చర్ల: పాలమూరు బిడ్డనని గొప్పగా చెప్పుకొంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి అదే పాలమూరు బిడ్డలు, నిర్వాసితుల గోస పట్టదా.. కాంట్రాక్టర్లు, కమీషన్ల కోసం నిర్మాణ వ్యయాలను పెంచుతున్న ప్రభుత్వం.. రిజర్వాయర్ కోసం భూములు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులకు పరిహారం పెంచకపోవడం ఏమిటని ఎంపీ డీకే అరుణ అన్నారు. తక్కువ ధరకు భూములు లాగేసుకున్న నాటి, నేటి ప్రభుత్వాల తీరును ఎంపీ ఎండగట్టారు. గత ఐదు రోజులుగా ఉదండాపూర్ గ్రామ సమీపంలో సమస్యల పరిష్కారం కోసం రిలే నిరహార దీక్షలు చేస్తున్న నిర్వాసితుల దీక్షా శిబిరాన్ని ఆదివారం ఆమె సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, సంబంధిత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షలు నిర్వహించినా ఎలాంటి ఫలితం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నిర్వాసితులకు న్యాయం చేయలేదన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీని రూ.25 లక్షలకు పెంచి అందజేస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. వన్‌టైం సెటిల్మెంట్ కింద పూర్తిస్థాయిలో పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం నయాపైసా చెల్లించలేదని విమర్శించారు. ఒకే రిజర్వాయర్ కింద రెండు రకాలుగా పరిహారం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. నిర్వాసితులకు ఇంటి స్థలాలు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తున్న వారిని పోలీసులతో భయపెట్టడం తగదన్నారు. ఇప్పటికై నా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి నిర్వాసితులను క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట బీజేపీ నాయకులు బాలవర్ధన్‌గౌడ్, పద్మజారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు. -
రైతు దీక్షను విజయవంతం చేయాలి
వెల్దండ: రైతు దీక్షకు రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కోరారు. ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న ఆమనగల్లు పట్టణంలో రైతు దీక్షకు నిర్వహిస్తునట్లు పేర్కొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ హాజరవుతారని పేర్కొన్నారు. గ్రామ గ్రామాన పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. అనంతరం కార్యకర్తలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుట్టరాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్యగౌడు, సింగిల్‌విండో డైరెక్టర్ శేఖర్‌ముదిరాజ్, నాయకులు వెంకటేశ్వర్రావు, భాస్కర్‌రావు, చంద్రమోహన్‌రెడ్డి, హన్మంత్‌నాయక్, లింగంముదిరాజ్, తిరుమల్‌రావు, అంజయ్య, అంజినాయక్, బాల్లక్ష్మయ్య, రాములు, సోమయ్య, పర్వతాలు, ఆనంద్, అశోక్, మధుసూదన్‌రెడ్డి, దేవేందర్, రాజు, పూరి రమేష్, శ్రీనుముదిరాజ్, రమేష్‌గౌడు, శేఖర్, వెంకట్, కొండల్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, ప్రవీణ్, రవి, జగన్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. -
ప్రాదేశిక పోరుకు సన్నద్ధం
అచ్చంపేట: జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల జాబితా కొలిక్కి వచ్చింది. అభ్యంతరాల స్వీకరణ, మార్పుచేర్పుల అనంతరం తుది జాబితాను అధికారులు ప్రకటించారు. మండలాల వారీగా మహిళలు, పురుఘలు, ఇతరుల ఓటర్ల వివరాలను జిల్లా, మండల ప్రజాపరిషత్ కార్యాలయాలతో పాటు గ్రామపంచాయతీలలో ప్రదర్శించారు. కోడ్ కంటే ముందుగానే ఎన్నికలకు సిద్ధం కావాలని, పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలన్న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ర్యాంపులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలను పరిశీలిస్తున్నారు. మూడు నెలల సమయం? స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నా.. అధికారులు ఎన్నికల పనుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాలను గుర్తించి జాబితాలను జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 20 జెడ్పీటీసీలు, 214 ఎంపీటీసీ స్థానాలకుగాను 1,187 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 6,54,819 ఓటర్లుండగా.. పురుషులు 3,27,930 మంది, మహిళలు 3,26,870 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు. ఎన్నికలు వాయిదా పడతాయనే భావనలో ఉండొద్దని.. ఏర్పాట్లలో నిమగ్నం కావాలని అధికారులకు పంచాయతీరాజ్ కమిషనరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. పోలింగ్ కేంద్రాలు ఖరారు కావడంతో టీ–పోల్ యాప్‌లో పోలింగ్ కేంద్రాల వారీగా 500 నుంచి 700 మంది ఓటర్లను మ్యాపింగ్ చేసి కేంద్రాలకు కేటాయించాల్సి ఉంది. గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏది ముందు నిర్వహించాల్సి వచ్చినా.. అందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల.. స్థానాలు ఖరారు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నఅధికారులు -
అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
కోడేరు: అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాలలో రూ.25 లక్షలతో నిర్మించే టాయిలెట్స్, డార్మెటరీ, డైనింగ్ హాల్, కస్తూర్బా విద్యాలయంలో రూ.10 లక్షలతో నిర్మించే అదనపు తరగతి గదులు, కొండ్రావుపల్లిలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ, జనుంపల్లిలో రూ.16 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల పంట రుణమాఫీ, ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతు భరోసా పథకాలు అమలు చేసిందన్నారు. త్వరలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని.. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా మౌలిక వసతుల కల్పనకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని.. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వివరించారు. అనంతరం మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్రావు, మాజీ కో–ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ కరీం, బావాయిపల్లి మాజీ సర్పంచ్ వేణుగోపాల్‌యాదవ్, ఎంపీడీఓ శ్రావణ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు మహేశ్వర్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు, ఆది రాజు, రామకృష్ణ, పొండేళ్ల సురేశ్, ఇమ్రాన్, బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
వేరుశనగ క్వింటా రూ.7,300
కల్వకుర్తి: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌కు ఆదివారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుంచి 253 మంది రైతులు 2,280 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి తెచ్చారు. క్వింటా గరిష్టంగా రూ.7,300, కనిష్టంగా రూ.5,602, సరాసరి రూ.6,809 ధర పలికినట్లు కార్యదర్శి శివరాజ్ తెలిపారు. పోటెత్తిన భక్తులు పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నా రు. యాసంగి వ్యవసాయ పనులు తగ్గుముఖం పట్టడంతో రైతులు, కూలీలు పెద్దఎత్తున తరలివచ్చారు. నాగర్‌కర్నూల్, వనపర్తి, కొల్లాపూర్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపా రు. వాహనాలు కొనుగోలు చేసినవారు ఆల యం ఎదుట ప్రత్యేక పూజలు చేయించారు. కొనసాగుతున్న రిలే దీక్షలు చారకొండ: తమకు న్యాయం చేయాలంటూ బైపాస్ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన బాఽధితులు మండల కేంద్రంలో చేపడుతున్న రిలే దీక్షలు ఆదివారం ఆరోరోజుకు చేరాయి. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బాలస్వామి, సీపీఐ జిల్లా సమితి సభ్యుడు చిల్వేరు శ్రీనివాసులు వారికి మద్దతు తెలిపి మాట్లాడారు. బాధితుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని.. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులు ఆరురోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఇప్పటికై నా స్పందించకుంటే ప్రజాసంఘాల మద్దతుతో బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాధితులు సుమతమ్మ, బాలయ్య, కిరణ్, అలివేలు, చిట్టెమ్మ, లాలమ్మ, అనసూయ, కృష్ణయ్య, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. అలరించిన పద్యనాటక ప్రదర్శనలు స్టేషన్ మహబూబ్‌నగర్: మన్యంకొండ శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో శ్రీమిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు ఆదివారం రెండోరోజు కొనసాగాయి. కోయిలకొండ మండలం అంకిళ్ల గ్రామానికి చెందిన రామాంజనేయ కళానాట్య మండలి కళాకారులు శ్రీరామాంజనేయ యుద్ధ ఘట్టం, శ్రీమిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో దేవేంద్ర సభ, శ్రీకృష్ణ రాయబారం, మిడ్జిల్ మండలం మల్లాపూర్‌కు చెందిన శ్రీవీరాంజనేయస్వామి నాట్య మండలి ఆధ్వర్యంలో కౌరవసభ, కళాకారుడు ఎ.శ్రీశైలం రావణ ఏకపాత్రాభినయాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్రీమిత్ర కళానాట్యమండలి ప్రధాన కార్యదర్శి వి.నారాయణ మాట్లాడుతూ మన్యంకొండ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ సహకారంతో మంగళవారం వరకు పద్యనాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పద్యనాటక ప్రదర్శనలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. సోమవారం వివిధ సంస్థలచే శ్రీకృష్ణాంజనేయ యుద్ధ ఘట్టం, మయసభ దుర్యోధన నాటకాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. -
శనేశ్వరుడికి పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్‌లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరుడికి భక్తుల చేత ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తిలతైలాభిషేక పూజలు చేయించారు. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చి.. భక్తిశ్రద్ధలతో శనేశ్వరుడికి పూజలు చేశార. అనంతరం బ్రహ్మసూత్ర పరమ శివుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. వేరుశనగ పరిశ్రమ పరిశీలన వనపర్తి రూరల్: మండలంలోని దత్తాయిపల్లి శివారులో గత ప్రభుత్వం మండల మహిళా సమాఖ్య (ఐకేపీ) ఽఆధ్వర్యంలో వేరుశనగ నూనె పరిశ్రమను ఏర్పాటుచేసింది. నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ జిల్లా డీఏఓ చంద్రశేఖర్, ఏడీ పూర్ణచంద్రారెడ్డి, ఏఓ నరేశ్, ఏఈఓ రత్నరావు శనివారం గ్రామానికి చేరుకొని పరిశ్రమను పరిశీలించారు. వనపర్తి డీపీఎం అరుణ మిషనరీ, పరిశ్రమ నిర్మాణ వ్యయాన్ని వారికి వివరించారు. డీఏఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకుగాను కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం వెంకటన్న, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,841 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శనివారం 3,149 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,841, కనిష్టంగా రూ.4,009 ధరలు లభించాయి. అదేవిధంగా కందులకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,000, కనిష్టంగా రూ.5,667, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,388, కనిష్టంగా రూ.2,270, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,100, కనిష్టంగా రూ.5,555, పత్తి గరిష్టంగా రూ.6,109, కనిష్టంగా రూ.5,889 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆముదాలు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.5,716, కనిష్టంగా రూ.5,709, కందులు గరిష్టంగా రూ.6,909, కనిష్టంగా రూ.6,709గా ధరలు నమోదు అయ్యాయి. -
చదువుతోపాటు క్రీడలపై శ్రద్ధ పెట్టాలి
ఉప్పునుంతల: బాలబాలికలు చదువుతోపాటు క్రీడలపై కూడా శ్రద్ధ పెట్టాలని డీవైఎస్ఓ సీతారాం అన్నారు. శనివారం మండలంలోని వెల్టూరు జెడ్పీహెచ్ఎస్ క్రీడా మైదానంలో 34వ సబ్ జూనియర్ బాల బాలికల (కబడ్డీ) జిల్లాస్థాయి ఎంపిక ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 85 మంది బాలురు, 52 మంది బాలికలు పాల్గొన్నారు. ఎంపిక అయిన బాలబాలికలకు ఈ నెల 19 వరకు ఇక్కడే శిక్షణ ఇచ్చి.. ఈ నెల 20న వికారాబాద్‌లో జరిగే 34వ తెలంగాణ రాష్ట్రస్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని సెలక్షన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ తెలిపారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి యాదయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, సభ్యులు డాక్య, వినయ్‌కుమార్‌గౌడ్, భారతి, నిర్మల, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి కులగణన సర్వే
అచ్చంపేట: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను మరోసారి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది నవంబర్‌లో తొలి విడత సర్వే చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో చాలామంది ఈ సర్వేలో పాల్గొనలేదు. ఇప్పుడు అందరి కోసం కా కుండా గతంలో సర్వేలో పాల్గొనని కుటుంబాలను మా త్రమే పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు ఆదివా రం నుంచి ఈ నెల 28 వరకు సర్వే కొన సాగుతోంది. గతేడా ది నబంవర్ 6 నుంచి 8 వరకు ఎన్యుమరేటర్లు హౌస్ లి స్టింగ్ చేసి ఇళ్ల లెక్క తేల్చారు. తర్వాత ఇంటింటికి వెళ్లి కు టుంబ సభ్యుల వివరాలు నమోదు చేపట్టారు. జిల్లాలో 2,20,233 కుటుంబాలను గుర్తించి సర్వే చేయగా.. కు టుంబాల సంఖ్య 2,50,596గా తేలింది. ఇందులో 2,49,180 కుటుంబాల సర్వే పూర్తి కాగా.. మిగిలిన కుటుంబాలను ఇప్పుడు చేయాల్సి ఉంది. అయితే బీసీల శాతం ఈ జాబితాలో తక్కువ వచ్చిందని విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడంతో మిగిలిన కుటుంబాలను సర్వే చేసేందుకు ముందుకు వచ్చింది. సర్వేకు దూరంగా ఉన్న వాజుజీ ఇప్పుడు పాల్గొ ని వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. -
మహిళా సంఘాల బలోపేతానికి కృషి
వెల్దండ: జిల్లాలో మహిళా సంఘాల బలోపేతానికి ప్రత్యేక దృష్టిపెట్టామని డీపీఎం ఐబీ శ్రీనివాసులు అన్నారు. శనివారం మండల మహిళా సమాఖ్య కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 1,46,916 మహిళా సంఘాల సభ్యులు ఉన్నారని, ప్రతి సంఘానికి బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించాలన్నారు. గ్రామాల్లో కొత్తగా మహిళా సంఘాల ఏర్పాటు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. వీఓఏలు గ్రామాల్లో కొత్త సంఘాలను ఏర్పాటు చేసి సభ్యులను ప్రోత్సహించాలన్నారు. గ్రామ సంఘాల్లోని మహిళలకు జీవనోపాధి కోసం పాడి పరిశ్రమ, కిరాణ షాపులు, మిర్చి, పిండి గిర్నిలు, చికెన్ షాపులు, ఇతర పరిశ్రమల కోసం రుణాలను అందిస్తున్నట్లు చెప్పారు. సంఘాల పనితీరును బట్టి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు పొందవచ్చన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను గ్రామీణ ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన లోకాప్ యాప్‌లో సంఘాలు చేర్చుతున్నామని, ఎస్ఎస్జీ యాప్‌లోని సంఘాల లావాదేవీలను నిక్షిప్తం చేస్తుందన్నారు. లోకాస్ యాప్ ద్వారా కేంద్రం మహిళా సంఘం పనితీరును బట్టి ప్రత్యేకంగా రుణాలు అందిస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 8,799 సంఘాలు లోకాస్ యాప్‌లో చేరాయన్నారు. మహిళా సంఘాల సభ్యులకు మరింత సమాచారం అందించడానికి జిల్లావ్యాప్తంగా 15 బృందాలతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల మహిళా సంఘం అధ్యక్షురాలు భారతమ్మ, ఏపీఎం ఈశ్వర్, సీసీ యాదగిరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి ప్రణాళిక ఖరారు
గ్రామసభల ద్వారా పనుల గుర్తింపు పూర్తి మొత్తం జాబ్ కార్డులు 1,94,725 యాక్టివ్‌గా ఉన్నవి 1,10,095 పనిచేస్తున్న కూలీలు 1,81,605 ఈ ఏడాది పనిదినాల లక్ష్యం 38.30 లక్షలు నాగర్‌కర్నూల్: ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు కూలీలకు ఉపాధి కల్పించేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో కూలీలకు ఎన్ని పనిదినాలు కల్పించాలి.. వారికి కేటాయించాల్సిన బడ్జెట్ ఎంత.. ఏయే పనులు చేయించాలనే అంశాలపై ఇప్పటికే గ్రామసభలు నిర్వహించారు. ప్రధానంగా జిల్లాలో వేసవి కాలంలో వ్యవసాయ పనులు లేకపోవడం, కూలీలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేలా అధికారులు ఈ ప్రణాళిక తయారు చేశారు. వ్యవసాయం, మత్స్య, ఇరిగేషన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో చేపట్టే పనులను గుర్తించారు. జిల్లాలో 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూలీలకు 38.30 లక్షల పనిదినాలు కల్పించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికోసం దాదాపు రూ.114 కోట్ల నిధులు అవసరం ఉంటుందని అంచనా వేశారు. కాగా గత 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో మొత్తం 38.42 లక్షల పనిదినాలను నిర్దేశించగా.. ఇప్పటి వరకు 32.53 లక్షల పనిదినాలు పూర్తిచేశారు. దీని కోసం ఇప్పటి వరకు కూలీలకు రూ.105.53 కోట్లు చెల్లించారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో 43 రోజులు ఇంకా మిగిలి ఉండగా మిగతా పనిదినాలను సైతం పూర్తి చేసి లక్ష్యం చేరుకునే అవకాశం ఉంది. ఈ ఉపాధి హామీ పనుల్లో భాగంగా గ్రామాల్లో మౌళిక వసతుల కల్పన, పల్లెబాటలు, నీటి పరిరక్షణ, నీటి నిల్వ, అడవుల పెంపకం, మొక్కలు నాటడం, బోర్వెల్ రీచార్జ్, బీడు భూములను సాగులోకి తెచ్చే పనులు చేపట్టనున్నారు. కాగా.. గతేడాది కంటే ఈసారి 12 వేల మేర పనిదినాలు తగ్గడం గమనార్హం. గతేడాది కంటే తగ్గుదల కూలీల సంఖ్య పెరగవచ్చు పెరగనున్న డిమాండ్.. ఉపాధి కూలీకి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం భారీగా డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే భూమిలేని కూలీలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించనుంది. దీనికి కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలను అర్హులుగా గుర్తిస్తుంది. దీంతో జాబ్‌కార్డు తీసుకోకుండా ఉన్న నిరుపేదలంతా ఉపాధి హామీ పనులకు హాజరయ్యేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగా పనులను కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 2025– 26 సంవత్సరానికి 38.30 లక్షల పనిదినాల గుర్తింపు వ్యవసాయ, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట ‘ఆత్మీయ భరోసా పథకం’ నేపథ్యంలో పెరగనున్న డిమాండ్ గతేడాది కంటే ఈసారి 12 వేల మేర తగ్గిన పనిదినాలు 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి పనులకు ప్రణాళిక ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వందశాతం పూర్తి చేస్తాం. ఆత్మీయ భరోసా పథకంతో ఉపాధి కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎంత మేర పెరుగుతుందనేది మరి కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. – చిన్న ఓబులేసు, డీఆర్డీఓ -
పాలకవర్గాలకే ‘సహకారం’
● పీఏసీఎస్, డీసీసీబీ చైర్మన్ల పదవీకాలం పొడిగింపు ● ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ● డీసీఎంఎస్‌కు సంబంధించి వెలువడని నిర్ణయం సీఎంకు కృతజ్ఞతలు పీఏసీఎస్ పాలకవర్గాల కాలపరమితి మరో ఆరు నెలలు పొడిగించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. మా విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని పెంచిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తమ్మల నాగేశ్వర్రావుకు కృతజ్ఞతలు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రైతులకు మరింత చేరువ చేసేందుకు సహకార వ్యవస్థను బలోపేతం చేస్తాం. – విష్ణువర్ధన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్, మహబూబ్‌నగర్ ●అచ్చంపేట: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పాక్స్) పాలకవర్గాల పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వెలువడిన ఉత్తర్వులను ఆయా జిల్లాల సహకార శాఖ అధికారులు అందుకొని పీఏసీఎస్‌లకు పంపించారు. ఎన్నికల ప్రక్రియకు ఆరు నెలల ముందే కసరత్తు మొదలుపెట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ఊసేలేదు. దీంతో ప్రత్యేకాధికారుల పాలనా.. ప్రస్తుతం పాలకవర్గ పదవీకాలాన్ని పొడిగిస్తారా అన్న సందేహాలకు తాజా ఉత్తర్వులతో తెరపడింది. జిల్లాలోని 87 సొసైటీల పాలకవర్గాలు మరో ఆరు నెలలపాటు కొనసాగనున్నాయి. డీసీసీబీ పాలకవర్గ పదవీకాలాన్ని కూడా పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే డీసీఎంఎస్‌కు సంబంధించి అంశం ఉత్తర్వుల్లో లేకపోవడం గమనార్షం. డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాలకు మరో పదిరోజుల సమయం ఉండటంతో ఈలోగా డీసీఎంఎస్ పాలకవర్గ పదవీ కాలం పొడిగింపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హర్షాతిరేకాలు.. ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షుల పదవీకాలం శనివారంతో ముగిసింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ (డీసీఎంఎస్) పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 20తో పూర్తవుతుంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో డీసీసీబీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, డీసీఎంఎస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, సహకార సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ పొడిగింపు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనూ 2018 ఫిబ్రవరి 4న పాలకవర్గాల పదవీకాలం ముగియగా ఆరు నెలల చొప్పున రెండుసార్లు పర్సన్ ఇన్‌చార్జ్‌ల పదవీకాలాన్ని పొడిగించారు. 2020 ఫ్రిబవరి 15న ఎన్నికలు నిర్వహించారు. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రెండేళ్లు, టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు మూడేళ్లపాటు పొడిగించారు. పర్చన్ ఇన్‌చార్జ్‌లను నియమిస్తే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పాలకవర్గాల పదవీకాలాన్ని పొడిగించింది. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
● ఫలించిన 17 ఏళ్ల ఎదురుచూపులు ● హైకోర్టు ఉత్తర్వులతో పోస్టింగులు ● కాంట్రాక్టు ఎస్జీటీలుగా అవకాశం ● ఉమ్మడి జిల్లాలో 182 మందికి న్యాయం సర్వీస్ కల్పించాలి.. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. అయితే మేమంతా 17 ఏళ్ల సర్వీస్ కోల్పోయాం. ఇప్పటికి మాకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి. ఉద్యోగం ఇస్తూ సర్వీస్, ఏరియర్స్ కల్పిస్తూ.. రెగ్యులర్ చేస్తే బాగుంటుంది. – విజయ్‌కుమార్, మద్దూరు నారాయణపేట/మద్దూర్: డీఎస్సీ– 2008 నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు కాంట్రాక్టు విధానంలో ఎస్టీటీలుగా వారం రోజుల్లోగా నియామకాలు పూర్తి చేయాలని హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని బాధిత అభ్యర్థుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ అనంతరం తీసుకున్న నిర్ణయం మేరకు 30 శాతం పోస్టులు ప్రత్యేకంగా డీఈడీ అభ్యర్థులకు కేటాయించడంతో బీఈడీ అభ్యర్థులు నష్టపోయారు. మెరిట్ జాబితాలో ఉన్నా.. ఉద్యోగాలు రాకపోవడంతో కోర్టుల చుట్టూ తిరుగుతూ వస్తున్నారు. 17 ఏళ్ల న్యాయ పోరాటం.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వీరందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ కాంట్రాక్టు విధానంలో నియమించనున్నారు. అయితే వీరందరికీ సాధ్యమైనంత త్వరగా పోస్టింగ్ ఇవ్వాలని గతంలోనే హైకోర్టు స్పష్టం చేసినా వివిధ కారణాలతో జ్యాపం జరుగుతూ వచ్చింది. సర్టిఫికెట్ల పరిశీలన ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన ఉమ్మడి జిల్లాల వారీగా పూర్తయింది. ఈ పరిశీలన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు కొనసాగింది. తాజాగా కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నియామక ఉత్తర్వులను వారం రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాధిత అభ్యర్థులు కాంట్రాక్టు ఎస్జీటీలుగా నియామకం కానున్నారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 182 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ నూతన జిల్లాల వారీగానే పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతుండగా.. ఖాళీలను బట్టీ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సంఖ్య జోగుళాంబ గద్వాల50 మహబూబ్‌నగర్ 10 డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు జిల్లాల వారీగా అభ్యర్థులు ఇలా.. నారాయణపేట 50 నష్టపోయాం.. డీఎస్సీ– 2008లో వెలువడిన నోటిఫికేషన్ ద్వారా పోటీ పరీక్షల్లో ఎంపికై కౌన్సెలింగ్ సమయంలో ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా చాలా నష్టపోయాం. అప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం హర్షణీయం. – బుగ్గప్ప, మద్దూరు సంతోషంగా ఉంది.. 17 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మాకు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. గత 17 ఏళ్లుగా వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగించాను. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు అన్యాయం జరిగి.. మళ్లీ అదే ప్రభుత్వంలో ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది. – రవిప్రకాష్, నారాయణపేట వనపర్తి 40 నాగర్‌కర్నూల్ 32 న్యాయ పోరాటంతోనే.. ఎన్నో సంవత్సరాల పోరాటంతో ఫలించిన అద్భుత క్షణం ఇది. 2008లో డీఎస్సీ రోస్టర్‌లో మా పేర్లు ఉన్నా కొన్ని కారణాలతో ఉద్యోగం రాలేదు. 28 జీఓ ప్రకారం మా ఉద్యోగాలు మాకు రావాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఎట్టకేలకు అనుకూలంగా తీర్పు రావడం సంతోషంగా ఉంది. – బాలస్వామి, నాగర్‌కర్నూల్ కొత్త జిల్లాల వారీగా.. ఇప్పటికై నా ఉద్యోగం రావడం చాలా ఆనందంగా ఉంది. కానీ, మమ్మల్ని మా స్థానికత ఆధారంగా కొత్త జిల్లాల వారీగా నియమిస్తే బాగుండేది. అలాగే ఎంటీఎస్ విధానంలో జీతాలు ఇవ్వకుండా రెగ్యులర్ టీచర్ల మాదిరిగానే చెల్లించేలా చూడాలి. – అరుణ, వనపర్తి -
అమర జవాన్ల త్యాగాలు మరువలేనివి
కొల్లాపూర్: పుల్వామా దాడి ఘటనలో అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తూ శుక్రవారం రాత్రి కొల్లాపూర్‌లో రిటైర్డ్ జవాన్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో అమర జవాన్ల చిత్రపటాల వద్ద కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం జరిగిన పోరాటంలో అసువులు బాసిన జవాన్ల త్యాగాలను దేశం మర్చిపోదన్నారు. వారి పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో మాజీ సైనికుల సంఘం గౌరవాధ్యక్షుడు రంగినేని ప్రసాద్ నాయుడు, అధ్యక్షుడు బాలస్వామి, ప్రధాన కార్యదర్శి నజీర్‌బాబా, సీఆర్పీఎఫ్ రమేష్, బీఎస్ఎఫ్ ఖాజా తదితరులు పాల్గొన్నారు. -
మేలైన పశుసంపదను పెంపొందిద్దాం
అచ్చంపేట రూరల్: మేలైన పశు సంపదను పెంపొందించేందుకు పాడి రైతులు కృషిచేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఐనోల్ ప్రాథమిక పశువైద్య కేంద్రంలో కృత్రిమ గర్భధారణ ద్వారా జన్మించిన మేలుజాతి దూడల ప్రదర్శన నిర్వహించారు. మొత్తం 43 ముర్రా, 9 ఒంగోలు జాతి దూడలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటి వద్ద పుట్టిన దూడలను శాసీ్త్రయ పద్ధతిలో పోషించినట్లయితే ఆరోగ్యంగా పెరిగి మంచి పాడి పశువులుగా వృద్ధిచెందుతాయన్నారు. దూడలు పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలను శుభ్రం చేయాలని.. బొడ్డు కత్తిరించి టించర్ అయోడిన్ అద్దాలని సూచించారు. పుట్టిన గంటలోపు ముర్రుపాలు తగినంతగా తాగించాలని తెలిపారు. 10వ రోజున నట్టల నివారణ మందు తాగించాలని, తదుపరి ప్రతి 21 రోజులకోసారి 3 నెలల వరకు తాగించాలని సూచించారు. దూడలకు 4 నెలల వయసులో గాలికుంటు, గొంతు వాపు, జబ్బవాపు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలన్నారు. అనంతరం 60 దూడలకు నట్టల నివా రణ మందులు తాగించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. న్యాయం కోసంప్రజాభవన్ ముట్టడిస్తాం చారకొండ: మండల కేంద్రంలో ఎన్‌హెచ్–167కే బైపాస్ రోడ్డు బాధితులకు న్యాయం చేయకపోతే ప్రజాభవన్ ముట్టడిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు అన్నారు. మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు శుక్రవారం ఆయన సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం 20 ఇళ్లను నేలమట్టం చేయడంతో బాధిత కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయన్నారు. వారికి న్యాయం చేయాలని మండలస్థాయి నుంచి జిల్లా అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లేదా రూ. 50లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చింత ఆంజనేయులు, మండల కార్యదర్శి బాలస్వామి, సీపీఐ తాలూకా ఇన్చార్జి చిల్వేరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం తాడూరు: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజే ష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని యాదిరెడ్డిపల్లి నుంచి గుంతకోడూరుకు రూ. 2.90కోట్లతో, ఐతోలు నుంచి కొమ్ముకుంటతండా వరకు రూ. 2.60 కోట్లతో బీటీరోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీటీరోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. బీటీరోడ్ల నిర్మాణంతో గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడి మరింత అభివృద్ధి సాధిస్తాయన్నారు. రాష్ట్రాభివృద్ధి, పేదల అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. మండలంలో రైతులకు రూ. 50 కోట్లకు పైగా రుణామాఫీ చేసినట్లు వివరించారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో ఐతోలు సబ్‌స్టేషన్‌లో 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, సింగిల్‌విండో చైర్మన్ రాంచంద్రారెడ్డి, డీటీ గోవిందు, ఏఈ శివకృష్ణ పాల్గొన్నారు. -
అన్ని వసతులతో పునరావాసం
నాగర్‌కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని వటువర్లపల్లి గ్రామ తరలింపు ప్రక్రియకు ఎలాంటి ఒత్తిడి లేకుండా గ్రామ సభలో సుముఖత వ్యక్తంచేసిన 671 కుటుంబాలకు నిర్ణీత గడువులోగా అన్ని వసతులతో పునరావాసం కల్పించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్లో అమ్రాబాద్ టైగర్ రిజర్వు కోర్ ఏరియా నుంచి వటువర్లపల్లి గ్రామం తరలింపుపై జిల్లాస్థాయి కమిటీతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాంతం నుంచి స్వచ్ఛందంగా తరలి వెళ్లేందుకు ప్రతిపాదించిన వట్టువర్లపల్లి గ్రామస్తులు స్వచ్ఛందంగా గ్రామసభ, జిల్లాస్థాయి కమిటీ సమావేశాల్లో సమ్మతి తెలియజేశారని వివరించారు. వటువర్లపల్లిలో మొత్తం 671 కుటుంబాలను గుర్తించగా.. అందులో 311 కుటుంబాలు రూ. 15లక్షల చొప్పున పరిహారం తీసుకుంటామని గ్రామసభలో వెల్లడించారని.. మిగిలిన 360 కుటుంబాలకు బాకారం సమీపంలో 220 గజాల చొప్పున ఇంటి నిర్మాణానికి స్థలం కేటాయింపుతో పాటు జీవనోపాధి కోసం 2 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి ఇవ్వనున్నట్లు తెలిపారు. పునరావాసం కోసం కేటాయించిన ప్రాంతంలో సీసీరోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీ భవనం నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత శాఖలు సమన్వయం చేసుకుంటూ పునరావాసం పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. ● నల్లమల అటవీ ప్రాంతంలో జన సంచారం తగ్గించేందుకు అక్కడి ప్రజలకు ఇతర ప్రాంతాల్లో పునరావాసం కల్పిస్తున్నట్లు తెలిపారు. రక్షిత అటవీ ప్రాంతాలు, పులుల ఆవాసాలను మరింత అభివృది ్ధ చేయాలన్నారు. వటువర్లపల్లి గ్రామంలోని రెవెన్యూ భూమి, ఆస్తుల వివరాలను లెక్కించాలన్నారు. వటువర్లపల్లి నుంచి పునరావాసం కోసం 773 దరఖాస్తులు రాగా.. వివిధ కారణాలతో 102 కుటుంబాలను అనర్హులుగా గుర్తించినట్లు వివరించారు. అంతకుముందు వటువర్లపల్లి గ్రామస్తులతో కలెక్టర్ మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం ఉన్నారు. వటువర్లపల్లి గ్రామస్తులకుఇబ్బందులు లేకుండా చర్యలు కలెక్టర్ బదావత్ సంతోష్ -
మరమ్మతు చేయరా..?
కేఎల్ఐ ప్రాజెక్టులో పాడైన రెండు మోటార్లు ●ఉమ్మడి పాలమూరువాసుల సాగు, తాగునీటి కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో.. రూ.వేల కోట్లు వెచ్చించి.. సంవత్సరాల తరబడి శ్రమించి ప్రాజెక్టు నిర్మించారు.. కానీ, రెండు మోటార్లకు చిన్నపాటి మరమ్మతు చేసేందుకు అంతకు మించి కాలయాపన చేస్తున్నారు. ఇందులో ఎవరి నిర్లక్ష్యం ఉంది.. ఎవరు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విషయం పక్కనపెడితే.. ఉమ్మడి జిల్లా ప్రజలు మాత్రం ప్రతిఏటా ఎండాకాలంలో ఇటు సాగునీటికి, అటు తాగునీటికి గోస పడక తప్పడం లేదు. ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది.. ఎల్లూరు లిఫ్టులోని ఐదు మోటార్లలో రెండు మోటార్లు పాడై చాలా కాలం అవుతోంది. ఇటీవల మరో పంపు మోటారు కూడా స్వల్ప మరమ్మతుకు గురైంది. అయితే దీనికి ఇక్కడే మరమ్మతు చేయవచ్చు. ప్రస్తుతం రెండు మోటార్లతోనే నీటి ఎత్తిపోతలు సాగుతున్నాయి. అయితే మిషన్ భగీరథ కోసం రెగ్యులర్‌గా నీటి ఎత్తిపోతలు చేపట్టాలి. ఇలా చేయడం వల్ల మోటార్ల మరమ్మతు చేపట్టేందుకు ఆటంకం ఏర్పడుతుంది. ఇప్పటికై తే మరమ్మతు అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. – లోకిలాల్‌నాయక్, పంపుహౌజ్ నిర్వహణ విభాగం డీఈఈ మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో పంపు మోటార్ల మరమ్మతు ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో పడుతూనే ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు వనపర్తి జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగునీరు, ఉమ్మడి పాలమూరు–రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా అందుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు లిఫ్టు నుంచి కృష్ణానది నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు, చెరువులు నింపుతున్నారు. అయితే ప్రాజెక్టులోని మొదటి పంపుహౌజ్ (ఎల్లూరు లిఫ్టు)లో రెండు మోటార్లు పాడై ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ మరమ్మతుకు నోచుకోవడం లేదు. ఇందుకు ఇటు ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత కంపెనీ ప్రతినిధులు వేర్వేరు కారణాలు చెబుతున్నారు. కేఎల్ఐ ప్రాజెక్టులోని ఎల్లూరు పంప్‌హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసి.. ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లు నింపాలి. ఈ రిజర్వాయర్లకు అనుసంధానంగా ఉన్న చెరువులను కూడా రెగ్యులర్‌గా నింపుతూ ఉండాలి. ఇందుకోసం ఎల్లూరు పంప్‌హౌజ్‌లో 5 మోటార్లను ఏర్పాటు చేశారు. వీటిలో రెండు మోటార్లు పాడయ్యాయి. నాలుగున్నరేళ్ల క్రితం పంప్‌హౌజ్‌లోకి నీరు చేరడంతో మూడో నంబర్ పంప్ మోటార్ దెబ్బతినగా.. ఇప్పటి వరకు ఆ మోటార్ మరమ్మతుకు నోచుకోలేదు. అలాగే రెండేళ్ల క్రితం 5వ నంబర్ పంప్ మోటార్ కూడా దెబ్బతినగా.. దీనిని కూడా అలాగే వదిలేశారు. దీంతో మిగిలిన మూడు మోటార్లతోనే నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. – కొల్లాపూర్ మరమ్మతులకు ఆటంకం కేఎల్ఐ ప్రాజెక్టులో మోటార్లు పాడైతే మరమ్మతు చేపట్టడం ఇబ్బందికరంగా మారుతోంది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ స్కీం కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండటంతో రెగ్యులర్‌గా నీటి ఎత్తిపోత జరుగుతుంది. దీంతో మోటార్ల మరమ్మతుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మోటార్లు మరమ్మతు చేయాలంటే నీటి ఎత్తిపోతలు కొంతకాలం పాటు పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. పాలమూరు ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వస్తేనే కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు నిలిపే అవకాశం ఉంది. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా ప్రారంభమయ్యే వరకు మోటార్లకు మరమ్మతు చేపట్టడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. అయితే పాత బిల్లులు పెండింగ్‌లో ఉండటం కూడా కొంత కారణమని సంబంధిత కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఎత్తిపోతలకు ఇక్కట్లు.. ఎల్లూరు పంప్‌హౌజ్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న మూడు మోటార్లలో రెండింటితోనే నీటి ఎత్తిపోతలు నిర్వహిస్తుండగా.. మరొకటి స్పేర్‌లో ఉంది. రెండు మోటార్లతోనే నీటి ఎత్తిపోతలు చేపడుతుండటంతో వరదల సమయంలో జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు నింపేందుకు ఆలస్యమవుతోంది. కృష్ణానది వరద ప్రవాహ సమయంలో ఎల్లూరు పంప్‌హౌజ్‌లో నాలుగు మోటార్లు నడిపించి రోజుకు 3,200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాలి. ఈ నీటితో రిజర్వాయర్లతో పాటు, చెరువులు కూడా నింపుకోవాలి. కానీ, ఎల్లూరు లిఫ్టులో రెండు మోటార్లు మాత్రమే పనిచేస్తుండడంతో ఆశించిన స్థాయిలో ఎత్తిపోతలు జరగడం లేదు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 2,208 చెరువులు నింపేందుకు నెలలు గడిచిపోతోంది. ప్రాజెక్టులోని పంపుల వివరాలు ఇలా.. ఒక్కో పంపు ద్వారా రోజూ ఎత్తిపోసే నీరు 800 క్యూసెక్కులు ఎల్లూరు లిఫ్టులో మొత్తం పంపులు 5ఒక్కో పంపు మోటారు కెపాసిటీ 30 మెగావాట్లు 3, 5 నంబర్ల మోటార్లు ఎల్లూరు పంప్‌హౌజ్‌లో నాలుగున్నరేళ్లుగా గాలికొదిలేసిన వైనం మూడింటితోనే కొనసాగుతున్న ఎత్తిపోతలు వివిధ రకాల సాకులతో కాలయాపన ఏటా వేసవిలో తప్పని సాగు, తాగునీటి కష్టాలు -
పీఎంశ్రీ నిధులతో పాఠశాలల అభివృద్ధి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పీఎంశ్రీ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. పీఎంశ్రీ పథకానికి ఎంపికై న పాఠశాలలకు మొదటి విడతగా విడుదలైన నిధులపై రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డా.యోగితా రానా హైదరాబాద్ నుంచి కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పీఎంశ్రీ పథకానికి ఎంపికై న 27 పాఠశాలలకు రూ. 3.89 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. ఆయా పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌లు, ల్యాబ్‌లు, గ్రీన్ ఎనర్జీ ఆధారిత విద్యుత్ సరఫరా, పరిశుభ్రత, మంచినీటి వసతి తదితర పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పీఎంశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రెండో విడత నిధులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. సమావేశంలో డీఈఓ రమేష్‌కుమార్, సమగ్రశిక్ష అభియాన్ గణాంక అధికారి మధుసూదన్ రెడ్డి, సమగ్రశిక్ష ప్లానింగ్ కోఆర్డినేటర్ నూరుద్దీన్ ఉన్నారు. -
కొత్త కార్డులకు మోక్షం లభించేనా?
●అచ్చంపేట: రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ మరోసారి కొనసాగుతోంది. మీసేవ కేంద్రాల్లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో 16,007 దరఖాస్తులు వచ్చాయి. గత నెలలో నాలుగు పథకాల అమలులో భాగంగా నిర్వహించిన గ్రామసభల్లో 7,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఎలాంటి రశీదు ఇవ్వలేదు. ఆ దరఖాస్తులను ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లోనూ నమో దు చేయలేదు. ఈ విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వారంతా మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు మీసేవ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. పేర్ల తొలగింపుపై సందిగ్ధం.. నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న కార్డుల్లోనూ మార్పులు, చేర్పులకు వెసులుబాటు కల్పించింది. అయితే 2014 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో.. ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడిన వారి పేర్లు అలాగే ఉన్నాయి. కొత్తగా పెళ్లయిన వారు, ఈ కాలంలో జన్మించిన పిల్లల పేర్లను చేర్చలేదు. కేవలం చనిపోయిన వారి పేర్లు మాత్రమే తొలగించారు. 2021 జూన్‌లో అప్పటి ప్రభుత్వం రేషన్‌కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరించి.. మంజూరు చేయకుండానే అర్ధాంతరంగా నిలిపివేయడంతో నాటి నుంచి దరఖాస్తుదారులు నిరీక్షిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకుందామంటే.. కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి వస్తోంది. దీంతో పలువురు కొత్తకార్డుల జారీ ప్రక్రియ సజావుగా సాగుతుందా.. లేదా అని రెవెన్యూ అధికారులను అడుగుతున్నారు. దీంతో పాటు యూనిట్ల నమోదుకు సైతం సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆర్ఐ, తహసీల్దార్, డీఎస్ఓల లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న యూనిట్ల నమోదు దరఖాస్తులను కమిషనర్ లాగిన్‌కు చేరవేసే ప్రక్రియను మాత్రమే పూర్తిచేశారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే.. రేషన్‌కార్డుల కోసం ప్రజలు ఒకటికి రెండు సార్లు దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల ఆధార్ నంబర్ ఆధారంగా పరిశీలన చేపట్టనున్నారు. అర్హుల దరఖాస్తులను తహసీల్థార్ తాగిన్కు, ఆపై డీఎస్ఓ లాగిన్‌కు చేరవేయనున్నారు. 360 డిగ్రీస్ సాఫ్ట్‌వేర్‌లో వడపోసి లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. మౌఖిక ఆదేశాల మేరకు దరఖాస్తుల పరిశీలన బాధ్యతలను రెవెన్యూ పరిశీలకులకు అప్పగించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, గ్రామాల్లో కార్యదర్శులకు అప్పగించే అవకాశం ఉంది. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ కులగణన, ప్రజాపాలన అర్జీలపై స్పష్టత కరువు రేషన్‌కార్డుల కోసం మరోసారి దరఖాస్తు తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తున్నా.. మాది దినసరి కార్మిక కుటుంబం. నా పెళ్లి అయి తొమ్మిదేళ్లు అవుతుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేషన్ కార్డు కోసం మూడేళ్ల క్రితం మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నా. ఇంత వరకు రాలేదు. ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం రేషన్‌కార్డు జారీ చేయాలి. – చీమర్ల మమత, మారుతీ నగర్, అచ్చంపేట మళ్లీ అవసరం లేదు.. గతంలో దరఖాస్తు చేసుకోని వాళ్లు మాత్రమే మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి. మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నింటినీ పరిశీలన చేసే అవకాశం ఉంది. – శ్రీనివాసులు, జిల్లా పౌరసరఫరాల అధికారి 2021లో 6,010 దరఖాస్తులు.. జిల్లావ్యాప్తంగా 2021లో కొత్తకార్డులు, పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం కోసం పౌరసరఫరాలశాఖకు 6,010 దరఖాస్తులు రాగా.. 5,016 దరఖాస్తులను ధ్రువీకరించారు. మిగిలిన 994 దఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. రెవెన్యూ అధికారులు వాటిని పరిశీలించి డీఎస్ఓ కార్యాలయానికి పంపించారు. ఇక్కడి నుంచి పౌరసరఫరాలశాఖ కమిషనర్‌కు చేరవేశారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు పచ్చజెండా ఊపాల్సి ఉంటుంది. ఇదివరకు కార్డులేని వారు, గతంలో మీసేవలో నమోదు చేసుకోని వారు మాత్రం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. -
నేడు సబ్ జూనియర్ బాలబాలికల జట్ల ఎంపిక
కల్వకుర్తి రూరల్: ఉప్పునుంతల మండలం వెల్టూరు జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం జిల్లాస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ బాలబాలికల జట్లను ఎంపిక చేయనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి యాదయ్యగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 2009 ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత జన్మించిన వారై ఉండటంతో పాటు 55 కిలోల బరువు ఉండాలని సూచించారు. ఆసక్తిగల క్రీడాకారులు ఆధార్, ఎస్ఎస్సీ మెమో, బోనఫైడ్ సర్టిఫికెట్తో రావాలని తెలిపారు. పూర్తి వివరాలకు ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేష్, మోహన్‌లాల్‌తో పాటు 99516 29694, 99125 24385 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. పంటల సాగులో విత్తన ఎంపిక కీలకం బిజినేపల్లి: మొక్కజొన్న పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే విత్తన ఎంపిక కీలకమని రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డా.సుజాత అన్నారు. పాలెం కేవీకే ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని ఖానాపూర్‌లో క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త సుజాత మాట్లాడుతూ.. మొక్కజొన్న సాగులో సరైన సమయంలో యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచించారు. మొక్కజొన్నలో మేలైన విత్తనాలు, పద్ధతులను వివరించారు. పాలెం కేవీకే సమన్వయకర్త డా.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మొక్కజొన్న పంటలో అధిక దిగుబడి పెంచుకునే అవకాశాలు ఉన్నాయని.. ఇందులో ఎరువుల యాజమాన్యం ముఖ్యమైనదని అన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా.మలయ్య, వాణిశ్రీ,, సమత, పరమేశ్వరి పాల్గొన్నారు. -
ఇద్దరు గురుకుల విద్యార్థులకు అస్వస్థత
తెలకపల్లి: మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న చందన, వైష్ణవి బుధవారం రాత్రి అస్వస్థతకు గురికావడంతో సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ సురేశ్ గురువారం పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు డా. సురేశ్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ప్రిన్సిపల్ రష్మి మాట్లాడుతూ.. ఆస్పత్రిలో చేరిన విద్యార్థులకు ఆస్తమా ఉందని, శాస్వ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లామని వివరించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. చల్లటి నీటితో స్నానాలు చేయడంతో అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ జాకీర్ అలీ, ప్రత్యేక అధికారి నర్మద ఉన్నారు. అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ పూర్తి చేయాలి బల్మూర్: అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా ప్రోగాం అధికారి డా. కృష్ణమోహన్ ఆదేశించారు. గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వృద్ధుల కోసం ప్రతి గురువారం ప్రత్యేక శిబిరం నిర్వహించి అయోడిన్ లోపంతో వచ్చే రుగ్మతల గురించి వివరించి సూచనలు, మాత్రలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డా. కల్పన, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్లు విజయ్‌కుమార్, మల్లేశ్, ఫార్మసిస్ట్ శ్రీనివాసులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. సగర శంఖారావాన్ని విజయవంతం చేయాలి నాగర్‌కర్నూల్ రూరల్: సగరుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 16న జిల్లాకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో సగర శంఖారావం నిర్వహిస్తున్నామని.. సగరులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముత్యాల హరికృష్ణ పిలుపునిచ్చారు. గురువారం పుర పరిధిలోని ఊయ్యాలవాడ సమీపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరాముడి వారసత్వం, భగీరథుడి వంశం సగరులదని.. ఇప్పుడు సగర కులం అంటే రోజువారీ కూలీలు, తాపీ మేసీ్త్రలుగా మిగిలిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలని, బీసీలకు ప్రభుత్వం కల్పిస్తామన్న 42 శాతం రిజర్వేషన్లలో సగరుల వాట ఎంత అని ప్రశ్నించారు. కార్పొరేషన్ ఏర్పాటుచేసి చైర్మన్ పదవి సగరులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీనివాసులు, రాష్ట్ర నాయకులు శేఖర్, జిల్లా ఇన్చార్జ్ మోడం ఆంజనేయులు, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ప్రణీల్, కార్యదర్శి వేముల సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
అమ్రాబాద్: ప్రజాపాలనలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దని అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ సూచించారు. గురువారం పదర మండలం ఇప్పలపల్లి రైతువేదికలో క్లస్టర్ అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో తాగునీరు, విద్యుత్, సీసీ రోడ్ల నిర్మాణం తదితర సమస్యలను స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాపాలన ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడమేగాక రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందని వివరించారు. లక్ష్యంతో పని చేస్తున్న ప్రభుత్వానికి అధికారులు సహకరించాలని సూచించారు. పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అంతకుముందు మద్దిమడుగులో పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగం పలికి శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం అమ్రాబాద్ పోచమ్మ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో క్లస్టర్ అధికారులు, మద్దిమడుగు ఆలయ కమిటీ అధ్యక్షుడు రాములునాయక్, నాయకులు రామలింగయ్యయాదవ్, జెట్టెప్ప, రాములుగౌడ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
నమూనా ఇందిరమ్మ ఇల్లు
నిబంధనలకు అనుగుణంగా.. లబ్ధిదారు ఇందిరమ్మ ఇంటిని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మించుకునేలా చూస్తాం. జిల్లాలో సొంత స్థలం కలిగిన పేదలను గుర్తించి జాబితా సిద్ధం చేసి ఇప్పటికే ప్రభుత్వానికి అందజేశాం. ఇల్లు నిర్మించుకునే స్థలాన్ని సర్వే సమయంలోనే చూపారు. ఆ స్థలంలోనే ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది. – సంగప్ప, పీడీ, గృహనిర్మాణశాఖ అచ్చంపేట: నమూనా ఇందిరమ్మ ఇంటిని మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణల్లో ప్రభుత్వం నిర్మిస్తుంది. లబ్ధిదారులు ప్రభుత్వం అందించే రూ.5 లక్షల సాయంతో నిర్మించుకునేలా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం పేదలకు కట్టించే ఇళ్లకు తొలిసారి జియో ఫెన్సింగ్ చేయడంతో పాటు కృత్రిమ మేధా సాయంతో ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరిగినట్లు తేలితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఇవ్వబోమని కేంద్రం తేల్చిచెప్పిన నేపథ్యంలో జియో ఫెన్సింగ్ విధానం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాయంలోనే పూర్తయ్యేలా.. ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు కేటాయిచనుంది. ఈ మొత్తంలో ఏ విధంగా ఇల్లు నిర్మించుకోవచ్చనేది ప్రయోగాత్మకంగా చూపడానికే నమూనా ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఇంటి నిర్మాణానికి కనీసం 60 గజాల స్థలం ఉండాలనే నిబంధన ఉంది. ఇందులో స్లాబ్ ఏరియా 400 చదరపు అడుగులు ఉంటుంది. 12.5 అడుగుల వెడల్పు, 10.5 అడుగుల పొడవుతో పడక గది, 6.9 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవుతో వంట గది, 9 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో హాల్ నిర్మిస్తున్నారు. ఇంటిపైకి మెట్ల నిర్మాణం అనేది లబ్ధిదారుడి ఇష్టం. దీంతోపాటు టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. 8 పిల్లర్లలోనే నిర్మాణం పూర్తి చేసేలా నమూనా రూపొందించారు. ఇందుకు సంబంధించిన మ్యాప్ ఆధారంగా లబ్ధిదారు ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఒకేలా ఉండేలా.. తొలివిడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గృహ నిర్మాణశాఖ ఇచ్చే నమూనా అందరికీ ఒకేలా ఉండేలా ప్రతి మండలంలో మోడల్ ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం గృహనిర్మాణశాఖకు జిల్లాకు పీడీ, నియోజకవర్గానికి డీఈ, ఏఈని నియమించారు. వీరి ద్వారా ఇందిరమ్మ ఇంటి పథకాన్ని నిర్వహించనున్నారు. ఉచిత ఇసుక సరఫరాపై దృష్టి.. మొదటి ప్రాధాన్యతగా సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం విధితమే. అర్హుల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేయగా.. ఎల్–1 జాబితా సిద్ధం చేసి గ్రామసభల్లో ప్రకటించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఉచితంగా 8 ట్రాక్టర్ల ఇసుక అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తహసీల్దార్ల ఆధ్వర్యంలో టోకెన్లు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పునాది తీ సిన తర్వాత తొలి విడత సాయంగా రూ.లక్ష అందిస్తారు. స్టీల్, సిమెంట్ తక్కువ ధరకు అందించాల ని సీఎం అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది. రూ.5 లక్షలతోనే లబ్ధిదారు నిర్మించుకునేలా.. జియో ఫెన్సింగ్, కృత్రిమ మేధా సాయంతో ప్రత్యేక యాప్ సర్వేలో చూపిన స్థలంలోనే ఇంటి నిర్మాణం చేపట్టేలా చర్యలు -
పెళ్లి నిర్ణయం పెద్దలకే..
ప్రేమ, వివాహం విషయంలో యువత ఆలోచన తీరు మారుతోంది. ప్రేమ, ఆకర్షణ, మ్యారేజ్ కన్నా జీవితంలో స్థిరపడేందుకే అధిక శాతం యువత ప్రాధాన్యం ఇస్తున్నారు. శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలోని మెడికల్, నర్సింగ్, ఇంజినీరింగ్, పీజీ కళాశాలల విద్యార్థులతో ‘సాక్షి’ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 120 మంది యువతులు, 120 మంది యువకులు చొప్పున మొత్తం 240 మందితో సర్వే నిర్వహించాం. యువతీ, యువకుల్లో భవిష్యత్‌పై స్పష్టమైన లక్ష్యాలు ఉండడం.. చదువు తర్వాత ఉద్యోగ సాధన.. ఆపై ఆర్థిక స్థిరత్వం తప్పనిసరిగా ఉండాలనే ధోరణి నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పెళ్లి విషయంలో పెద్దల మాటకే విలువ ఇస్తామని ఎక్కువ మంది చెబుతున్నారు. ఇందులో యువతులే కాక యువకులూ ఉండడం విశేషం. ఒకవేళ మనసులు కలిసి జీవితాంతం కలిసి ఉంటామనే నమ్మకం ఏర్పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా పెద్దల అంగీకారం తప్పనిసరి తీసుకుంటామని అంటున్నారు. అయితే, ప్రేమ పెళ్లి విషయంలో యువతులతో పోలిస్తే యువకుల్లో కొంత ఎక్కువగా ఆసక్తి కనిపించింది. సర్వేలో భాగంగా యువతీ యువకులను వివిధ ప్రశ్నలు అడుగగా వారి సమాధానాలు ఇలా ఉన్నాయి... – ‘సాక్షి’ నెట్వర్క్ ● పెళ్లి విషయంలో మారుతున్న యువత వైఖరి ● కెరీర్, ఉన్నత స్థాయి ప్రమాణాలకు ప్రాధాన్యం ● తల్లిదండ్రుల నిర్ణయమే ఫైనల్ అని వెల్లడి ● ప్రేమిస్తే పేరెంట్స్‌ను ఒప్పించాలంటున్న యువత ప్రేమ వివాహాలు భవిష్యత్తరాలపై ప్రభావం చూపుతాయా? ప్రేమ పెళ్లి.. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఏది సరైనది? 56పెద్దలు కుదిర్చిన పెళ్లి ప్రేమ వివాహం లవ్ అండ్ అరేంజ్ 91231141ప్రేమికుల దినోత్సవంసందర్భంగా యువత మనోగతం ప్రస్తుతం ప్రేమలో సోషల్ మీడియా ప్రభావం ఉందా? కెరీర్ ముఖ్యమా.. పెళ్లి ముందా?వయసు రాగానే పెళ్లి ఏ మాత్రం లేదు ఎక్కువగా ఉందికెరీర్ ఫస్ట్ 13227222 -
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
నాగర్‌కర్నూల్: జిల్లాలోని ప్రతి గ్రామంలో అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఎంపీడీఓలను ఆదేశించారు. గురువారం సాయంత్రం జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశానికి అదనపు కలెక్టర్ దేవసహాయం, జెడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్‌తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ ఒక్క అనర్హుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కారాదని, అందుకు పూర్తి బాధ్యత అధికారులు వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇంటి పనులు వెంటనే ప్రారంభించి నాణ్యతగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా జరిగేలా అధికారులు కృషి చేయాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా రానున్న వేసవిలో గ్రామాల్లో నీటిఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అవసరమైన దగ్గర మరమ్మతులు పూర్తిచేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామాలను సందర్శించి పంచాయతీ కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లాలోని 20 మండలాల ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ -
జిల్లావ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు
మహిళా హత్యలుఅత్యాచారాలుపోక్సో వరకట్న వేధింపులు2024గృహహింస కేసులు1058310716480 3 2025 4 2