ఒత్తిళ్లకు తలొగ్గి.. | - | Sakshi
Sakshi News home page

ఒత్తిళ్లకు తలొగ్గి..

Published Mon, Apr 28 2025 12:25 AM | Last Updated on Mon, Apr 28 2025 12:25 AM

ఒత్తి

ఒత్తిళ్లకు తలొగ్గి..

ప్రైవేట్‌ కళాశాలల సూచనలతో డిగ్రీ సెమిష్టర్‌ పరీక్షలు వాయిదా

ఇబ్బందులు రానివ్వం..

ప్రైవేటు కళాశాలలకు ఎట్టి పరిస్థితిలోనూ ర్యాటిఫికేషన్‌, అప్లియేషన్‌ ఇన్‌స్పెక్షన్‌ చేపడతాం. వీటికోసం ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. అలా చేస్తేనే దోస్త్‌లో అడ్మిషన్లు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సమస్యలు ఉన్న కారణంగా వాయిదా వే సిన పరీక్షలను వచ్చేనెలలో నిర్వహిస్తాం. వి ద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

– రమేష్‌బాబు, పీయూ రిజిస్ట్రార్‌

షెడ్యూల్‌ ప్రకారమే..

అసలు యూనివర్సిటీ అధికారులు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఎందుకు తలొగ్గి.. పరీక్షలు వాయిదా వేశారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు నష్టం కలుగుతుంది కాబట్టి కచ్చితంగా వాటిని షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలి. అలాగే ర్యాటిఫికేషన్‌, ఇన్‌స్పెక్షన్‌ వంటి ప్రక్రియలు వెంటనే పూర్తిచేయాలి.

– రాము, యూనివర్సిటీ ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు

ఉద్యమం చేపడుతాం..

ప్రైవేటు కళాశాలలకు రీయింబర్స్‌మెంట్‌ రాకుంటే పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులకు నష్టం చేస్తారా.? పీయూ అధికారుల ఈ తీరు హాస్యాస్పదంగా ఉంది. ప్రైవేటు కళాశాలల్లో వసతులు మెరుగుపడాలంటే ర్యాటిఫికేషన్‌, ఇన్‌స్పెక్షన్‌ వంటివి చేపట్టాల్సిందే. పీయూ అధికారులు తీరు మార్చుకోకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతాం.

– నాగేష్‌, యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో వింత ధోరణి నడుస్తోంది. ప్రైవేట్‌ కళాశాలలను నియంత్రించాల్సిన యూనివర్సిటీ అధికారులు.. ఏకంగా వారి ఒత్తిళ్లకే తలొగ్గి పనిచేయాల్సిన దుస్థితికి చేరుకున్నారు. ఈ నెల 28 నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు 2, 4, 6 నిర్వహిస్తున్నట్లు గతంలో సర్క్యులర్‌ను కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ బ్రాంచ్‌ విడుదల చేయగా.. ఈ నెల 25న వాటిని వాయిదా వేస్తున్నట్లు మరో సర్క్యులర్‌ జారీ చేశారు. దీనికి కారణం ‘ప్రైవేట్‌ కళాశాలల విజ్ఞప్తి మేరకు’ మాత్రమే వాయిదా వేసినట్లు అందులో పేర్కొనడం గమనార్హం. సాధారణంగా పరీక్షలు వాయిదా వేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పోటీ పరీక్షలు, సెలవుల దృష్ట్యా మాత్రమే వాయిదా వేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఒత్తిళ్లతో వాయిదా వేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం ప్రైవేట్‌ కళాశాలలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వనందుకే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది.

విద్యార్థులకు తీవ్రనష్టం..

పీయూ పరిధిలో యూజీ, పీజీ, బీఈడీ తదితర అన్ని కళాశాలలు కలిపి 102 ఉండగా.. వీటిలో సుమారు 22 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. డిగ్రీ పూర్తయిన వెంటనే పీజీలో పీజీ సెట్‌, లా సెట్‌, ఎంబీఏ వంటి కోర్సులలో ప్రవేశాలకు విద్యార్థులు సిద్ధం కావాల్సి ఉంది. ఎంట్రెన్స్‌లకు చదివేందుకు కనీసం 15 రోజుల సమయం కూడా సరిపోదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయడం వల్ల ఫలితాలు, మెమోల జారీ వంటి ప్రక్రియ కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని.. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు తీవ్రనష్టం జరుగుతుందని వాపోతున్నారు. యథావిధిగా షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే వాయిదా వేసిన డిగ్రీ పరీక్షలను అధికారులు వచ్చే నెల 6 నుంచి నిర్వహించనున్నారు.

9 రోజులపాటు నిలిపివేయడంతో

పీజీసెట్‌, లాసెట్‌పై ప్రభావం

అప్లియేషన్‌, ర్యాటిఫికేషన్‌ ప్రక్రియపై పట్టింపులేని వైఖరి

ఆదేశాలను బేఖాతరు చేస్తున్న

యాజమాన్యాలు

పీయూ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు

ఒత్తిళ్లకు తలొగ్గి.. 1
1/4

ఒత్తిళ్లకు తలొగ్గి..

ఒత్తిళ్లకు తలొగ్గి.. 2
2/4

ఒత్తిళ్లకు తలొగ్గి..

ఒత్తిళ్లకు తలొగ్గి.. 3
3/4

ఒత్తిళ్లకు తలొగ్గి..

ఒత్తిళ్లకు తలొగ్గి.. 4
4/4

ఒత్తిళ్లకు తలొగ్గి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement