‘ప్రజావాణి’కి 35 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

‘ప్రజావాణి’కి 35 అర్జీలు

Published Tue, Apr 22 2025 1:17 AM | Last Updated on Tue, Apr 22 2025 1:17 AM

‘ప్రజ

‘ప్రజావాణి’కి 35 అర్జీలు

నాగర్‌కర్నూల్‌: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టరేట్‌ ఏఓ చంద్రశేఖర్‌ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణికి 35 ఫిర్యాదులు వచ్చినట్లు వివరించారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 9..

నాగర్‌కర్నూల్‌ క్రైం: పోలీస్‌ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయానికి వివిధ ప్రాంతాల నుంచి పోలీస్‌ ప్రజావాణికి 9 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 3 భూమి పంచాయతీ, 5 తగు న్యాయం గురించి, ఒకటి భార్యాభర్తల గొడవ ఫిర్యాదు వచ్చాయన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

కందనూలు: కార్పొరేట్‌ కళాశాలల పథకం కింద 2025–26 సంవత్సరానికి గాను (frerh& renewal) జూనియర్‌ కళాశాలలు రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి శ్రావణ్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు కార్పొరేట్‌ కళాశాలల గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలనుకున్న యాజమాన్యం వారు తమ కళాశాలల గుర్తింపు, విద్యార్థులకు కల్పిస్తున్న హాస్టల్‌ సదుపాయాలు, అధ్యాపక సిబ్బంది తదితర వివరాలు https: //telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌ లో ఈ నెల 30లోగా పూర్తి వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసి జిల్లా కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆర్టీసీ రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎ.రాజసింహుడు అన్నారు. జిల్లాకేంద్రంలోని ఫోరం కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానంగా గత 2022 ఏప్రిల్‌ నుంచి రిటైర్డ్‌ అయిన కార్మికులకు రావాల్సిన లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, 2017 పీఆర్‌సీకి సంబంధించిన ఏరియర్స్‌, ప్రతి నెలా 10వ తేదీ లోపు చెల్లించాల్సిన ఎస్‌ఆర్‌బీఎస్‌ డబ్బులను అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యక్షులు జీబీ పాల్‌, ఆర్‌.నారాయణ మాట్లాడుతూ రిటైర్డ్‌ ఉద్యోగులకు 10వ తేదీలోగా చెల్లించాల్సిన ఎస్‌ఆర్‌బీఎస్‌ డబ్బులు ఇంతవరకు చెల్లించలేదన్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగుల జీతభత్యాలకే విడతల వారీగా ఈ నెల 16వరకు చెల్లించారని, ఇంకా డీఏలు, 2021 పీఆర్‌సీ ఇవ్వాల్సిఉందని, అలాగే పీఎఫ్‌, సీపీఎస్‌లకు చెల్లించాల్సిన బకాయిలను కూడా చెల్లించకుండా నియామకాలను ఎలా చేపడుతారని ప్రశ్నించారు. సమావేశంలో నాగాంజనేయులు, లలితమ్మ, నర్సింలు, మనోహర్‌, బుచ్చన్న, రియాజుద్దీన్‌ పాల్గొన్నారు.

మహనీయులను

ఆదర్శంగా తీసుకోవాలి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని పీయూ వైస్‌చాన్స్‌లర్‌ జీఎస్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పీయూలో ఏర్పాటు చేసిన మహనీయుల జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపేందుకు ఎంతో మంది గొప్ప వ్యక్తులు జీవితాంతం కృషి చేశారని, వారి కృషి వల్ల ఎంతో మంది అట్టడుగు వర్గాల వారికి మేలు జరిగిందన్నారు. మహనీయుల జయంతులు చేస్తే వారి ఆశయాలను కొనసాగించినట్లు కాదని, వారు ఎలాంటి సేవలు చేయడం వల్ల గొప్ప వ్యక్తులయ్యారనే అంశాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ జానకి మాట్లాడుతూ గతంలో మహనీయులు చేసిన త్యాగాల వల్లే అన్ని వర్గాల వారు స్వేచ్ఛ సమానత్వంతో మెలుగుతున్నారని, నేటి తరం యువతకు కూడా సమాజసేవ చేసేందుకు తమ వంతుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ప్రొఫెసర్‌ కాశీం, పీయూ రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, పీయూ ప్రిన్సిపాల్‌ మధుసూదన్‌రెడ్డి, కుమారస్వామి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

‘ప్రజావాణి’కి 35 అర్జీలు 
1
1/1

‘ప్రజావాణి’కి 35 అర్జీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement