
రేషన్‌కార్డు మాకెప్పుడు?!
జిల్లాలో దరఖాస్తుదారుల ఎదురుచూపులు
●
ఎన్నోసార్లు దరఖాస్తు..
నాకు ఏడేళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం రేషన్ కార్డు మంజూరు చేయలేదు. ఎన్నోసార్లు దరఖాస్తు చేశాను. ఇటీవల గ్రామసభలో మా పేరు చదివినా కార్డు మాత్రం రాలేదు. దీంతో రేషన్‌తోపాటు వివిధ పథకాలు అందడం లేదు. అధికారులు వెంటనే స్పందించి రేషన్‌కార్డు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– సయ్యద్, అమ్రాబాద్
ఆదేశాలు రాగానే..
జిల్లాలో ఇప్పటికే కొందరికి రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వీరికి ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలు ఇస్తే అప్పటి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తాం. ప్రజాపాలన దరఖాస్తుల సర్వే కొనసాగుతుంది. సర్వే పూర్తి కాగానే అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపుతాం.
– శ్రీనివాసులు, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి
అచ్చంపేట: రేషన్‌కార్డు లేని నిరుపేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ పథకాలన్నింటికీ ఈ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో కార్డులేని వారు ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. అయితే అర్హులైన వారికి కొత్త రేషన్‌కార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేసింది. కానీ, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా మంజూరు చేసేందుకు సర్వేకు ఆదేశించింది. రేషన్‌కార్డు కోసం జిల్లావ్యాప్తంగా 2016 నుంచి వివిధ దశల్లో కొత్తగా 78,867 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ఎంపిక చేసిన గ్రామాల్లో 5,307 మందికి కార్డుల పంపిణీ చేశారు. ఈ నెల 1 నుంచి ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో మిగిలిన వారంతా కార్డు తమకెప్పుడు వస్తుందోనని ఎదరుచూస్తున్నారు.
అన్ని పథకాలకు ప్రామాణికంగా తీసుకోవడంతో అర్హుల ఆందోళన
ఇటీవల కొందరికి మంజూరు, పంపిణీ
మార్పులు, చేర్పులకుఅవకాశం ఇవ్వని ప్రభుత్వం
2016 నుంచి పెండింగ్‌లోనే వేలాది అర్జీలు