
ఖైదీలకు మెరుగైన సేవలు
నాగర్‌కర్నూల్ క్రైం: సబ్ జైల్లో ఖైదీలకు మెరుగైన సేవలు అందించాలని జడ్జి నసీం సుల్తానా అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జి నసీం సుల్తానా గురువారం సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, తినే ఆహార పదార్థాలు, వంటగది, వాష్‌రూంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరికై నా న్యాయ సహాయం అవసరమైతే న్యాయ సేవాధికార సంస్థ తరపున ఉచితంగా అందించి అడ్వకేట్‌ను నియమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ శ్రీరామ్ ఆర్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ పవన్ శేషు సాయి, సబ్ జైల్ సూపరింటెండెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యకరమైన
జీవనశైలిని అలవర్చుకోవాలి
నాగర్‌కర్నూల్ క్రైం: పరీక్షల ద్వారానే ప్రాథమిక స్థాయిలో జీవనశైలి ద్వారా సంక్రమించే వ్యాధులను గుర్తించవచ్చని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని చెప్పారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో వచ్చే నెల 1న నిర్వహించే నాలుగో విడత అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ పరీక్షలపై వైద్యాధికారులు, పర్యవేక్షణ సిబ్బందికి శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ అసంక్రమిత వ్యాధులైన రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్లు, పక్షవాతం, కిడ్నీ తదితర వ్యాధులతో ప్రజలలో 65 శాతం మరణాలు, అస్వస్థత కలుగుతున్నాయన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ప్రాథమిక దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరిని పరీక్షించడం ద్వారా మాత్రమే రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్లను గుర్తిస్తారన్నారు. జిల్లాలో ఇప్పటికే రక్తపోటుతో 77,301 మంది, మధుమేహంతో 38,457 మంది బాధపడున్నట్లు గుర్తించామన్నారు. మే 1 నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు 30 ఏళ్లు పైబడిన 4,35,081 మందిని సిబ్బంది ఇంటింటికి వెళ్లి రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వెంకటదాస్, వైద్యులు భీమానాయక్, తారాసింగ్, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి కృష్ణమోహన్, ప్రోగ్రాం అధికారి రవికుమార్, డీపీఓ రేనయ్య, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

ఖైదీలకు మెరుగైన సేవలు