
కొల్లాపూర్– నాగర్‌కర్నూల్ మధ్య..
మాకు కేటాయించిన బస్సును మార్చి 20 నుంచి కొల్లాపూర్– నాగర్‌కర్నూల్ మధ్య నడిపిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షలతో ఎలక్ట్రికల్ బస్సు కొనుగోలు చేసి అప్పగించింది. ఆర్టీసీ వారు నెలకు రూ.77,220 అద్దె చెల్లిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి డబ్బులు చెల్లించలేదు. పెద్దకొత్తపల్లి మండల మహిళా సమాఖ్య జిల్లాలోనే ఉత్తమ మహిళా సమాఖ్యగా ఎంపికై ంది.
– అరుణ, మండల మహిళా
సమాఖ్య అధ్యక్షురాలు, పెద్దకొత్తపల్లి
జిల్లాకు ఏడు బస్సులు..
నాగర్‌కర్నూల్ జిల్లాలోని 20 మండలాలకు గాను ఏడింటికి మొదటి విడతలో ఏడు బస్సులు మంజూరయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా పెద్దకొత్తపల్లికి చెందిన సమాఖ్య బస్సు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన రూ.30 లక్షల నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కాగా మహిళా సంఘాల అకౌంట్‌లో జమ అయ్యాయి.
– చిన్న ఓబులేషు, డీఆర్‌డీఓ, నాగర్‌కర్నూల్
●