
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: వేసవిలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఉంటాయని.. ఇందుకు గాను ప్రాథమిక, ఉన్నత పాఠశాల, మండల, జిల్లా స్థాయిల్లో ఆర్‌పీలుగా పనిచేసేందుకు ఆసక్తిగల ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రమేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉపాధ్యాయుల శిక్షణకు ఆర్‌పీలుగా నలుగురు జీహెచ్‌ఎంలు, మరో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలతో పాటు 228 మంది రిసోర్స్‌పర్సన్లు అవసరమన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఈ నెల 30వ తేదీలోగా ఆర్‌పీల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తుందన్నారు. ఎంపికై న ఆర్‌పీలకు మే నెలలో శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తిగల ఉపాధ్యాయులు ఈ నెల 24వ తేదీలోగా డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
బోనస్ ఆలస్యం కావొద్దు
బిజినేపల్లి: కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం అందించే బోనస్ ఆలస్యం కాకుండా చూడాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యాసంగిలో పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. అనంతరం 45 మందికి సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీరాములు, ఏఓ నీతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరాజుగౌడ్, తిరుపతయ్య, మిద్దె రాములు, నసీర్, మాన్యా నాయ క్, కత్తె ఈశ్వర్, పండ్ల పాషా తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక ప్రగతి సాధించాలి
మన్ననూర్: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని డీఆర్డీఓ చిన్న ఓబులేష్ సూచించారు. వాటర్‌షెడ్ పథకం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న అమ్రాబాద్ మండలం బీకే ఉప్పునుంతలలో బుధవారం గ్రామస్తులతో కలిసి ఆయన అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో డీఆర్డీఓ మాట్లాడుతూ.. వాటర్‌షెడ్ పథకం ద్వారా పండ్ల తోటలు, పశుగ్రాసం, పశుసంపద పెంచుకునేందుకు తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామ సమీపంలో ప్లాంటేషన్ ఏర్పాటు చేయడంతో పాటు పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి జగన్, ఏడీహెచ్ జ్ఞానశేఖర్, డీఆర్‌ఓ వాణికుమారి, ఎఫ్‌ఆర్‌ఓ వీరేష్, రామకృష్ణ, క్రాంతి, కేశవులు, సర్దార్ నాయక్, వాటర్‌షెడ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం