
అకాల వర్షం.. ఆగమాగం
● జిల్లాలో బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు
● విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న పంటలు
● వరద నీటిలో కొట్టుకుపోయిన వరిధాన్యం
జిల్లావ్యాప్తంగా ఆదివారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన వర్షం రైతులను ఆగమాగం చేశాయి. బలమైన ఈదురు గాలులు వీయడంతోపాటు వడగండ్లతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. వందలాది ఎకరాలు వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతినగా.. పంట కోసి ఆరబోసిన వేలాది బస్తాల వరిధాన్యం తడిసి ముద్దయ్యింది. కొన్నిచోట్ల వరద నీటిలో ధాన్యం సైతం కొట్టుకుపోయింది. అక్కడక్కడ విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో కరెంట్ సరఫరా నిలిచిపోగా..
అధికారులు పునరుద్ధరించే పనులు చేపట్టారు. నల్లమలతోపాటు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గత మూడురోజులుగా అకాల వర్షాలు కురుస్తుండటంతో రైతులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. – సాక్షి నెట్‌వర్క్

అకాల వర్షం.. ఆగమాగం

అకాల వర్షం.. ఆగమాగం

అకాల వర్షం.. ఆగమాగం

అకాల వర్షం.. ఆగమాగం