
కల్తీ కల్లు బాధితులే ఎక్కువ..
జనరల్ ఆస్పత్రిలోని మెడికల్ హెల్త్ సెంటర్‌కు కల్తీ కల్లు బాధితులు ఎక్కువగా వస్తున్నారు. కల్లులో మత్తుకోసం క్లోరో, ఆల్ఫ్రాజోలం, యాంటీ సైకోటిక్ పదార్థాలను కలుపుతుండటంతో తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. నిత్యం కల్తీకల్లు సేవించడం వల్ల బ్రెయిన్, లివర్, నాడీ సంబంధ సమస్యలకు లోనవుతున్నారు. చివరికి నోట మాటరాని పరిస్థితి ఎదురవుతోంది.
– డాక్టర్ అంబుజ, సైకియాట్రిస్ట్,
జిల్లా మెడికల్ హెల్త్ సెంటర్, నాగర్‌కర్నూల్
కౌన్సెలింగ్ ద్వారా చికిత్స..
కల్తీకల్లు వినియోగంతో నరాల బలహీనత, ఫిట్స్, తిమ్మిర్లు రావడం, చేతు లు, కళ్లలో మంటలతో ఆస్పత్రులకు వస్తున్నారు. వారికి కౌన్సెలింగ్, మందులు ఇచ్చి పంపిస్తున్నాం. తీవ్రమైన కేసులు ఉన్నవారిని హైదరాబాద్‌కు పంపుతున్నాం.
– డాక్టర్ రఘు, సూపరింటెండెంట్,
జనరల్ ఆస్పత్రి, నాగర్‌కర్నూల్
●

కల్తీ కల్లు బాధితులే ఎక్కువ..