
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆయూష్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని, దీర్ఘకాలిక రోగాలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయం చేసేందుకు ఆయూష్ మందులు పనిచేస్తాయని యునాని వైద్యాధికారి శభాజ్ మాలిక్ అన్నారు. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయూష్ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి మంగళవారం వరకు రక్త హీనత, పౌష్టికాహారంపై చిన్నపిల్లలు, గర్భిణులకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా జనరల్ ఆస్పత్రిలో గర్భిణులకు వైద్య చికిత్స నిర్వహించి మందులు పంపిణీ చేశామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో సైతం పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఫార్మసిస్ట్ మురళీకృష్ణగౌడ్, యోగా మహిళా కార్యకర్త అంజలి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.