కేజీబీవీలో డీఈఓ విచారణ
కందనూలు: జిల్లాకేంద్రం శివారులోని నాగనూలు కేజీబీవీలో మంగళవారం డీఈఓ రమేష్‌కుమార్ విచారణ చేపట్టారు. వివరాలు ఇలా.. కేజీబీవీలో 9వ తరగతి విద్యార్థిని స్టడీ అవర్స్‌కు ఆలస్యంగా వచ్చిందని మూడు గంటల పాటు నిలబెట్టిన ఓ ఉపాధ్యాయురాలు కనీసం నీళ్లు తాగనివ్వకుండా, బాత్రూం వెళ్లకుండా పనిష్మెంట్ ఇచ్చిందని మనస్తాపంతో చేయి కోసుకుంది. సమాచారం అందుకున్న డీఈఓ రమేష్‌కుమార్ కేజీబీవీ జిల్లా బాలిక అభివృద్ధి అధికారి శోభారాణితో కలిసి పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులతో విచారణ జరిపారు. విద్యార్థులను కలిసి ఉపాధ్యాయురాలి తీరు, విద్యార్థులతో ప్రవర్తిస్తున్న విధానం గురించి తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర నివేదిక కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. ముందుగా ఘటనకు కారకురాలైన ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీస్ జారీ చేశామని, ఉపాధ్యాయురాలి వివరణ అనంతరం పూర్తిస్థాయిలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఈఓ చెప్పారు. అయితే ఉపాధ్యా యురాలిని సస్పెండ్ చేయాలని పాఠశాల వద్ద మంగళవారం విద్యార్థి, కుల సంఘాల నాయ కులు ఆందోళన చేపట్టారు. పోలీసులు పాఠశాల దగ్గరకు వచ్చి విద్యార్థినికి న్యాయం చేస్తా మని చెప్పడంతో ఆందోళన విరమించారు.
బ్యాంక్ సేవలు గ్రామీణులకు చేరువ చేయాలి
లింగాల: మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకు సేవలను మరింత చేరువ చేయాలని ఆర్‌బీఐ లీడ్ జిల్లా అధికారి డిబోజిత్ భౌరా అన్నారు. మంగళవారం లింగాలలోని సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని సందర్శించిన ఆయన కేంద్రం నిర్వహణకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంక్ సేవలపై ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారనే విషయాలను తెలుసుకొని.. సూచనలు, సలహాలు అందించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సైబర్ క్రైం మోసాల గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. ఆర్థిక అక్షరాస్యత కేంద్రం పనితీరును మరింతగా మెరుగుపర్చుకొని సమర్థవంతంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు, యూబీఐ అధికారి లక్ష్మణ్, ఎఫ్‌ఎల్‌సీ శేషయ్య, సీఎఫ్‌ఎల్ కౌన్సిలర్లు ఎండీ మన్సూర్, రూపే ష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
నేడు ఏఐపై జాతీయ సెమినార్
జడ్చర్ల టౌన్: డా.బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్యశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)పై జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా.సుకన్య తెలిపారు. మంగళవారం కళాశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘వాణిజ్య రంగంలో ఏఐ ప్రభావం’ అన్న అంశంపై ఒకరోజు సెమినార్ కొనసాగుతుందని దేశంలోని వివిధ డిగ్రీ కళాశాలల నుంచి సెమినార్ కోసం ఆన్‌లైన్ ద్వారా ఇప్పటికే 130 జనరల్స్ వచ్చాయన్నారు. త్వరలోనే విద్యార్థులకు పాఠ్యాంశంగా తేబోతున్న ఏఐతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని అన్నారు. సరైన మార్గంలో వినియోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని, దానివల్ల కలిగే అనర్థాలు అదే తరహాలో వివిధ కళాశాలల నుంచి ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారన్నారు. సెమినార్‌కు రాష్ట్ర ఉన్నత విద్య కౌన్సిల్ చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, పీయూ వైస్ చాన్స్‌లర్ జీఎన్ శ్రీనివాస్, సీసీఈ జేడీ జి.యాదగిరి, రాజేందర్‌సింగ్, ఏజీఓ బాల భాస్కర్, ముఖ్యవక్త యలమంచిలి రామకృస్ణ, రీసోర్స్ పర్సన్ డా.కె.రాజ్‌కుమార్ హాజరుకానున్నారని తెలిపారు. వైస్‌ప్రిన్సిపాల్ డా.నర్మద, మీడియా కన్వీనర్ రాఘవేందర్, సభ్యులు సతీష్ పాల్గొన్నారు.
కేజీబీవీలో డీఈఓ విచారణ


