
పాలమూరు పనుల్లో కదలిక
వివరాలు 8లో u
● నార్లాపూర్– ఏదుల ప్రధాన కాల్వ పెండింగ్ పనులకు
రూ.780.63 కోట్లు మంజూరు
● డిసెంబర్ నాటికి కర్వెన రిజర్వాయర్ వరకు పనులు పూర్తిచేసేలా కార్యచరణ
● విడతల వారీగా పనులను పూర్తిచేయనున్న ప్రభుత్వం
ఏదుల రిజర్వాయర్
ప్రధాన కాల్వ నిర్మాణ పనులకు నిధులు..
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ మధ్యలో ప్రధాన కాల్వకు 1.725 కి.మీ. పాయింట్ నుంచి 2.125 పాయింట్ కాల్వ తవ్వకం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే 6.325 కి.మీ. పాయింట్ నుంచి 6.650 కి.మీ. పాయింట్ నడుమ కాల్వ నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది. ప్యాకేజీ 3 పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.780.63 కోట్లు కేటాయించింది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ మధ్య పెండింగ్‌లో ఉన్న అప్రోచ్ కెనాల్, ఓపెన్ కెనాల్ నిర్మాణంతో పాటు హెడ్ రెగ్యులేటరీ ఏర్పాటు కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. కుడికిళ్ల సమీపంలో ప్రధాన కాల్వ నిర్మాణం పూర్తిగా ఆగిపోయాయి. అక్కడ హార్డ్ రాక్‌తో కాల్వ తవ్వకాలకు ఇబ్బందిగా ఉందని చెబుతుండగా, తాజాగా ప్రభుత్వం అంచనాలను సవరించి నిధులను విడుదల చేసింది. గతంలో ఈ ప్యాకేజీ కింద పనులకు రూ.416.10 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం ఈ పనుల విలువను రూ.780.63 కోట్లకు చేరింది.