
11 నెలల్లో 4 మృత్యువాత..
చిరుత వలసలు పెరిగిన క్రమంలో నారాయణపేట జిల్లాలో 11 నెలల కాలంలో నాలుగు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. గత ఏడాది మే నాలుగో తేదీన మద్దూరు మండలం నందిగామ గ్రామ పంచాయతీ పరిధి మల్కిజాదరావుపల్లి శివారులోని పొలంలో ఓ చిరుత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అదే ఏడాది ఆగస్ట్ 17న అదే మండలం జాదరావుపల్లి శివారు తాటిగట్టు సమీపంలోని రాయం చెరువు వద్ద మరో చిరుత చనిపోయింది. ఈ ఏడాది జనవరి 28న దామరగిద్ద మండలం ఉడుమల్‌గిద్ద శివారులో ఉన్న గుట్టలో ఇంకొకటి, ఫిబ్రవరి 16న మద్దూరు మండలంల మోమినాపూర్ శివారులో మరొకటి మృత్యువాత పడింది. పోస్టుమార్టంలో ఇవి సహజ మరణాలేనని తేలినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సంరక్షణకు చర్యలు చేపట్టారు.
మోమిన్‌పూర్‌లో చనిపోయిన చిరుతను పరిశీలిస్తున్న అటవీ సిబ్బంది