
అణగారిన వర్గాలకూ రాజకీయ, సంక్షేమ ఫలాలు
నాగర్‌కర్నూల్/ కొల్లాపూర్: అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్‌లోని అంబేడ్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాలకు ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతోనే అణగారిన వర్గాల ప్రజలు సంక్షేమ, రాజకీయ ఫలాలు పొందుతున్నారన్నారు. అలాగే జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ బదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఫలాలు దేశ ప్రజలందరికీ అందాలన్న దృఢ సంకల్పంతో రాజ్యాంగాన్ని రచించి, అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమించిన మహనీయుడు అంబేద్కర్ అని, దళిత గిరిజన, వెనకబడిన, మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభివృద్ధికి కృషి చేశారన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసం అహర్నిశలు శ్రమించారన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి శ్రవణ్‌కుమార్, కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పూలే, అంబేడ్కర్ జాతర వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.
రాష్ట్ర ఎకై ్సజ్,
పర్యాటక శాఖ
మంత్రి జూపల్లి కృష్ణారావు

అణగారిన వర్గాలకూ రాజకీయ, సంక్షేమ ఫలాలు