
ఎవరూ చెప్పలేదు..
రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి. అన్ని అర్హతలు ఉన్నా సంక్షేమ ఫలాలు అందడం లేదు. ఉపాధి హామీ పథకంలో ఉన్న అనేక పథకాల గురించి ఎవరూ చెప్పడం లేదు. అర్హులైన రైతులందరికీ జీవాల షెడ్లను మంజూరు చేయాలి. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
– శ్రీనివాసులు, రైతు,
గోదల్, బల్మూర్ మండలం
సద్వినియోగం చేసుకోవాలి..
ఉపాధి హామీ పథకంలో సన్న, చిన్నకారు రైతులకు షెడ్లు, ఫాంఫాండ్ వంటి వాటిని మంజూరు చేస్తున్నాం. ఇప్పటికే చాలా చోట్ల రైతులకు అవగాహన కల్పించాం. అర్హులైన సన్న, చిన్నకారు రైతులు జాబ్‌కార్డు కలిగి ఉండి గ్రామ పంచాయతీ కార్యదర్శుల వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో షెడ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తాం.
– చిన్న ఓబులేషు, డీఆర్‌డీఓ
●

ఎవరూ చెప్పలేదు..