
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
వెల్దండ: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. వాటిలోనే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పలు పాఠశాలల్లో అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మండలానికి రూ.5 కోట్లు మంజూరు చేశారని, వాటితో కస్తూర్బాగాంధీ విద్యాలయ, జెడ్పీ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్, సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో వివిధ పనులు చేపడుతున్నట్లు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో డీఈఓ రమేష్‌కుమార్, తహసీల్దార్ కార్తీక్‌కుమార్, ఎంపీడీఓ సత్యపాల్‌రెడ్డి, డీఈఈ రామచందర్, నాయకులు బాలాజీసింగ్, భూపతిరెడ్డి, సంజీవ్‌కుమార్, మోతీలాల్‌నాయక్, మట్ట వెంకటయ్యగౌడ్, పర్వత్‌రెడ్డి, బచ్చు రామకృష్ణ, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
సైన్స్ ల్యాబ్ ప్రారంభం..
కల్వకుర్తి రూరల్: మండలంలోని తాండ్ర ఉన్నత పాఠశాలలో బుధవారం సైన్స్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కాయతి ఆశాదీప్‌రెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం ల్యాబ్ ఏర్పాటుకు రూ.లక్ష విరాళం అందించగా.. ఉపాధ్యాయులు మరో రూ.80 వేలు జమచేసి ల్యాబ్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అందరిని అభినందించారు. కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు సభ్యుడు బాలాజీసింగ్, కాయతి విజయకుమార్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, కాయతి ఆశాదీప్‌రెడ్డి, సాయిరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు జహంగీర్, ఉపాధ్యాయుడు జంగయ్య, నాయకులు పాల్గొన్నారు.