
బీజేపీని మరింత బలోపేతం చేద్దాం
కందనూలు: క్షేత్రస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. బీజేపీని స్థాపించి నేటితో 46 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఎంతో మంది పార్టీ కో సం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తుండటంతో నే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు కార్యకర్తలు కృషిచేయాలని కోరారు.