
ముంచిన నాసిరకం వరి సీడ్
పంట కాలం ముగుస్తున్నా ఈనె దశలోనే వరి
బల్మూర్: మా కంపెనీ విత్తనాలతో అధిక దిగుబడి వస్తుందని ఏజెంట్లు చెప్పిన మాటలు నమ్మి.. సదరు సీడ్ విత్తనాలతో పంట సాగు చేసిన రైతులు నట్టేట మునిగారు. కంపెనీ పేరుతో మార్కెట్‌లోకి వచ్చిన సంజీవని (పీఎంఎస్‌పీ–1122) రకం వరి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు పంటలను సాగు చేశారు. కానీ, పంట కాలం ముగుస్తున్నా నేటికీ ఈనె దశలోకి కూడా రాకపోవడంతో నాసిరకం విత్తనాలతో నష్టపోయామని గగ్గోలు పెడుతున్నారు. మండల కేంద్రం బల్మూర్‌కు చెందిన ఎనిమిది మంది రైతులు స్థానికంగా ఓ లైసెన్స్ కలిగిన డీలరు వద్ద సంజీవని (పీఎంఎస్‌పీ– 1122) రకం వరి విత్తనాలు తీసుకెళ్లి నల్ల చెరువు ఆయకట్టు కింద జనవరి మొదటి వారంలో సుమారు 16 ఎకరాల్లో పంట సాగు చేశారు. ప్రస్తుతం తమ పక్క పొలంలో సాగు చేసిన వరి పంటలు కోతలకు రాగా.. తాము సాగు చేసిన సదరు సీడ్ విత్తనం పంటల గడువు దాటినా కూడా ఈనె దశకు రాకపోవడంతోపాటు వివిధ రకాల తెగుళ్లు సోకుతున్నాయని రైతులు వాపోతున్నారు.
స్పందించని సీడ్స్ కంపెనీ ప్రతినిధులు
నాసిరకం విత్తనాలతో నట్టేట
ముంచారని అన్నదాతల ఆవేదన
రైతుల ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో
పరిశీలించిన డీఏఓ, శాస్త్రవేత్తలు
నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడి