జీతాలు అందక అంగన్‌వాడీ ఆత్మహత్య | anganwadi suicide in ananthpuram distirict | Sakshi
Sakshi News home page

జీతాలు అందక అంగన్‌వాడీ ఆత్మహత్య

Published Fri, Mar 20 2015 2:57 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

anganwadi suicide in ananthpuram distirict

అనంతపురం : ప్రభుత్వం అంగన్‌వాడీలకు గౌరవజీతాలు అందించకపోవడంతో ఒక అంగన్‌వాడీ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతరపురం జిల్లా కళ్యాణదుర్గం మారెంపల్లిలో శుక్రవారం జరిగింది. వివరాలు..మారెంపల్లికి చెందిన సుశీలమ్మ(45) బెలుసప్త మండలంలోని యలగలవంక తండాలో అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఐదు నెలలుగా జీతాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక శుక్రవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతురాలి కుమారుడు కడప రిమ్స్‌లో వైద్య విద్య చదువుతున్నాడు. కొడుకు పరీక్ష ఫీజు కట్టే స్థితిలో లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్యహత్య కు పాల్పడిందని స్తానికులు తెలిపారు.
(కళ్యాణదుర్గం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement