అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి బ్యాంగిల్ షాపు స్టోర్ రూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూ.5 లక్షల విలువచేసే వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.
కళ్యాణదుర్గంలో అగ్ని ప్రమాదం: రూ.5లక్షల ఆస్తి నష్టం
Published Sun, Feb 8 2015 10:21 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement