పాతకక్షలతో ఇంటికి నిప్పు పెట్టి.. | fire accident in ananthpur district | Sakshi
Sakshi News home page

పాతకక్షలతో ఇంటికి నిప్పు పెట్టి..

Published Wed, Apr 27 2016 9:47 AM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM

fire accident in ananthpur district

కల్యాణదుర్గం: అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం మండలంలో పాత  కక్షలతో  దుండుగులు ఓ వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ సంఘటన మండలంలోని మల్లికార్జునపల్లెలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రసాద్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇళ్ళు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద సమయంలో అప్రమత్తమైన ఇంట్లో వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఇంటితో పాటు సామగ్రి, నిల్వ ఉంచిన రూ.1.50 లక్షల విలువ చేసే పొగాకు పూర్తిగా కాలిపోయాయి. మొత్తం రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. పాతకక్షలను మనస్సులో పెట్టుకుని గ్రామానికి చెందిన వారే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement