
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభలో ఇప్పుడు టీడీపీని ఆచూకీ లేకుండా చేశాం. రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా మళ్లీ సీఎం జగన్ గెలవడం ఖాయమని చెప్పుకొచ్చారు.
కాగా, ఈరోజు రాజ్యసభ ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాడు లోక్‌సభలో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశాను. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం ముందు నడిచాను. సీఎం జగన్ ఆశీస్సులతో మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కావడం ఆనందంగా ఉంది. రాజ్యసభలో ఇప్పుడు టీడీపీని ఆచూకీ లేకుండా చేశాం.
రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైంది. రాజ్యసభలో 11కు 11 సీట్లు వైఎస్సార్‌సీపీనే గెలిచింది. ఈ సంఖ్యాబలం వల్ల రాష్ట్ర అభివృద్ధికి మరింత మేలు జరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు సాధిస్తాం. ముఖ్యమంత్రిగా మళ్లీ సీఎం జగన్ గెలవడం ఖాయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని కామెంట్స్ చేశారు.