సాక్షి, ఢిల్లీ: లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు ముస్లిం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. అలాగే, ఈ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అభిప్రాయాలతో తాము ఏకీభవిస్తున్నామని వెల్లడించారు.
కాగా, ఈరోజు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఈ బిల్లును వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించింది. బిల్లును సభలో ప్రవేశపెట్టే మందు ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఇక, ఈ బిల్లును వైఎస్సార్‌సీపీ, టీఎంసీ, ఎస్పీ, కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించాయి. అలాగే, టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి.
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కామెంట్స్..
వక్ఫ్ బిల్లుతో మత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. వక్ఫ్ సవరణ బిల్లు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, అధికారాల విభజనకు విఘాతం కలిగిస్తుంది. వక్ఫ్ ఆస్తులు మతపరమైన కార్యక్రమాల నిర్వహణ కోసం ఉన్నాయి. ఆర్టికల్-25కి భంగం కలిగేలా ఈ బిల్లు ఉంది. అల్లా పేరు మీద ఆస్తిని విరాళంగా ఇచ్చే అవకాశం లేకుండా చేశారు. దర్గా, మసీదుల ఆస్తులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment